NTV Telugu Site icon

Stock market: స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్.. ప్రభుత్వరంగ బ్యాంకుల హవ!

Stockmarket

Stockmarket

దేశీయ స్టాక్ మార్కెట్ గురువారం మరోసారి రికార్డుల దిశగా దూసుకెళ్లింది. అంతర్జాతీయ మార్కెట్‌లోని సానుకూల సంకేతాలు మన మార్కెట్‌కు బాగా కలిసొచ్చింది. గురువారం ఉదయం భారీ లాభాలతో ప్రారంభమైన సూచీలు.. చివరిదాకా గ్రీన్‌లోనే ట్రేడ్ అయ్యాయి. అంతేకాకుండా సెన్సెక్స్ 1,500 పాయింట్లు దూసుకెళ్లి తొలిసారిగా 83 వేల మార్కు దాటింది. కాగా.. నేడు మాత్రం అంతర్జాతీయ మార్కెట్‌లోని మిశ్రమ సంకేతాల నడుమ ఫ్లాట్‌గా సూచీలు ప్రారంభమయ్యాయి.

READ MORE: Chittoor District: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంపై రవాణా శాఖ మంత్రి ఆరా..

ఈ రోజంతా అలాగే కొనసాగాయి. చివరకు స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఇదిలా ఉండగా.. ప్రభుత్వ రంగా బ్యాంకులు మాత్రం దూసుకుపోయాయి. సెన్సెక్స్‌ ఉదయం 83,091.55 వద్ద ఫ్లాట్‌గా ప్రారంభమై… ఇంట్రాడేలో 82,653.22 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. మార్కెట్ ముగిసే సరికి 1.77 పాయింట్ల నష్టంతో 82,890 వద్ద ముగిసింది. నిఫ్టీ 32.40 పాయింట్లు నష్టపోయి 25,356 వద్ద నిశ్చలంగా ఉంది.

READ MORE: Viral News: 24 ఏళ్లుగా రోజూ10 సిగరెట్లు.. ఒక్కసారిగా మానేసిన వ్యక్తి.. ఎలాగో చూడండి

సెన్సెక్స్‌ 30 సూచీలో కొన్ని కంపెనీల షేర్లు నష్టపోయాయి. అందులు ప్రముఖ కంపెనీలైన సన్‌ఫార్మా, పవర్‌ గ్రిడ్‌, హెచ్‌యూఎల్‌, ఎల్‌అండ్‌టీ, ఇన్ఫీ, అదానీ పోర్ట్స్‌, ఐటీసీ, భారతీ ఎయిర్‌టెల్‌, ఎన్‌టీపీసీ, మారుతీ సుజుకీ, ఏషియన్‌ పెయింట్స్‌ కంపెనీలు ఉన్నాయి. టాటా స్టీల్‌తో పాటు యాక్సిస్‌ బ్యాంక్‌, టెక్‌ మహీంద్రా, టాటా మోటార్స్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ఫైనాన్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో దూసుకెళ్లాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 72.62 డాలర్లు వద్ద ట్రేడవుతుంది.

Show comments