Tech Layoffs 2026: టెక్ రంగంలో కలకలం.. రెండు వారాల్లోనే 25,000 మందికి ఉద్వాసన..
- టెక్ రంగంలో ‘‘లేఆఫ్స్’’..
- మే నెల రెండు వారాల్లోనే 25 వేల మందికి ఉద్వాసన..
- ఏఐ ప్రణాళికల్లో భాగంగానే ఉద్యోగుల కోతలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tech Layoffs 2026: టెక్ కంపెనీల్లో ఉద్యోగాల కోతలు ఆగడం లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) రాకతో పరిస్థితి తారుమారైంది. గ్లోబల్ టెక్ కంపెనీలు తమ స్టాఫ్‌ను తగ్గించుకుని, ఏఐపై పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఖర్చుల్ని తగ్గించుకోవడానికి లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. పరిస్థితి ఎలా ఉందంటే, ఈ ఏడాది మే నెల తొలి రెండు వారాల్లోనే ఏకంగా 25,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి.
Layoff.fyi గణాంకాల ప్రకారం, PayPal 4,700 మందికి పైగా ఉద్యోగులను తొలగించగా, ఆ తర్వాతి స్థానంలో సిస్కో నిలిచింది. ఈ సంస్థ 4000 మందిని తీసేసింది. ఏఐ కారణంగా రాబోయే రెండు నుంచి మూడేళ్లలో తన ఉద్యోగుల సంఖ్యను సుమారు 20 శాతం మేర తగ్గించాలని PayPal యోచిస్తోంది. సిస్కో కూడా ఏఐ ప్రణాళికలపై దృష్టి పెట్టడంతో ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు ప్రకటించింది.
Also Read
- CIBIL Score: మీ ‘సిబిల్’ స్కోర్ తక్కువగా ఉందా? రికవర్ చేయడానికి ఈ 5 చిట్కాలు పాటించండి..
- 1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
- Land vs Flat: రాము రూ. పది లక్షలతో భూమి కొన్నాడు.. రవి అదే డబ్బుతో ఫ్లాట్ కొన్నాడు.. 20 ఏళ్ల తర్వాత ఎవరు ధనవంతులు?
- iPhone 18 వచ్చేసింది.. కానీ iPhone 17కే డిమాండ్.. కారణం తెలిస్తే షాక్ అవుతారు!
క్లౌడ్‌ఫ్లేర్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 1,100 మందికి పైగా ఉద్యోగులను తొలగిస్తోంది. ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ప్లాట్‌ఫామ్ లింక్డ్ఇన్ 875 ఉద్యోగాలను తగ్గించగా, ఫైనాన్షియల్ సాఫ్ట్వేర్ సంస్థ బిల్డాట్కామ్ 709 మందిని తొలగిస్తోంది. క్రిప్టో ఎక్స్చేంజ్ సంస్థ కాయిన్‌బేస్ కూడా 700 ఉద్యోగాలను తగ్గిస్తోంది. ఇండియన్ సాఫ్ట్వేర్ కంపెనీ ఫ్రెష్‌వర్క్స్ 500 మందిని తొలగిస్తోంది. టికెట్ బుకింగ్ సంస్థ టికెట్‌మాస్టర్ 350 ఉద్యోగాలను తగ్గిస్తుండగా, జూమ్ఇన్ఫో 300 మందిని తొలగిస్తోంది. AI ట్రాన్స్లేషన్ టెక్నాలజీ కంపెనీ డీప్ఎల్ కూడా 250 ఉద్యోగాలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.
తాజావార్తలు
-
Explainer: సిక్కులపై అమెరికా పగ పట్టిందా?
-
Xi Jinping: భారత్‌లో అడుగు పెట్టిన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్.. మోడీతో భేటీపై అందరి చూపు..
-
MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
-
CIBIL Score: మీ ‘సిబిల్’ స్కోర్ తక్కువగా ఉందా? రికవర్ చేయడానికి ఈ 5 చిట్కాలు పాటించండి..
-
China-India Air Connectivity: 6 ఏళ్ల తర్వాత మళ్లీ గ్వాంగ్జౌ-న్యూఢిల్లీ విమాన సర్వీసులు.. సెప్టెంబర్ 21 నుంచి రాకపోకలు
ట్రెండింగ్
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..