TCS Layoffs: దేశీయ ఐటీ దిగ్గజ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)లో ఇటీవల జరిగిన లేఆఫ్స్‌పై పెద్ద వివాదం చెలరేగింది. అధికారిక గణాంకాల ప్రకారం.. కంపెనీ 12,200 మంది ఉద్యోగులను తొలగించింది. అయితే వాస్తవ లేఆఫ్స్‌పై సోషల్ మీడియాలో ఇప్పుడు తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కంపెనీ అధికారి గణాంకాలు వాస్తవికతకు చాలా దూరంగా ఉన్నాయని పలువురు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. వాస్తవానికి కంపెనీలో లేఆఫ్స్ కారణంగా సుమారుగా 60 వేల మంది ఉద్యోగులు ప్రభావితమయ్యారని ప్రముఖ మేనేజ్మెంట్ నిపుణురాలు, కన్సల్టెంట్ దేవిక గౌతమ్ తన X ఖాతాలో పేర్కొన్నారు.
READ ALSO: ONGC Oil Leak Row: ఓఎన్జీసీ ఆయిల్ లీక్.. అధికారులపై తిరగబడ్డ గ్రామస్తులు
టీసీఎస్‌లో ఏం జరుగుతుంది..
ప్రముఖ కన్సల్టెంట్ దేవిక గౌతమ్ తన X ఖాతాలో ఆదివారం ఉదయం ఒక పోస్ట్ చేశారు. TCS నిర్వాహకులకు అకస్మాత్తుగా అత్యవసర ఆదేశం వచ్చిందని ఈ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఆ సందేశంలో “మీ బృందంలోని 10% మందిని వెంటనే తొలగించి తిరిగి నియమించండి” అని ఉందని తెలిపారు. ఈ నిర్ణయాన్ని ఉద్యోగుల పనితీరు లేదా అంచనా తనిఖీల ఆధారంగా తీసుకోలేదని, ఇది పై నుంచి వచ్చిన ఒత్తిడితో తీసుకున్న నిర్ణయం అని చెప్పారు. ఈ నిర్ణయం సంస్థ ఉద్యోగులపై పెద్ద ప్రభావాన్ని చూపిస్తుందని అన్నారు. తాజా తొలగింపుల్లో తక్కువ పనితీరు కనబరిచిన ఉద్యోగులనే కాకుండా అనేక ఇతర వర్గాల ఉద్యోగులను కూడా లక్ష్యంగా చేసుకున్నారని చెప్పారు. కంపెనీలో కొత్త పదవులు కోరుకునే ఉద్యోగులను, నాయకత్వంతో విభేదించిన వారిని ఫస్ట్ కంపెనీ నుంచి బయటకు పంపించారని చెప్పారు. సహాయక పాత్రల్లో ఉన్న ఉద్యోగులను కూడా పనికి రానివారిగా భావించి తొలగించారని పేర్కొన్నారు. తొలగింపులను సమర్థించడానికి యాజమాన్యం అనేక కారణాలను ఉదహరించింది, కానీ దేవిక గౌతమ్ వాటిని అబద్ధాలని తోసిపుచ్చింది. అన్ని ఉద్యోగులకు ఒకే విధమైన శిక్షణ లభిస్తున్నందున నైపుణ్యాల కారణంగా తొలగింపులు జరిగాయనే వాదన నిరాధారమైనదని ఆమె చెప్పింది.
వాస్తవానికి విరుద్ధంగా CEO ప్రకటనలు..
కంపెనీ CEO చేసిన ప్రకటనలలో అతిపెద్ద వైరుధ్యం ఉందని ఆమె చెప్పారు. “మా సంస్థలో తొలగింపులు ఉండవు. మేము దేశ నిర్మాతలు. మేము సామాజికంగా బాధ్యత వహిస్తాము” అని గత త్రైమాసికంలో CEO స్పష్టంగా చెప్పారని ఆమె గుర్తు చేశారు. ప్రస్తుత త్రైమాసిక సమయంలో ఆయన గతంలో చెప్పిన మాటలకు విరుద్ధంగా కనిపిస్తోందని అన్నారు. కంపెనీ తాజా చర్యలు పునర్నిర్మాణం, ఆప్టిమైజేషన్ లేదా భవిష్యత్తు సంసిద్ధత కాదని దేవిక గౌతమ్ అంటున్నారు. ఇది కేవలం సంఖ్యల ఆటగా అభివర్ణించారు. ఈ ఆట ఏంటంటే కంపెనీలు మొదట ఒక తప్పుడు అత్యవసర పరిస్థితి సృష్టిస్తాయని, ఆ తరువాత దాని బాధ్యతను కింది స్థాయి నిర్వాహకులకు బదిలీ చేస్తారని, అక్కడి నుంచి మొత్తం కథ PR వ్యవస్థలు నియంత్రిస్తాయని అన్నారు. అంతిమంగా కంపెనీ నిర్ణయాలకు యుద్ధం లేదా మార్కెట్ పరిస్థితులు వంటివి కారణాలు చూపి ప్రపంచాన్ని నమ్మిస్తాయని అంటున్నారు.
దేవిక గౌతమ్ వాదనతో సోషల్ మీడియా వేదికగా చాలా మంది నెటిజన్లు ఏకీభివిస్తున్నారు. అనేక యూనియన్లు, చాలా నివేదికలు టీసీఎస్ నుంచి 30 వేల మంది వరకు తొలగింపుల సంఖ్యను ఉంటుందని పేర్కొంటున్నాయి. 50 వేల నుంచి 60 వేల మంది ఉద్యోగులను తొలగించి ఉండవచ్చనే పుకార్లు కూడా చాలా వైరల్‌గా మారాయి. వీటిపై కంపెనీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
READ ALSO: Girl Killed Boyfriend: గర్భవతి అయిన ప్రియురాలు.. ప్రియుడిని దారుణంగా హత్య.. ఎందుకంటే?