NTV Telugu Site icon

Swiggy- Zomato: కస్టమర్లకు షాకిచ్చిన స్విగ్గీ, జొమాటో..!

Zomato

Zomato

Swiggy- Zomato: ఫుడ్‌ డెలివరీ సంస్థలు స్విగ్గీ, జొమాటోలు కస్టమర్లకు తాజాగా బిగ్ షాకిచ్చాయి. ఢిల్లీ, బెంగళూరు లాంటి డిమాండ్ ఉన్న నగరాల్లో ప్లాట్‌ఫామ్ ఫీజును ఇకపై 6 రూపాయలు చేసినట్టు తెలిపింది. గతంలో ఈ ఫీజు రూ.5గా ఉండేది.. దీంతో ఫ్లాట్‌ఫామ్ ఫీజు 20 శాతం మేర పెంచినట్లైంది. అయితే, బెంగళూరులో ఫీజును స్విగ్గీ తొలుత రూ.7గా నిర్ణయించినా.. ఆ తరువాత రాయితీ ఇచ్చి రూ.6గా ఫిక్స్ చేసింది. అయితే, గతంలో కూడా జొమాటో- స్విగ్గీలు తమ ప్లాట్‌ఫాం ఫీజును ఒకేసారి పెంచాయి. 2023లో ఈ తరహా ఫీజును స్టార్ట్ చేసాయి. మొదట 2 రూపాయలుగా ఉన్న ఫీజును విడతల వారీగా పెంచుతూ వచ్చాయి. ఏప్రిల్‌లో జొమాటో ఈ ఫీజును 25 శాతం మేర పెంచి 5 రూపాయలకు ఫిక్స్ చేసింది. ఢిల్లీ, బెంగళూరు, ముంబై, హైదరాబాద్, లఖ్‌నవూ నగరాలలో ఈ పెంపును వర్తింపజేసింది. మరింత వేగవంతమైన డెలివరీల కోసం ప్రియారిటీ ఫీజు పేరిట ప్రత్యేక రుసుమును కూడా వసూలు చేయబోతుంది.

Read Also: UP: నోయిడాలోని బ్యాంకు సర్వర్‌ హ్యాక్‌… 5 రోజుల్లో 16 కోట్లు విత్‌డ్రా

కాగా, ఒక్కో ఆర్డరపై వచ్చే సగటు ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా డెలివరీ యాప్‌లు ఈ తరహా ఫీజులు వసూలు చేస్తున్నాయి. బెంగళూరులో బ్లింకిట్ ఒక్కో ఆర్డర్‌పై 4 రూపాయలు, ఇన్‌స్టా మార్ట్‌ 5 రూపాయలు వసూలు చేస్తుండగా.. ఢిల్లీలో ఈ చార్జీలు వరుసగా రూ.16, రూ.4గా ఉన్నాయి. మరోవైపు, కొన్ని సమయాల్లో ఈ రెండు ప్లాట్‌ఫామ్‌ల సర్ చార్జీలు కూడా వసూలు చేస్తున్నట్లు పేర్కొన్నాయి. టాటా గ్రూపునకు చెందిన బీబీనౌ 99 రూపాయలకు పైన విలువ చేసే ఆర్డర్లపై 5 రూపాయల హ్యాండ్లింగ్ చార్జీలు వసూలు చేస్తుంది.