Site icon NTV Telugu

Stock Markets: లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. ఆల్‌టైం కనిష్టానికి రూపాయి పతనం

Stock Market

Stock Market

బుధవారం భారీ నష్టాలను చవిచూసిన స్టాక్ మార్కెట్లు గురువారం నాడు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 443 పాయింట్ల లాభంతో 52,265 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 143 పాయింట్ల లాభంతో 15,556 వద్ద స్థిరపడింది. ఒక దశలో 600 పాయింట్ల వరకు సెన్సెక్స్ లాభపడుతుందని విశ్లేషకులు భావించారు. అటు నిఫ్టీ కూడా 15,600 పాయింట్లను దాటుకుని వెళ్లింది. అయితే చివరకు లాభాల జోరు తగ్గింది. ఈరోజు ట్రేడింగ్‌లో దాదాపు అన్ని రంగాల షేర్లు లాభపడ్డాయి. ముఖ్యంగా ఆటో, ఐటీ, ఫార్మా, బ్యాంకింగ్‌ రంగ షేర్లలో కొనుగోళ్లు కనిపించాయి.

నిఫ్టీ 50లో మారుతీ సుజుకీ, హీరో మోటోకార్ప్, ఐషర్ మోటార్స్, ఎం అండ్ ఎం, బజాజ్ ఆటో షేర్లు లాభాలను ఆర్జించాయి. రిలయన్స్, కోల్ ఇండియా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఎన్టీపీసీ వంటి కంపెనీల షేర్లు నష్టాలను చవిచూశాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.78.32గా కొనసాగుతోంది. విదేశీ ఇన్వెస్టర్లు దేశీయ మార్కెట్ నుంచి నిధులు ఉపసంహరించుకోవడం, డాలర్ బలపడటం వంటి కారణాలతో రూపాయి సరికొత్త కనిష్ట స్థాయికి చేరుకుందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

POCO F4 5G: భారత మార్కెట్‌లోకి పోకో నుంచి 5జీ స్మార్ట్‌ఫోన్‌..

Exit mobile version