Site icon NTV Telugu

Stock Market: ట్రంప్ ప్రకటనతో మార్కెట్‌కు జోష్.. భారీ లాభాల్లో సూచీలు

Stockmarket

Stockmarket

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటన స్టాక్ మార్కెట్‌కు సరికొత్త ఊపు తీసుకొచ్చింది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ముగిసిందంటూ ప్రకటించారు. 24 గంటల్లో దశలవారీగా కాల్పుల విరమణ జరుగుతోందని వెల్లడించారు. ఈ ప్రకటన ఇన్వెస్టర్లలో సరికొత్త జోష్ తీసుకొచ్చింది. నిన్నామొన్నటి దాకా తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న మార్కెట్.. మంగళవారం ఉదయం స్టాక్ మార్కెట్ ప్రారంభమైనప్పటి నుంచి సూచీలు భారీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. భౌగోళికంగా రాజకీయ ఉద్రిక్తతలు తగ్గడంతో సెన్సెక్స్, నిఫ్టీ ర్యాలీలు పరుగులు పెట్టాయి. ప్రారంభంలో సెన్సె్క్స్ 930 పాయింట్ల లాభంతో దూసుకెళ్లగా.. ప్రస్తుతం 900 దగ్గర కొనసాగుతోంది. ఇక నిఫ్టీ 278 పాయింట్లతో దూసుకెళ్లగా.. ప్రస్తుతం 264 పాయింట్ల లాభంతో 25, 236 దగ్గర కొనసాగుతోంది. ఇక అంతర్జాతీయంగా చమురు ధరలు కూడా దిగొస్తు్న్నాయి.

ఇది కూడా చదవండి: Shubhanshu Shukla: రేపు రోదసిలోకి వెళ్లనున్న భారత వ్యోమగామి శుభాంశు శుక్లా

దాదాపు అన్ని రంగాల సూచీలు ఉత్సాహాన్నిస్తున్నాయి. ఆటో, బ్యాంకింగ్, ఎఫ్‌ఎంసీజీ, లోహ, ఐటీ రంగ సూచీలు ఒక శాతానికి పైగా పెరిగాయి. రియాల్టీ, హెల్త్‌కేర్‌ రంగ సూచీలు కూడా లాభాల్లో పయనిస్తున్నాయి. నిఫ్టీలో అదానీ పోర్ట్స్, శ్రీరామ్ ఫైనాన్స్, ఎం అండ్ ఎం, అల్ట్రాటెక్ సిమెంట్, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ అత్యధికంగా లాభపడ్డాయి.

ఇది కూడా చదవండి: Sunil Gavaskar – Rishabh Pant: స్టుపిడ్ టూ సూపర్బ్.. సునీల్ గవాస్కర్, పంత్ మధ్య మాములుగా లేదుగా..!

Exit mobile version