దేశీయ స్టాక్ మార్కెట్‌లో వరుస నష్టాలు కొనసాగుతున్నాయి. మన మార్కె్ట్‌కు నవంబర్ నెల అంతగా కలిసి రానున్నట్లుగా కనిపిస్తోంది. అమెరికా అధ్యక్ష ఫలితాలకు ముందు అనిశ్చితి ఏర్పడడంతో సూచీలు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. ఫలితాలు వచ్చాక అధ్యక్షుడెవరో ఒక క్లారిటీ వచ్చేసింది. ట్రంప్ జయకేతనంతో మార్కెట్లకు నూతన ఉత్సాహం రాబోతుందని అంతా భావించారు. కానీ అలాంటి పరిస్థితులు ఎక్కడా కనిపించడంలేదు. గత మూడు రోజులుగా వరుస నష్టాల్లో కొనసాగుతున్నాయి. బుధవారం నష్టాలతో ప్రారంభమైన సూచీలు.. చివరిదాకా నష్టాల్లోనే కొనసాగాయి. దీంతో ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. ఇక ముగింపులో సెన్సెక్స్ 984 పాయింట్లు నష్టపోయి 77, 690 దగ్గర ముగియగా.. నిఫ్టీ 324 పాయింట్లు నష్టపోయి 23, 559 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే రూ.84.38 దగ్గర ముగిసింది.
నిఫ్టీలో హీరో మోటోకార్ప్, హిందాల్కో, టాటా స్టీల్, ఎం అండ్ ఎం, ఐషర్ మోటార్స్ భారీ నష్టాల్లో కొనసాగగా.. ఎన్‌టీపీసీ, బ్రిటానియా ఇండస్ట్రీస్, హెచ్‌యుఎల్, టాటా మోటార్స్ లాభపడ్డాయి. ఆటో, క్యాపిటల్ గూడ్స్, మెటల్, రియల్టీ, పవర్ మీడియా 2-3 శాతం క్షీణించడంతో అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి. బీఎస్‌ఇ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 2.7 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 3 శాతం క్షీణించాయి.