దేశీయ స్టాక్ మార్కె్ట్‌కు మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలకు ముందు సరికొత్త జోష్ వచ్చింది. గత ఐదు నెలల్లో ఎన్నడూ చూడని విధంగా సూచీలు రాకెట్‌లా దూసుకుపోయాయి. అంతర్జాతీయ మార్కెట్‌లోని సానుకూల సంకేతాలు మన మార్కెట్‌కు బాగా కలిసొచ్చాయి. గురువారం అదానీ గ్రూప్‌పై అమెరికా కేసుతో అన్ని సూచీలు భారీగా నష్టం చూశాయి. కానీ ఒక్క రోజులోనే భారీ మార్పు చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు.. అనంతరం క్రమక్రమంగా పుంజుకుంటూ భారీ లాభాలతో ట్రేడ్ అయ్యాయి. ఇక ముగింపులో సెన్సెక్స్ 1961 పాయింట్లు లాభపడి 79,117 దగ్గర ముగియగా.. నిఫ్టీ 557 పాయింట్లు లాభపడి 23, 907 దగ్గర ముగిసింది.
సెన్సెక్స్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్, పవర్ గ్రిడ్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ మరియు టెక్ మహీంద్రా అత్యధికంగా లాభపడ్డాయి. ఇక నిఫ్టీలో ఐటీ , బ్యాంకులు, ఆయిల్ అండ్ గ్యాస్ మరియు రియాల్టీ ప్రధాన రంగాలలో లాభపడిన వాటిలో ఉన్నాయి. ఒక్కరోజు భారీ నష్టాల తర్వాత ఒకేసారి ఇన్ని లాభాలు రావడం ఐదు నెలల్లో ఇదే తొలిసారి కావడం విశేషం.