ట్రంప్ బెదిరింపులు.. అంతర్జాతీయ ఉద్రిక్తతలతో స్టాక్ మార్కెట్ కుదేల్ అయిపోయింది. నిన్న రూ.12 లక్షల కోట్ల సంపద ఆవిరైపోగా.. ఈరోజు రూ.3లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. గత కొద్ది రోజులుగా గ్రీన్‌లాండ్ వ్యవహారంపై ప్రపంచ వ్యాప్తంగా ఉద్రిక్తతలు నడుస్తున్నాయి. ఈ ప్రభావం ఆసియా మార్కెట్‌తో పాటు దేశీయ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.
ఇది కూడా చదవండి: Gold Rates: మగువలకు బిగ్ షాక్.. కొత్త రికార్డ్ సృష్టించిన గోల్డ్ ధర
ప్రస్తుతం సెన్సెక్స్ 632 పాయింట్లు నష్టపోయి 81,547 దగ్గర కొనసాగుతుండగా.. నిఫ్టీ 182 పాయింట్లు నష్టపోయి 25,050 దగ్గర కొనసాగుతోంది. అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. నిఫ్టీలో ఎటర్నల్, హిందాల్కో, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, JSW స్టీల్, సన్ ఫార్మా ప్రధాన లాభాలను ఆర్జించగా.. ICICI బ్యాంక్, ఇన్ఫోసిస్, HCL టెక్నాలజీస్, భారత్ ఎలక్ట్రానిక్స్, అపోలో హాస్పిటల్స్ నష్టపోయాయి. BSE మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ దాదాపు 2 శాతం తగ్గాయి. అక్టోబర్ 6, 2025 తర్వాత ఈరోజు 25,000 మార్కు దిగువకు పడిపోయింది.
ఇది కూడా చదవండి: PM Modi: బీజేపీ కొత్త అధ్యక్షుడి పిల్లలతో మోడీ సంభాషణ.. వీడియో వైరల్
