NTV Telugu Site icon

India-US: భారతీయ కంపెనీలపై అమెరికా వేటు.. మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా?

Randhir Jaiswal

Randhir Jaiswal

రష్యాతో సైనిక సంబంధాల కారణంగా పలు భారతీయ కంపెనీలపై అమెరికా ఆంక్షలు విధించగా, దీనిపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అంశంపై అమెరికాతో మాట్లాడుతున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. ఈ భారతీయ కంపెనీలు రష్యా సైనిక-పారిశ్రామిక స్థాపనకు మద్దతు ఇస్తున్నాయని అమెరికా ఆరోపిస్తోంది. ఈ విషయమై అమెరికాతో భారత్ సంప్రదింపులు జరుపుతోందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. వ్యూహాత్మక వాణిజ్యం, నాన్-ప్రొలిఫెరేషన్ నియంత్రణలపై భారత్‌కు ‘బలమైన చట్టపరమైన, నియంత్రణ ఫ్రేమ్‌వర్క్’ ఉందని ఆయన అన్నారు. భారత్ మూడు ప్రధాన బహుపాక్షిక నాన్-ప్రొలిఫరేషన్ ఎగుమతి నియంత్రణ పాలనలలో కూడా సభ్యులుగా ఉన్నామని స్పష్టం చేశారు.

READ MORE: IND vs NZ: 55 ఏళ్ల నాటి రికార్డు బద్దలు.. భారత క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి..!

జైస్వాల్ మాట్లాడుతూ.. “భారతదేశం స్థాపించిన నాన్-ప్రొలిఫెరేషన్ ఆధారాలకు అనుగుణంగా, ఎగుమతి నియంత్రణ నిబంధనల గురించి భారతీయ కంపెనీలకు అవగాహన కల్పించడానికి అన్ని సంబంధిత విభాగాలు,ఏజెన్సీలతో కలిసి పని చేస్తున్నాం. అమలు చేస్తున్న కొత్త చర్యల గురించి కూడా తెలియజేస్తాం. కొన్ని పరిస్థితులలో భారతీయ కంపెనీలను ప్రభావితం చేయవచ్చు.” అని పేర్కొన్నారు.

READ MORE:Unified Lending Interface: ఇప్పుడు సిబిల్‌తో సంబంధం లేకుండా.. క్షణాల్లో లోన్!

అసలు విషయం ఏమిటి?
చైనా, స్విట్జర్లాండ్, థాయ్‌లాండ్, టర్కీ దేశాలకు చెందిన కంపెనీలపై కూడా రష్యాకు అధునాతన సాంకేతికత, పరికరాలను సరఫరా చేసినందుకు ఆంక్షలు విధించినట్లు యూఎస్ ట్రెజరీ డిపార్ట్‌మెంట్ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. గ్లోబల్ పైరసీ నెట్‌వర్క్‌లకు అంతరాయం కలిగించడంతో పాటు, రష్యా యొక్క సైనిక-పారిశ్రామిక స్థావరం కోసం దేశీయ రష్యన్ దిగుమతిదారులు, కీలక వస్తువులు, ఇతర వస్తువుల ఉత్పత్తిదారులను కూడా ఈ చర్య లక్ష్యంగా చేసుకుంటుందని ప్రకటన తెలిపింది.

Show comments