రష్యాతో సైనిక సంబంధాల కారణంగా పలు భారతీయ కంపెనీలపై అమెరికా ఆంక్షలు విధించగా, దీనిపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అంశంపై అమెరికాతో మాట్లాడుతున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. ఈ భారతీయ కంపెనీలు రష్యా సైనిక-పారిశ్రామిక స్థాపనకు మద్దతు ఇస్తున్నాయని అమెరికా ఆరోపిస్తోంది. ఈ విషయమై అమెరికాతో భారత్ సంప్రదింపులు జరుపుతోందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు.
ఉక్రెయిన్‌పై దండయాత్ర చేస్తున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఎదురు దెబ్బ తగిలింది. ఇన్నిరోజులు రష్యా తరపున పోరాడిన సైన్యమే ఇప్పుడు ఎదురు తిరిగింది. రష్యా సైనిక నాయకత్వమే లక్ష్యంగా వాగ్నర్ గ్రూప్ తిరుగుబాటు చేస్తోంది. సాయుధ పోరాటానికి వాగ్నర్ గ్రూప్ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ పిలుపునిచ్చారు.