Silver Price: సిల్వర్ మార్కెట్ హీట్.. వెండి ధరల్లో అనూహ్య మార్పులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వెండి మార్కెట్లో చోటు చేసుకుంటున్న అనూహ్య పరిణామాలు అటు పెట్టుబడిదారులను, ఇటు సామాన్య వినియోగదారులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. నిన్నటి వరకు ఒడిదుడుకులతో సాగిన వెండి ధరలు, ఒక్కసారిగా మళ్లీ పుంజుకోవడం ఇప్పుడు మార్కెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ముఖ్యంగా డిజిటల్ సిల్వర్‌లో పెట్టుబడులు పెట్టిన వారు గత కొంతకాలంగా ధరలు తగ్గడంతో నష్టాలను చవిచూడగా.. తాజా పెరుగుదల వారికి కొంత ఊరటనిచ్చే అంశమని చెప్పవచ్చు.
ప్రస్తుతం వెండి ధరల ధోరణిని గమనిస్తే.. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. హైదరాబాద్, విజయవాడ నగరాల్లో కిలో వెండి ధర ఏకంగా 10,000 రూపాయలు పెరగడం గమనార్హం. దీంతో ఇక్కడ కిలో వెండి ధర 2.70 లక్షల రూపాయలకు చేరుకుంది. ఇదే తరహా ధరలు బెంగళూరు, ముంబై నగరాల్లోనూ కనిపిస్తున్నాయి. అయితే దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది.. అక్కడ ధర 5,000 రూపాయలు తగ్గడంతో కిలో వెండి 2.50 లక్షల రూపాయల వద్ద కొనసాగుతోంది.
Also Read
- Robert Kiyosaki: $100 మిలియన్ల ఆస్తి.. కానీ బిలియన్ల అప్పు! ‘Rich Dad Poor Dad’ రచయిత రాబర్ట్ కియోసాకి అసలు కథ ఇదే
- EPFO కొత్త పథకం.. 6 నెలలే అందుబాటులో ఉండే ఈ కొత్త స్కీమ్‌తో ఎవరికి లబ్ధి..? పూర్తి వివరాలు..
- Rupee: సంక్షోభం సమయంలో ఆర్బీఐ మాస్టర్ ప్లాన్.. భారీగా పుంజుకున్న రూపాయి విలువ
- PayPal Layoffs: పేపాల్‌లో భారీ లేఆఫ్స్.. భారత్‌లో వందలాది మంది ఉద్యోగులకు పింక్ స్లిప్స్..
వెండి ధరలు ఈ స్థాయిలో పెరగడం వెనుక బలమైన కారణాలు కనిపిస్తున్నాయి. వెండిని కేవలం ఆభరణాల కోసమే కాకుండా.. పారిశ్రామిక రంగంలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, సోలార్ ప్యానెల్స్, బ్యాటరీలు, టెలికాం, బయోఫార్మా వంటి రంగాల్లో వెండి వినియోగం అనివార్యంగా మారింది. ఈ పరిశ్రమల నుంచి వస్తున్న విపరీతమైన డిమాండ్, దానికి తగ్గట్టుగా సరఫరా లేకపోవడం ధరల పెరుగుదలకు ప్రధాన కారణమవుతోంది. దీనికి తోడు అంతర్జాతీయ రాజకీయ ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణం నెలకొన్నప్పుడు పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్ కంటే విలువైన లోహాలనే సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తారు.
గతంలో వెండి ధరలు ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి చేరినప్పుడు, భవిష్యత్తులో ధరలు ఇంకా పెరుగుతాయనే ఆశతో చాలా మంది భారీగా వెండిని కొనుగోలు చేశారు. ముఖ్యంగా డిజిటల్ వెండి రూపంలో ఇన్వెస్ట్ చేసిన వారు, ఆ తర్వాత క్రమంగా ధరలు పడిపోవడంతో తీవ్ర నిరాశకు లోనయ్యారు. అప్పటి నుంచి నష్టాల్లో ఉన్న వారికి నేడు పెరిగిన ఈ 10,000 రూపాయలు ఒక మంచి శుభవార్త అని చెప్పాలి.
మార్కెట్ ఒడిదుడుకుల వల్ల నష్టపోయిన వారు మళ్ళీ లాభాల బాట పట్టే అవకాశం తాజా పరిణామాలతో కనిపిస్తోంది. సాంకేతిక రంగంలో వెండి ప్రాధాన్యత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో.. ఈ ధరల పెరుగుదల భవిష్యత్తులో కూడా కొనసాగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Hanuman Ansh: సెహ్వాగ్ ప్రశంసలతో ఉబ్బితబ్బిపోయిన దర్శకుడు.. ఇప్పుడు విరాట్, అనుష్కపై కన్ను!
-
Motorola Edge 70 Plus: 200MP కెమెరా.. 6500mAh బ్యాటరీ! Motorola Edge 70 Plus ఫోన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Siva Nirvana: తమిళ స్టార్‌తో ‘ఇరుముడి’ డైరెక్టర్ సినిమా.. ఈ కాంబో నిజమైతే మామూలుగా ఉండదు!
-
PM Modi: GSLV-F17 సక్సెస్.. ‘భారత్ అంతరిక్ష శక్తి మరింత పెరుగుతోంది’.. ISROపై మోడీ ప్రశంసలు!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!