PayPal Layoffs: పేపాల్‌లో భారీ లేఆఫ్స్.. భారత్‌లో వందలాది మంది ఉద్యోగులకు పింక్ స్లిప్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికన్ ఫిన్‌టెక్ దిగ్గజం పేపాల్ (PayPal) వ్యయాలను తగ్గించుకోవడంలో భాగంగా నిర్వహించిన గ్లోబల్ రీస్ట్రక్చరింగ్‌లో భాగంగా భారతదేశంలో భారీగా లేఆఫ్స్ చేపట్టింది. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ ఆఫీసుల్లోని టెక్నాలజీ, ఇంజనీరింగ్, ఆపరేషన్స్, పేమెంట్స్, ఫైనాన్స్ విభాగాలకు చెందిన ఉద్యోగులపై ఈ ప్రభావం పడింది. తెలిసిన సమాచారం ప్రకారం.. దాదాపు 600 మంది ఉద్యోగులను తొలిగించారని, ఇది భారతీయ మొత్తం సిబ్బందిలో 10 శాతమని తెలుస్తోంది. అయితే పేపాల్ ప్రతినిధి ఈ వార్తలను స్పష్టం చేస్తూ, ఆగస్టు 31న దాదాపు 220 మంది (4 శాతం) ఉద్యోగులను మాత్రమే తొలగించామని తెలిపారు. బాధితులకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, సోమవారం ఉదయం కాల్ ద్వారా సమాచారం అందించి తక్షణమే సిస్టమ్ యాక్సెస్‌ను రద్దు చేశారని బాధిత ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు.
సంస్థను సరళతరం చేయడం, దీర్ఘకాలిక వృద్ధి కోసం కనీసం 1.5 బిలియన్ డాలర్ల వ్యయాన్ని తగ్గించుకోవడానికి మే 2026లో రాబోయే 2-3 ఏళ్లలో గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో 20 శాతాన్ని తగ్గించనున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగానే ఆసియా-పాసిఫిక్ ప్రాంతం నుంచి ప్రారంభించి, ఐర్లాండ్ (164 మంది), అమెరికా, యూరప్, మిడిల్ ఈస్ట్లలో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను చేపట్టింది. భారత్‌లో 2008లో ప్రారంభమైన చెన్నై సెంటర్ పేపాల్‌కు అత్యంత పెద్ద టెక్నాలజీ హబ్ కాగా, బెంగళూరు, హైదరాబాద్ సెంటర్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రిస్క్ మేనేజ్మెంట్ వంటి కీలక రంగాల్లో పనిచేస్తున్నాయి.
Also Read
- Pitru Paksha 2026: తర్పణం ఇచ్చాక ఈ 4 పొరపాట్లు అస్సలు చేయొద్దు.. పితృదేవతల ఆగ్రహానికి గురయ్యే ప్రమాదం!
- POVA New Mobile: POVA 8 5G మొబైల్ ఫోన్ లాంచ్.. 8000mAh బ్యాటరీ, 144Hz రిఫ్రెష్ రేట్, FHD+ ఫ్లాట్ LCD స్క్రీన్..
- Minister Satyakumar Yadav: వారికి తప్పకుండా అవకాశం ఇస్తాం.. మంత్రి సత్యకుమార్ కీలక వ్యాఖ్యలు
- Khairatabad Ganesh Immersion: ముగిసిన ఖైరతాబాదు వినాయకుడి శోభయాత్ర.. గంగమ్మ ఒడిలోకి చేరుకున్న బడా గణపయ్య.!
ప్రపంచ ఆర్థిక మందగమనం, ఏఐ సాంకేతికత వాడకం పెరగడం వల్ల భారతదేశంలోని గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (GCCs) తీవ్ర ప్రతికూల ప్రభావాలను ఎదుర్కొంటున్నాయి. ఇటీవలే ఒరాకిల్ (Oracle) భారత్‌లో 3,000 మందిని, ఊబర్ (Uber) తమ సిబ్బందిని తగ్గించుకున్నాయి. 2025లో గ్లోబల్ పరంగా వచ్చిన ఒత్తిళ్ల వల్ల టెక్నికలర్ (3,000 మంది), ఆమోవియో (1,000 మంది) సంస్థలతో పాటు వెల్స్ ఫార్గో, వాల్‌మార్ట్ వంటి సంస్థలు కూడా భారత్‌లో ఉద్యోగుల సంఖ్యను తగ్గించాయి. ఈ పరిణామాలు భారత ఐటీ, జీసీసీ రంగానికి పెద్ద సవాలుగా మారాయి.
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
Pitru Paksha 2026: తర్పణం ఇచ్చాక ఈ 4 పొరపాట్లు అస్సలు చేయొద్దు.. పితృదేవతల ఆగ్రహానికి గురయ్యే ప్రమాదం!
-
POVA New Mobile: POVA 8 5G మొబైల్ ఫోన్ లాంచ్.. 8000mAh బ్యాటరీ, 144Hz రిఫ్రెష్ రేట్, FHD+ ఫ్లాట్ LCD స్క్రీన్..
-
IND vs WI: రుతురాజ్, నితీష్ ఇన్.. ఆ ఇద్దరు స్టార్లకు నో ఛాన్స్.. వెస్టిండీస్‌తో తొలి వన్డేకు భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Minister Satyakumar Yadav: వారికి తప్పకుండా అవకాశం ఇస్తాం.. మంత్రి సత్యకుమార్ కీలక వ్యాఖ్యలు
-
D56 : నాగవంశీ – ధనుష్ – తమిళరసన్ పచ్చముత్తు.. మొదలుపెట్టారు
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!