Rupee: సంక్షోభం సమయంలో ఆర్బీఐ మాస్టర్ ప్లాన్.. భారీగా పుంజుకున్న రూపాయి విలువ
- సంక్షోభం సమయంలో ఆర్బీఐ మాస్టర్ ప్లాన్
- భారీగా పుంజుకున్న రూపాయి విలువ
- రూపాయి చరిత్రలోనే సెప్టెంబర్ 3న భారీ లాభాలు నమోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియా యుద్ధం.. సూపర్ ఎల్‌నినోతో దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బకొడుతున్న తరుణంలో ఆర్బీఐ రూపొందించిన మాస్టర్ ప్రణాళిక మంచి ఫలితాన్ని ఇబ్బంది. గత కొద్దిరోజులుగా రూపాయి విలువ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. ఇలాంటి తరుణంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ తీసుకున్న నిర్ణయంతో రూపాయికు మంచి రోజులు వచ్చాయి. రూపాయి చరిత్రలోనే సెప్టెంబర్ 3న భారీ లాభాలను నమోదు చేసింది. రెండు నెలల గరిష్ట స్థాయికి చేరింది. విదేశీ కరెన్సీ నాన్-రెసిడెంట్ బ్యాంక్ (FCNR-B) మార్గం ద్వారా భారీగా విదేశీ నిధులు రావడంతో రూపాయికి బలం చేకూరింది. దీంతో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రూ.94.30 స్థాయికి చేరుకుంది. జూన్ తర్వాత ఇదే అత్యధిక లాభకరమైన రోజుగా నిలిచింది.
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) వెల్లడించిన వివరాల ప్రకారం.. FCNR-B మార్గం ద్వారా $127 బిలియన్లకు పైగా నిధులు సమకూరాయి. మార్కెట్ అంచనా వేసిన సుమారు $90 బిలియన్లతో పోలిస్తే ఇది గణనీయంగా ఎక్కువ. ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ (ECB), విదేశీ కరెన్సీ రుణాలను కూడా కలిపితే మొత్తం నిధుల ప్రవాహం $136 బిలియన్లకు చేరుకుంది. “సుమారు $100 బిలియన్ల FCNR నిధులు వస్తాయని మార్కెట్ ముందుగా అంచనా వేసింది. కానీ వాస్తవంగా వచ్చిన మొత్తం ఎవరి అంచనాలకు అందనంత ఎక్కువగా ఉంది” అని ఓ బ్యాంక్‌కు చెందిన కరెన్సీ ట్రేడర్ రాయిటర్స్‌తో పేర్కొన్నారు. ఈ భారీ నిధుల ప్రవాహం ప్రభావాన్ని ఆర్బీఐ ఇటీవల తీసుకున్న చర్యలు మరింత పెంచాయని ట్రేడర్లు చెబుతున్నారు. రూపాయి విలువ పెరగడానికి అనుకూలంగా కేంద్ర బ్యాంక్ డాలర్ల విక్రయాలను పెంచిందని, కరెన్సీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఆర్బీఐ వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోందని వారు తెలిపారు.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
- Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
- October 15: అక్టోబర్ 15 నుంచి ఏటీఎంలలో సరికొత్త రూల్స్! ఇక ఆ చిక్కులు ఉండవు..
రూ.94.10 కీలక స్థాయి
“ఇప్పుడు ఆర్బీఐకి రూపాయి అధికంగా పతనం కాకుండా.. అదే సమయంలో అతిగా బలపడకుండా నియంత్రించేందుకు గతంలో కంటే ఎక్కువ వెసులుబాటు ఉంది. తక్షణంగా రూపాయి పరిధి రూ.94.10–రూ.95.50 మధ్య ఉండొచ్చు. రూ.94.10 కంటే దిగువకు కీలకంగా పడిపోతే రూ.93.50 స్థాయికి చేరే అవకాశం ఉంది” అని షిన్హాన్ బ్యాంక్ ట్రెజరీ హెడ్ కునాల్ సోధాని తెలిపారు. మార్కెట్ వర్గాల ప్రకారం.. విదేశీ మారకద్రవ్య నిల్వలను తిరిగి పెంచుకోవడంతో పాటు రూపాయి విలువ మరింత పడిపోకుండా అడ్డుకునేందుకు ఆర్బీఐ దగ్గర ప్రస్తుతం తగినన్ని నిధులు ఉన్నాయి.
ఆసియా కరెన్సీల బలం కూడా కలిసొచ్చే అవకాశం
ఆసియా కరెన్సీలు బలపడటం, డాలర్ ఇండెక్స్‌లో వెనకడుగు కూడా రూపాయికి మద్దతుగా నిలిచే అవకాశం ఉంది. డాలర్ ఇండెక్స్ 99.50 కంటే దిగువకు పడిపోయింది. ముఖ్యంగా జపాన్ యెన్ బలపడటంతో డాలర్‌పై ఒత్తిడి పెరిగింది. అయితే రూపాయికి కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. బ్రెంట్ క్రూడ్ ధరలు అధికంగా ఉండటం, ప్రపంచవ్యాప్తంగా బాండ్ ఈల్డ్స్ పెరుగుతుండటం రూపాయిపై ఒత్తిడి పెంచే అవకాశముందని ట్రేడర్లు హెచ్చరిస్తున్నారు.
ముడి చమురు ధరలు కీలకం
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో బ్రెంట్ క్రూడ్ ధరలు బ్యారెల్‌కు సుమారు $95 దగ్గర ట్రేడవుతున్నాయి. ముడి చమురు ధరలు మరింత పెరిగితే భారత్ దిగుమతి బిల్లు పెరిగి రూపాయిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. అయినప్పటికీ.. భారీ FCNR-B నిధుల ప్రవాహం, RBI చర్యలు, ఆసియా కరెన్సీల బలం, డాలర్ బలహీనత వంటి అంశాలు ప్రస్తుతం రూపాయికి అనుకూలంగా మారాయి.
- Tags
- Indian Rupee
- RBI
- Rupee
తాజావార్తలు
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
-
Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
-
CM Chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం..!
-
Vizag Navy Sailor : పాక్ హనీట్రాప్‌లో వైజాగ్ నేవీ సైలర్.. కోయంబత్తూరులో అరెస్ట్
-
Nirmala Sitharaman: “మరో సంక్షోభం ముంచుకొస్తోంది”.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?