Shock News to Samsung: శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ సంస్థకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి సంబంధిత ప్రోత్సాహక పథకం కింద ఇవ్వాల్సిన 900 కోట్ల రూపాయలను నిలిపేసింది. ఆ కంపెనీ జనరేట్ చేసిన ఇన్‌వాయిస్‌లలో కొన్ని లోటుపాట్లు బయటపడటంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇంక్రిమెంటల్ ప్రొడక్షన్ మరియు సేల్స్‌కి సంబంధించి శామ్‌సంగ్ ఇచ్చిన డేటాకి, కేంద్ర ప్రభుత్వం సేకరించిన సమాచారానికి మధ్య వ్యత్యాసాలు ఉన్నట్లు తేలింది.