SBI: ఎస్బీఐకి బిగ్ షాక్.. రూ.6,338 కోట్ల పన్ను కట్టాలని నోటీసులు..
- ఎస్బీఐకి బిగ్ షాక్ ఇచ్చిన ఆదాయపు పన్ను శాఖ..
- రూ.6,338 కోట్ల పన్ను చెల్లించాలని నోటీసులు జారీ..
- దీనిని సవాల్ చేస్తామని ఎస్బీఐ వెల్లడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియాలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కి ఆదాయపు పన్ను శాఖ షాక్ ఇచ్చింది. 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దాదాపు రూ.6,338 కోట్ల పన్ను చెల్లించాలంటూ నోటీసులు పంపింది. మార్చి 20.. శుక్రవారం నాడు బ్యాంక్ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. గతంలో బ్యాంకు చూపించిన కొన్ని ఖర్చులను ఆదాయపు పన్ను శాఖ ఆమోదించలేదు. దీనివల్ల అసలు పన్నుతో పాటు వడ్డీ కలిపి ఇంత భారీ మొత్తాన్ని కట్టాలని ఆదేశించింది. ఇలాంటి వివాదాలు గతంలో కూడా ఉన్నాయని, ఇది కొత్తేమీ కాదని SBI తెలిపింది. ఈ నోటీసు వల్ల బ్యాంక్ రోజువారీ పనులకు ఎలాంటి ఆటంకం కలగదని స్పష్టం చేసింది. అయితే ఈ ఆదేశాలకు వ్యతిరేకంగా పై అధికారులకు అప్పీల్ చేయాలని, చట్టపరంగా పోరాడాలని బ్యాంకు నిర్ణయించుకుంది.
Also Read:Donald Trump: మిత్రదేశాలపై ట్రంప్ ఆగ్రహం.. ‘మీరు పిరికివారు’ అంటూ విమర్శ..
Also Read
- Adidas Layoffs: సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులకు షాక్.. అడిడాస్‌లో 50% ఉద్యోగాల కోత
- Digital Payments: యూపీఐ ఛార్జీల నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుంటుందా? ఫైనల్ ఆన్సర్ వచ్చేసింది!
- Cigarette Price Hike: సిగరెట్ ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు.. కొత్త రేట్లు ఇవే..
- Finance Ministry: ట్రంప్ ఒత్తిడి ఉందా?.. యూపీఐ ఛార్జీలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ..
మరోవైపు.. SBI కి చెందిన మ్యూచువల్ ఫండ్ విభాగం (SBIFML) స్టాక్ మార్కెట్లోకి రావడానికి (IPO) సిద్ధమవుతోంది. ఇది పూర్తిగా ‘ఆఫర్ ఫర్ సేల్’ (OFS) పద్ధతిలో జరుగుతోంది. అంటే కంపెనీ కొత్త షేర్లను సృష్టించడం లేదు. కేవలం ప్రస్తుత యజమానులైన SBI, ఫ్రాన్స్‌కు చెందిన అముండి (Amundi) సంస్థలు తమ దగ్గర ఉన్న షేర్లను అమ్ముతున్నాయి. SBI సుమారు 12.8 కోట్ల షేర్లను, అముండి సంస్థ 7.5 కోట్ల షేర్లను విక్రయించనున్నాయి. ఈ వార్తల నేపథ్యంలో.. శుక్రవారం నాడు స్టాక్ మార్కెట్‌లో SBI షేరు ధర స్వల్పంగా (0.87 శాతం) తగ్గి రూ.1,058 వద్ద ముగిసింది.
తాజావార్తలు
-
CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్‌లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
-
Anant Nag: కేజీఎఫ్ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే.. సినీ లెజెండ్‌పై ప్రధాని మోడీ పొగడ్తల వర్షం!
-
Actor Sridevi: నటి శ్రీదేవి ఆస్తి వివాదంపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..
-
The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని ‘ది ప్యారడైజ్’ టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
-
Adidas Layoffs: సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులకు షాక్.. అడిడాస్‌లో 50% ఉద్యోగాల కోత
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!