SBI : ఎస్బీఐ కస్టమర్లకు షాక్.. పెరిగిన వడ్డీ రేట్లు..ఎంతంటే?
- దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు ఎస్బీఐ
- ఖాతాదారులకు చేదు వార్త చెప్పిన ఎస్బీఐ
- వడ్డీరేట్లను పెంచుతూ నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకవైపు దేశం 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటుంటే మరోవైపు దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు ఎస్బీఐ కోట్లాది మంది ఖాతాదారులకు షాకిచ్చింది. స్టేట్ బ్యాంక్ రుణ వడ్డీ రేట్లను (SBI MCLR పెంపు) 10 బేసిస్ పాయింట్లు లేదా 0.10 శాతం పెంచింది. ఈ మార్పు వివిధ పదవీకాల రుణాలపై ప్రభావం చూపుతుంది. ఇప్పటి నుంచి బ్యాంకు నుంచి రుణం తీసుకునేందుకు సామాన్యులు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొత్త రేట్లు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి. ఈ ఏడాది జూన్‌లో చివరిసారిగా ఎంసీఎల్ఆర్ను సవరించింది. ఇప్పుడు తాజాగా సవరించినట్లు పేర్కొంది.
READ MORE: Congress: ప్రధాని ‘‘కమ్యూనిల్ సివిల్ కోడ్’’ వ్యాఖ్యలపై కాంగ్రెస్ విమర్శలు..
Also Read
- IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!
- RBI Online Fraud Rule: యూపీఐ ఫ్రాడ్, బ్యాంకింగ్ స్కామ్‌లపై RBI బిగ్ అప్డేట్.. డబ్బు తిరిగి వచ్చే ఛాన్స్!
- Rule Change 1st July: జూలై 1 నుంచి మీ జేబుపై ప్రభావం.. మారుతున్న 7 ముఖ్యమైన నిబంధనలు ఇవే..!
- Swiggy Instamart: స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో రాజీనామాల బాంబ్ .. ఒకేసారి సీఓఓ, సీబీఓల రిజైన్ ! అసలేం జరుగుతుంది?
మూడు సంవత్సరాల కాలానికి ఎస్బీఐ యొక్క కొత్త ఎంసీఎల్ఆర్ ఇప్పుడు 9% నుంచి 9.10%కి పెరిగింది. అయితే ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్ 8.10% నుంచి 8.20%కి పెరిగింది. నెల, మూడు నెలల కాల వ్యవధులకు లెండింగ్ రేటు 8.45 శాతం నుంచి 8.5 శాతానికి చేరుకుంది. ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 8.85 శాతానికి, ఏడాది లెండింగ్ రేటు 8.85 నుంచి 8.95 శాతానికి పెంచింది. రెండేళ్ల ఎంసీఎల్ఆర్ 9.05 శాతానికి, మూడేళ్ల ఎంసీఎల్ఆర్ 9.1 శాతానికి పెంచుతున్నట్లు ఎస్బీఐ తెలిపింది.
READ MORE: CM Chandrababu: టీడీపీ ఎప్పటికి గుడివాడకు రుణపడి ఉంటుంది..
అసలు ఎంసీఎల్ఆర్ అంటే ఏమిటి?
ఎంసీఎల్ఆర్ (Marginal Cost of Funds Based Lending Rate) అనేది రుణ రేటుని తెలుపుతుంది. బ్యాంకులు ఎంసీఎల్ఆర్ కంటే తక్కువ రేటుకు రుణాలు ఇవ్వడానికి అనుమతి లేదు. కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ ఇటీవల జరిగిన ద్వైమాసిక సమీక్షా సమావేశంలో రెపో రేటును 6.5 శాతం వద్ద యథాతథంగా ఉంచిన విషయం తెలిసిందే. దీంతో అధిక వడ్డీ రేట్ల నుంచి ఉపశమనం పొందాలనుకున్న రుణగ్రహీతలకు మరోసారి నిరాశే మిగిలింది. ఆర్బీఐ రెపో రేటును తగ్గిస్తేనే వడ్డీరేట్లు సవరించబడతాయి.
తాజావార్తలు
-
iQOO Neo11s: ఐకూ Neo11s వచ్చేస్తోంది.. 8000mAh భారీ బ్యాటరీ, 144Hz 2K డిస్ప్లేతో గేమర్లకు కొత్త పవర్‌హౌస్!
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
OG Universe : OG – 2 ఊచకోతకు శ్రీకారం చుట్టిన పవర్ స్టార్ – సుజీత్
-
Akash Deep Wedding: ధోనీ, కోహ్లీ, రోహిత్ వస్తే నా పెళ్లి ఆగిపోతుంది.. ఆకాశ్ దీప్ కామెంట్స్ వైరల్!
-
Sana Malik: పాకిస్తాన్‌లోని ఇస్లామిక్ చట్టాన్ని భారత్ లో అమలు చేయాలి.. ఎమ్మెల్యే సనా మాలిక్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!
-
IND vs BAN: నేడు టీమిండియాకు కీలక మ్యాచ్.. గెలవకుంటే ఇంటికే.. కొడితే గట్టిగా కొట్టాల్సిందే!
-
ట్యాబ్లెట్ కాదు.. మినీ ల్యాప్‌టాప్! 13-అంగుళాల 3.5K డిస్ప్లే, 144Hz డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో Moto Pad 70 Pro..