Trump Reliance Deal: సాహో భారత్.. అమెరికా గడ్డపై చరిత్ర సృష్టించిన రిలయన్స్!
- రిలయన్స్‌తో చేతులు కలిపిన ట్రంప్..
- అమెరికాలో 50 ఏళ్ల తర్వాత కొత్త ఆయిల్ రిఫైనరీ
- రూ.25 లక్షల కోట్ల భారీ డీల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trump Reliance Deal: అమెరికా ఇంధన చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయం మొదలైంది. గత అర్ధ శతాబ్ద కాలంగా (50 ఏళ్లు) అమెరికాలో ఒక్క కొత్త ప్రధాన చమురు శుద్ధి కర్మాగారం (Oil Refinery) కూడా నిర్మించలేదు. అయితే, ఈ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఈ ప్రాజెక్టులో భారతీయ దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ భాగస్వామి కావడం విశేషం. టెక్సాస్‌లోని బ్రౌన్స్‌విల్లేలో ఈ కొత్త రిఫైనరీని నిర్మించనున్నట్లు ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ వేదికగా వెల్లడించారు. దీని విలువ దాదాపు $300 బిలియన్లు (భారతీయ కరెన్సీలో సుమారు రూ. 25 లక్షల కోట్లకు పైమాటే).
READ ALSO: Rain In Telangana: చల్లని కబురు చెప్పిన తెలంగాణ వాతావరణ శాఖ.. ఈ జిల్లాల్లో వర్షాలే వర్షాలు..
Also Read
- UPI MDR Revenue: MDR ఆదాయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ డబ్బుతో ఏం చేస్తారంటే..?
- UPI Charges: ఎవరు చెల్లించాలి? ఎవరు అవసరం లేదు?.. ఇంకా సందేహాలా..? పూర్తి వివరాలు ఇవే
- IRCTC Tatkal Ticket Booking: తత్కాల్ టికెట్ బుకింగ్.. ఈ చిట్కాలు పాటిస్తే సీటు పక్కా..!
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..
50 ఏళ్లుగా అమెరికా ఎందుకు మౌనంగా ఉందంటే..
ఈ చారిత్రాత్మక పెట్టుబడి పెడుతున్నందుకు భారతదేశానికి, ప్రత్యేకించి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీకి ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు. దీనిని అమెరికా చరిత్రలోనే అతిపెద్ద ఒప్పందంగా ఆయన అభివర్ణించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికాలో 1977 తర్వాత ఒక్క మేజర్ రిఫైనరీ కూడా ఎందుకు రాలేదో తెలుసా.. దీని వెనుక ఉన్న ప్రధాన కారణాలు ఏంటంటే.. కొత్త ప్లాంట్‌ను నిర్మించడం కంటే, ఉన్న ప్లాంట్ల సామర్థ్యాన్ని పెంచడమే లాభదాయకమని అమెరికన్ కంపెనీలు భావించాయి. కొత్త రిఫైనరీని స్థాపించడానికి అమెరికాలో ప్రభుత్వ అనుమతులు పొందడం చాలా క్లిష్టమైన, సుదీర్ఘమైన ప్రక్రియ. రాబోయే కాలంలో గ్యాసోలిన్ (పెట్రోల్) డిమాండ్ తగ్గుతుందని, ప్రపంచం గ్రీన్ ఎనర్జీ వైపు మళ్లుతుందని కంపెనీలు ఊహించాయి. అందుకే 50 ఏళ్లుగా అమెరికా కొత్త ఆయిల్ రిఫైనరీల వైపు మొగ్గు చూపలేదని విశ్లేషకులు చెబుతున్నారు.
చివరిసారిగా 1977లో లూసియానాలో మారథాన్ ఆయిల్ పెద్ద రిఫైనరీని ప్రారంభించింది. ఆ తర్వాత కేవలం చిన్న చిన్న ప్లాంట్లు మాత్రమే వచ్చాయి. అయితే, 2022లో చమురు ధరలు రికార్డు స్థాయికి చేరడం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటి పరిణామాల నేపథ్యంలో స్వయం సమృద్ధి సాధించాల్సిన అవసరాన్ని అమెరికా గుర్తించింది. ఈ క్రమంలోనే ట్రంప్ ఈ భారీ ప్రాజెక్టును ముందుకు తీసుకొచ్చారు. రిలయన్స్ వంటి గ్లోబల్ ఎనర్జీ ప్లేయర్ ఈ ప్రాజెక్టులో చేరడం వల్ల అమెరికాలో ఇంధన ధరలు తగ్గడమే కాకుండా, వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఇది అటు అమెరికాకు, ఇటు భారతీయ వ్యాపార రంగానికి కొత్త ఊపును తీసుకొచ్చే ఒప్పందంగా మారనుందని చెబుతున్నారు.
READ ALSO: Chota K Naidu: సినిమాకు కులం లేదు: ఛోటా కే.నాయుడు
తాజావార్తలు
-
Hatah Teaser: కిరణ్ అబ్బవరం ‘హతః’ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్.. ఆ నల్ల పిల్లి వెనుక అసలు కథేంటి?
-
Gadikota Srikanth Reddy: కొత్త పెన్షన్ల పేరుతో మళ్లీ మోసం.. గడికోట ఫైర్
-
KBR Park Elevated Corridor: 14 వద్దు.. ఒక్క ఎలివేటెడ్ కారిడార్ ముద్దు.! కేబీఆర్ పార్క్ పరిసరాల్లో కొత్త ప్లాన్ ఇదే..
-
Minister TG Bharath: కర్నూలులో జాబ్ మేళా ప్రారంభం.. యువతకు ఉద్యోగాలు.. కర్నూలుకు భారీ పెట్టుబడులు..!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!