Hatah Teaser: కిరణ్ అబ్బవరం ‘హతః’ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్.. ఆ నల్ల పిల్లి వెనుక అసలు కథేంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hatah Teaser: హీరోగా వరుస సినిమాలతో బిజీగా ఉన్న కిరణ్ అబ్బవరం ఇప్పుడు నిర్మాతగానూ తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ‘తిమ్మరాజుపల్లి టీవీ’తో ప్రొడక్షన్ రంగంలోకి అడుగుపెట్టిన ఆయన, ఇప్పుడు ‘హతః’ అనే డిఫరెంట్ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. ఇది వరకే ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌లో కనిపించిన నల్ల పిల్లి, దానికి పెట్టిన క్యాప్షన్ ప్రేక్షకుల్లో ఒక్కసారిగా క్యూరియాసిటీ పెంచేసింది. అసలు ఆ పిల్లికి ఈ కథతో ఏంటి సంబంధం? సినిమా ఏ జానర్లో ఉండబోతోంది? అనే ప్రశ్నలకు సమాధానం ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న సమయంలో మేకర్స్ టీజర్ రిలీజ్‌పై అప్డేట్ ఇచ్చారు. ‘హతః’ టీజర్‌ను 2026 సెప్టెంబర్ 18న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ నుంచి ఆఫీషియల్ గా ప్రకటన వచ్చేసింది. ఇప్పటికే టైటిల్ గ్లింప్స్‌తో కథ గురించి ఎలాంటి క్లూ ఇవ్వకుండా కేవలం మిస్టరీని క్రియేట్ చేశారు మేకర్స్. దీంతో ఇప్పుడు రాబోయే టీజర్లో అసలు ఏం చూపించబోతున్నారనే విషయం కోసం అభిమానులు కూడా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.
ఇటీవల విడుదలైన టైటిల్ పోస్టర్లో ఒక నల్ల పిల్లిని చూపిస్తూ ‘ఈ పిల్లి బతికే ఉందా లేక..’ అనే క్యాప్షన్ పెట్టారు. సాధారణంగా సినిమా టైటిల్ పోస్టర్లో హీరో, హీరోయిన్ లేదా కథకు సంబంధించిన విజువల్స్ కనిపిస్తాయి. కానీ ‘హతః’ టీమ్ మాత్రం అందుకు భిన్నంగా ఒక పిల్లిని మాత్రమే చూపించి ప్రేక్షకుల ఊహలకు పని చెప్పింది. ఆ పోస్టర్ తర్వాత సినిమా మిస్టరీ థ్రిల్లర్‌గా ఉండొచ్చనే చర్చ మొదలైంది. ఈ మూవీకి అనుష్ గోరక్ కథ, దర్శకత్వంతో పాటు సినిమాటోగ్రఫీ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. కిరణ్ అబ్బవరం, శివశంకర నాయుడు . వై నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. జెసిన్ జార్జ్ సంగీతం అందిస్తుండగా, కుష్లు మద్దాల, రెహ్మాన్, నమ్రిత ఎంవీ, తనూజ పుట్టస్వామి ఇందులో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Also Read
కిరణ్ అబ్బవరం ప్రస్తుతం నటుడిగానూ, నిర్మాతగానూ వరుస ప్రాజెక్టులతో ముందుకెళ్తున్నారు. ‘చెన్నై లవ్ స్టోరీ’ తర్వాత ఆయన ‘KA13’పై కూడా పనిచేస్తున్నారు. మరోవైపు నిర్మాతగా కొత్త కథలు, కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి కథతో ‘హతః’ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారనే ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా టైటిల్ గ్లింప్స్‌లోనే కథను చెప్పకుండా ఇంత మిస్టరీ క్రియేట్ చేసిన నేపథ్యంలో సెప్టెంబర్ 18న విడుదల కానున్న టీజర్‌పై అంచనాలు పెరిగాయి. ఆ నల్ల పిల్లి వెనుక ఉన్న కథ ఏంటి? కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్న ఈ సినిమా ఎలాంటి జానర్‌కు చెందినది? అనే ప్రశ్నలకు సమాధానం టీజర్ ఏమైనా ఇస్తుందా అనేది చూడాలి.
- Tags
- cinema
- Kiran Abbavaram
తాజావార్తలు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Ramayana : ‘రామాయణ’ ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఆఫీసులపై ఐటీ శాఖ సోదాలు
-
Amazon Layoffs in India: పండుగకు ముందు అమెజాన్ షాక్.. భారత్‌లో భారీగా ఉద్యోగాల కోత
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
PBKS-IPL 2027: పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్.. ఐపీఎల్ 2027 ముందు ఇద్దరు కోచ్‌లు అవుట్!
ట్రెండింగ్
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!