NTV Telugu Site icon

Residential Property: విశాఖ, విజయవాడ సహా ఈ నగరాల్లో ఇళ్లకు ఫుల్‌ డిమాండ్.. 94 శాతం పెరిగిన ధరలు..!

Residential Property

Residential Property

Residential Property: ఇళ్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు.. అన్నారు పెద్దలు.. అంటే.. మనిషి జీవితంలో ఈ రెండింటికీ ప్రత్యేక స్థానం ఉంటుంది.. అంతేకాదు.. ఇల్లు కట్టడం, పెళ్లి చేయటం రెండూ ఖర్చుతో కూడుకున్నవే.. అనుకున్నదానికంటే ఒకటికి మూడింతలు ఖర్చు అవుతుంది.. మరోవైపు గృహమే కదా స్వర్గసీమ అని కూడా అన్నారు.. అయితే, తమ ఆర్థిక స్థోమతు బట్టి.. ఇళ్లను తమకు నచ్చిన విధంగా నిర్మించుకోవడం.. ఒకటైతే.. ఇప్పుడు కట్టిన ఇళ్లను కొనుగోలు చేయడం బాగా పెరిగిపోయింది.. బ్యాంకులు హౌసింగ్‌ లోన్లు ఇస్తుండంతో.. క్రమంగా ఇళ్లు కొనే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది.. 2023-24తో ముగిసే గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో భారతదేశంలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో రెసిడెన్షియల్ ప్రాపర్టీ ధరలు 94 శాతం వరకు పెరిగాయి.. నివాసాలకు అధిక గిరాకీయే ఇందుకు కారణమని.. ఉద్యోగ మార్కెట్ మరియు బలమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి కారణంగా ఇళ్లకు మంచి గిరాకీ పెరిగిందని స్థిరాస్తి డేటా అనలిటిక్‌ సంస్థ ప్రాప్‌ఈక్విటీ పేర్కొంది.

Read Also: Telangana: 50 రోజుల్లో 900కి పైగా వాహనాలు సీజ్.. రూ.8.72 కోట్లు ఫైన్

ఆ సంస్థ.. 2023-24లో సగటు ఇళ్ల ప్రాజెక్టుల ప్రారంభ ధరను.. 2019-20 ధరలతో పోల్చి ఈ వివరాలను ప్రకటించింది. దేశంలో ప్రధానమైన 30 ద్వితీయశ్రేణి మార్కెట్లలో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు లాంటి నగరాలు ఉండగా.. అమృత్‌సర్, మొహలి, లుధియానా, చండీగఢ్, పానీపట్, దెహ్రాడూన్, భివాండీ, సోనేపట్, జయపూర్, ఆగ్రా, లఖ్‌నవూ, భోపాల్, ఇందౌర్, మంగళూరు, మైసూర్, కోయంబత్తూర్, కోచి, త్రివేండ్రం, రాయపూర్, భువనేశ్వర్, అహ్మదాబాద్, గాంధీనగర్, వడోదరా, సూరత్, నాసిక్, నాగ్‌పూర్, గోవా కూడా ఈ జాబితాలో ఉన్నాయి.. ఇందులో 24 నగరాల్లో ఇళ్ల ధరలు రెండంకెల్లో పెరిగిపోతే.. 6 నగరాల్లో ధరలు ఒక అంకె వృద్ధి సాధించాయని పేర్కొంది.. ఇక, టాప్‌ 10 సిటీల్లో ఇళ్ల ధరలు 54 శాతం నుంచి 94 శాతం పెరిగాయని పేర్కొంది ప్రాప్‌ఈక్విటీ.

Read Also: Naga Chaitanya New Movie: హిట్ డైరెక్టర్‌తో నాగ చైతన్య సినిమా.. మరోసారి ఆ స్టార్ హీరోయిన్‌తో రొమాన్స్!

గోవాలో 90 శాతం, మంగళూరులో 56 శాతం మరియు ఇండోర్ లో 72 శాతం వరుసగా వెస్ట్, సౌత్ మరియు సెంట్రల్/ఈస్ట్ జోన్‌లలో అత్యధిక పెరుగుదలను నమోదు చేసినట్టు ఆ సంస్థ తెలిపింది.. గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో కొత్త లాంచ్‌ల కంటే పాత వాటికి కూడా డిమాండ్‌ ఎక్కువగా ఉందని పేర్కొంది. పెరిగిన డిమాండ్ కారణంగా ద్వితీయ శ్రేణి నగరాలు గణనీయమైన ధరల పెరుగుదలను చూశాయి. వినియోగదారుల్లో ఆసక్తి పెరగడం, కనెక్టివిటీలో ప్రోత్సాహం, మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు బలమైన జాబ్ మార్కెట్‌లు.. ఈ నగరాల్లో ఎక్కువ భాగం ధరలను రెండంకెలకు పెంచాయి అంటున్నారు ప్రాప్‌ఈక్విటీ వ్యవస్థాపకుడు మరియు సీఈవో సమీర్ జసుజా..