Reliance Q4 FY26 Results: రిలయన్స్ ఇన్వెస్టర్లకు షాక్.. ఆదాయం పెరిగినా లాభం ఎందుకు తగ్గింది? అంబానీ రిపోర్ట్ కార్డ్ ఇదే!
Reliance Q4 FY26 Results: దేశీయ దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) తమ నాలుగో త్రైమాసిక (Q4 FY26) ఆర్థిక ఫలితాలను విడుదల చేసింది. ఈ ఫలితాల్లో కంపెనీ ఆదాయం అద్భుతంగా పెరిగినప్పటికీ, నికర లాభంలో మాత్రం కొంత ఒత్తిడి కనిపించింది. ఇదే సమయంలో ఇన్వెస్టర్లకు ఊరటనిస్తూ ప్రతి షేరుకు రూ.6 డివిడెండ్ ప్రకటించింది. కంపెనీ కన్సోలిడేటెడ్ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 13% తగ్గి రూ.16,971 కోట్లకు పరిమితమైంది. కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం 13% వృద్ధి చెంది రూ. 2.98 లక్షల కోట్లకు చేరింది.
రంగాల వారీగా పనితీరు ఇదే..
రిలయన్స్ జియో తన దూకుడును కొనసాగిస్తోంది. దీని నికర లాభం రూ.7,022 కోట్ల నుంచి రూ. 7,935 కోట్లకు పెరిగింది. సగటు వినియోగదారు ఆదాయం (ARPU) స్వల్పంగా పెరిగి రూ.214కు చేరింది. మొత్తం యూజర్లు 52.4 కోట్లు దాటగా, అందులో 26.8 కోట్ల మంది 5G యూజర్లు ఉండటం విశేషం. అలాగే రిలయన్స్ రిటైల్ విభాగం స్థిరమైన వృద్ధిని కనబరిచింది. దీని ఆదాయం విషయానికి వస్తే.. గ్రాస్ రెవెన్యూ 10.8% పెరిగి రూ. 98,232 కోట్లకు చేరింది. నికర లాభం రూ. 3,563 కోట్లుగా నమోదైంది. వినియోగదారుల అవసరాలకు తగ్గట్టుగా ఓమ్నీ ఛానల్ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడం వల్లే ఈ వృద్ధి సాధ్యమైందని ముఖేష్ అంబానీ పేర్కొన్నారు. ఆయిల్-టు-కెమికల్స్ విభాగం ఆదాయం 12% పెరిగి రూ.1.84 లక్షల కోట్లకు చేరినప్పటికీ, ఎబిటా మాత్రం 4% తగ్గి రూ. 14,520 కోట్లుగా నమోదైంది.
Also Read
- Anant Ambani: ప్రపంచం దృష్టిని ఆకర్షించిన అనంత్ అంబానీ వాచ్.. రూ.12 కోట్ల ఆ వాచ్ ప్రత్యేకతలు ఇవే!
- Gold Rates Down: మగువలకు మురిసిపోయే శుభవార్త.. బంగారం కొనేందుకు ఇదే మంచి తరుణం..
- Chegg Downfall: ఒకప్పుడు ఎడ్‌టెక్ రారాజు.. నేడు దివాళా దిశగా! ఏఐ దెబ్బకు 15 బిలియన్ డాలర్ల సామ్రాజ్యం క్లోజ్
- APY Monthly Pension: ఇలా చేస్తే అందరికీ రూ.5,000 పెన్షన్.. రోజూ రూ.7 పొదుపుతోనే! మీరు ఇంకా చేరలేదా?
వినోద రంగంలో జియో స్టార్ సంచలనాలు సృష్టిస్తోంది. టీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌లో 34.2% వాటాతో 81 కోట్ల మంది ప్రేక్షకులను చేరుకుంది. T20 వరల్డ్ కప్ ఫైనల్‌ను ఏకంగా 7.25 కోట్ల మంది ఏకకాలంలో వీక్షించి ప్రపంచ రికార్డు సృష్టించారు. ఫలితాల సందర్భంగా రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ మాట్లాడుతూ.. రిలయన్స్ రిటైల్, జియోలు అద్భుతమైన పనితీరు కనబరిచాయని సంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా FMCG రంగంలో రిలయన్స్ బ్రాండ్స్ వేగంగా విస్తరిస్తున్నాయని, భారత దేశంలో వినియోగం ఇంకా పెరిగే అవకాశం ఉందని, ఆ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి రిలయన్స్ సిద్ధంగా ఉందని ధీమా వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Reliance Q4 FY26 Results: రిలయన్స్ ఇన్వెస్టర్లకు షాక్.. ఆదాయం పెరిగినా లాభం ఎందుకు తగ్గింది? అంబానీ రిపోర్ట్ కార్డ్ ఇదే!
-
Rajasekhar : ఠాగూర్ సినిమా చిరంజీవి కంటే ముందే నా దగ్గరకు వచ్చింది.. కానీ
-
Panama Canal: హార్మూజ్ జలసంది మూసివేత..! ఒక్కో ట్యాంకర్‌పై రూ.37 కోట్లు సంపాదిస్తున్న ఓ చిన్న దేశం..
-
Kavitha: కవిత ‘TRS’ పార్టీ 5 భారీ హామీలు ఇవే.. విద్య, వైద్యం ఉచితం.. 4 లక్షల ఉద్యోగాలే లక్ష్యం!
-
Ashok mittal-Kejriwal: నమ్మినవాడే షాకిచ్చాడు.. మొన్నటిదాకా అశోక్ మిట్టల్ ఇంట్లోనే ఉన్న కేజ్రీవాల్
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!