UPI Refund Process: ఈ రోజుల్లో UPI చెల్లింపులు లేని జీవితాలను ఊహించుకోవడం సాధ్యం కాదు. అంతలా ప్రజల జీవితాల్లో యూపీఐ భాగం అయ్యింది. UPI రాకతో ఒక్క క్లిక్‌తో డబ్బు నిమిషాల్లో బదిలీ అవుతున్నాయి. అయితే కొన్నికొన్ని సార్లు పొరపాటున యూపీఐ ద్వారా రాంగ్ నెంబర్‌కు చెల్లింపులు జరిగే ప్రమాదం ఉంది. ఇకపై ఈ ప్రమాదాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు. తాజాగా దీని గురించి RBI జారీ చేసిన ఒక సర్క్యులర్‌లో సూచించిన రూల్స్ ఫాలో అయితే మీరు పోగొట్టుకున్న డబ్బులను వాపసు పొందే అవకాశం ఉంది. ఇంతకీ ఆ రూల్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Dharmendra : బాలీవుడ్ హీ మ్యాన్.. మతం మారి రెండు పెళ్లిళ్లు.. ధర్మేంద్ర బ్యాక్ గ్రౌండ్ ఇదే!
రాంగ్ పేమెంట్ వాపసు కోసం వీటిని ఫాలో అవ్వండి..
* ముందుగా మీరు పొరపాటున చెల్లింపు చేయడానికి ఉపయోగించిన ID లేదా నంబర్‌ను సంప్రదించండి. చెల్లింపు స్క్రీన్‌షాట్‌ను వారికి పంపడం ద్వారా మీరు వాపసు కోసం వారిని అభ్యర్థించవచ్చు.
* డబ్బు అందుకున్న వినియోగదారుడు వాపసును నిరాకరిస్తే, మీరు 1800-120-1740 టోల్-ఫ్రీ నంబర్‌కు కాల్ చేయడం ద్వారా ఫిర్యాదు కూడా చేయవచ్చు.
* ఇది కాకుండా, మీరు చెల్లింపు చేసిన UPI ఆధారిత యాప్ కస్టమర్ కేర్ సపోర్ట్‌తో మాట్లాడి మీ ఫిర్యాదును నమోదు చేయండి.
* తప్పు UPI చెల్లింపు గురించి మీరు మీ బ్యాంక్‌ను కూడా సంప్రదించవచ్చు. వారు మీకు రీఫండ్ విషయంలో సహాయం చేయగలరు.
* UPI లావాదేవీలను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) నిర్వహిస్తుంది. కాబట్టి మీరు NPCIకి కూడా ఫిర్యాదు చేయవచ్చు.
ఆర్బీఐ సూచించిన ఈ రూల్స్‌ను ఫాలో అయితే మీరు చేసిన రాంగ్ పేమెంట్ డబ్బులను విజయవంతంగా తిరిగి పొందేందుకు అవకాశం ఉందని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు.
READ ALSO: Jamaat-ul-Ahrar: పాక్ గుండెలపై ముల్లుగా మారిన ఉగ్రసంస్థ..