Site icon NTV Telugu

RBI Governor: కొత్త బాంబ్ పేల్చిన ఆర్బీఐ బాస్..! ఇకపై లెక్క కట్టాల్సిందేనా?

Sanjay Malhotra

Sanjay Malhotra

RBI Governor: డిజిటల్ పేమెంట్స్ అంటే ఈ రోజుల్లో తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. ఇది నిజం.. ఎందుకంటే చిన్న కిరాణ కొట్టు నుంచి 5 స్టార్ హోటల్ వరకు ఎక్కడికి వెళ్లిన చెల్లింపులు చేసే పద్ధతి మాత్రం ఒక్కటే అదే… యూపీఐ పేమెంట్స్. గుర్తుంచుకో మిత్రమా ఇప్పటి నుంచి ఒక లెక్క.. ఇక నుంచి మరోలెక్క. ఇకపై యూపీఐ పేమెంట్స్ ఉచితం కాదని, పే చెల్లించాల్సిందే అని ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అంటున్నారు. మరి ఏంటి దీని కథ.. చూసేయండి..

READ MORE: Suicide: భార్య, అత్తమామల వేధింపులతో అల్లుడి ఆత్మహత్య..! హృదయవిదారక వీడియో..

ఏ చిన్న ట్రాన్సాక్షన్‌కైనా
నేటి డిజిటల్ యుగంలో యూపీఐ చెల్లింపులు అనేవి మానవ జీవితంలో ఒక భాగమైపోయాయి. రోడ్డు మీద చిన్న షాప్స్ నుంచి బడా మాల్స్ వరకు యూపీఐ పేమెంట్స్‌ను తెగ వాడేస్తున్నారు. కానీ, రాబోయే రోజుల్లో యూపీఐ ఉచితంగా ఉండకపోవచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా చెబుతున్నారు. ఆయన బుధవారం మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ తర్వాత విలేకరులతో మాట్లాడుతూ.. “నేను ఎప్పుడూ యూపీఐ ఎప్పటికీ ఉచితం అనే మాట చెప్పలేదు. యూపీఐ లావాదేవీలు ప్రాసెస్ చేయడంలో ఖర్చు ఉంటుంది. ఆ ఖర్చు ఎవరో ఒకరు భరించాల్సి ఉంటుంది” అన్నారు. అయితే ఆ ఖర్చు ఎవరు చెల్లించాలి అన్నది తేల్చాలని, అది ఎవరో ఒకరు చెల్లించాల్సిందేనని పేర్కొన్నారు. మల్హోత్రా వ్యాఖ్యలు చూస్తే యూపీఐ ఉచిత సేవలపై మార్పులు రావచ్చనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం యూపీఐ పేమెంట్స్ ఉచితంగానే జరుగుతున్నా త్వరలో ఛార్జీలు ఉండబోతున్నాయని ఈ వ్యాఖ్యలు చూస్తే తెలుస్తుంది.

మీకు తెలుసా..
ఇప్పటికే ఐసీఐసీఐ బ్యాంక్ ఆగస్టు 1 నుంచి ఫోన్‌పే, గూగుల్ పే లాంటి యాప్‌లపై యూపీఐ లావాదేవీలకు ఛార్జీలు వసూలు చేయడం ప్రారంభించింది. ఐసీఐసీఐ బ్యాంక్ మర్చంట్ యూపీఐ లావాదేవీలను నిర్వహించే పేమెంట్ అగ్రిగేటర్లపై ప్రాసెసింగ్ ఫీజు విధిస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్‌లో ఎస్క్రో అకౌంట్లు ఉన్న అగ్రిగేటర్లకు ఒక్క లావాదేవీకి 2 బేసిస్ పాయింట్లు (గరిష్టంగా రూ.6 వరకు), ఎస్క్రో అకౌంట్ లేనివారికి 4 బేసిస్ పాయింట్లు (గరిష్టంగా రూ.10 వరకు) ఛార్జీ ప్రకటించింది. ఇంతకుముందు ప్రైవేట్ బ్యాంకులలో యెస్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ మాత్రమే ఇలాంటి ఛార్జీలు వసూలు చేస్తున్నాయి.

వీసా కంటే ముందుకు..
ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) ఇటీవల విడుదల చేసిన “గ్రోయింగ్ రిటైల్ డిజిటల్ పేమెంట్స్: ది వాల్యూ ఆఫ్ ఇంటర్‌ ఆపరెబిలిటీ” అనే రిపోర్ట్ ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపుల్లో యూపీఐ సుమారు 60 శాతం వాటా పొందింది. భారత్‌లో యూపీఐ 85 శాతం డిజిటల్ చెల్లింపులకు ఉపయోగపడుతోంది. ఇది వీసా కంటే ముందుకు వెళ్లిందని ఆ రిపోర్ట్ చెబుతోంది. ఈ వ్యవస్థ దీర్ఘకాలం నడవాలంటే, ఆ ఖర్చును వ్యక్తిగతంగా అయినా, గుంపుగా అయినా భరించాలి. అదే ముఖ్యమైన విషయం అని మల్హోత్రా వెల్లడించారు. ఛార్జీలు సంగతి రానున్న రోజుల్లో తెలియనుంది. అసలు ఈ ఛార్జీలు ఎవరిపై ఉంటాయి, ఎంత మొత్తంలో ఉంటాయనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.

READ MORE: Jr NTR: నెపోటిజంపై ఎన్టీఆర్ సంచలనం.. నేను అలాంటోడిని కాదు!

Exit mobile version