ఉద్యోగులకు జీతాలు పడే సమయంలో సెలువులు వస్తే అంతే.. సెలవుల తర్వాత జీతాలు గానీ, పెన్షన్లుగానీ వచ్చేది.. ముందుచూపుతో ముందురోజే జీతాలు వేసే సంస్థలు కూడా లేకపోలేదు.. కానీ, మెజార్టీగా మాత్రం.. జీతాలు, పెన్షన్ బ్యాంకు ఖాతాల్లో వేసే రోజు సెలవు వచ్చిందంటే.. మళ్లీ బ్యాంకు ఓపెన్ అయిన తర్వాతే వేస్తారు.. కానీ, ఇక, అలాంటి ఇబ్బందులు ఉండవు.. ఉద్యోగులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్‌న్యూస్ చెప్పింది.. ఇకపై, బ్యాంక్ సెలవులతో సంబంధం లేకుండా జీతాలు, పెన్షన్ చెల్లింపులు జరుగుతాయని స్పష్టం చేసింది.. ఉద్యోగుల జీతాలు వంటి భారీ చెల్లింపులు నిర్వహించే ది నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ సిస్టమ్ (నాచ్) ఆగస్టు 1వ తేదీ నుంచి అన్ని రోజుల్లోనూ అందుబాటులో ఉంటుందని ఇవాళ ప్రకటించింది ఆర్బీఐ.. సంబంధితుల ఖాతాల్లో జమకావాల్సిన జీతాలు, పెన్షన్, డివిడెండ్, వడ్డీ లాంటివన్నీ సెలవులతో సంబంధం లేకుండా ప్రాసెస్ జరగనున్నాయి.. మరోవైపు.. చెల్లింపులే కాదు.. కటింగ్స్ కూడా సెలవులతో సంబంధం లేదు.. ఎందుకంటే.. ఖాతాదారులు చెల్లించాల్సిన లోన్ ఈఎంఐ, ఎలక్ట్రిసిటీ బిల్, టెలిఫోన్ బిల్, మ్యూచువల్ ఫండ్స్, ఇన్స్యూరెన్స్ ప్రీమియం లాంటివి కూడా సెలవుల రోజుతో సంబంధం లేకుండా కట్ కానున్నాయి.