Site icon NTV Telugu

RBI-Card Tokenisation: రిజర్వ్‌డ్‌గా ఉన్న రిజర్వ్‌ బ్యాంక్‌. కార్డ్‌ టోకెనైజేషన్‌ డెడ్‌లైన్‌ పొడిగింపు?

Rbi Card Tokenisation

Rbi Card Tokenisation

RBI-Card Tokenisation: కార్డ్‌ టోకెనైజేషన్‌ కోసం విధించిన డెడ్‌లైన్‌ రేపు శుక్రవారంతో ముగియనుంది. అయితే ఈ గడువును పొడిగించే ఆలోచన రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకి లేనట్లు కనిపిస్తోంది. డెడ్‌లైన్‌ పొడిగించాలని చిన్న వ్యాపారుల నుంచి డిమాండ్లు వస్తున్నప్పటికీ కేంద్ర బ్యాంకు నుంచి మాత్రం అలాంటి సానుకూల సంకేతాలేవీ ఇప్పటివరకు వెలువడలేదు. కార్డ్ డేటాను భద్రపరచడానికి ఆర్బీఐ ఈ భారీ కసరత్తును మూడేళ్ల కిందటే ప్రారంభించింది. కార్డ్‌లను ఈ నెల 30లోపు టోకనైజ్ చేయాలని వ్యాపారాలను ఆదేశించింది.

గతేడాది కన్నా 85.4 శాతం ఎక్కువ

ఈజిప్ట్‌ను ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో 49 లక్షల మంది సందర్శించారు. ఈ సంఖ్య 2021లోని ప్రథమార్ధంతో పోల్చితే 85 శాతం కన్నా ఎక్కువ కావటం చెప్పుకోదగ్గ విషయం. 2021లో జనవరి నుంచి జూన్‌ వరకు 26 లక్షల మంది మాత్రమే టూరిస్టులు ఈజిప్ట్‌లో పర్యటించారు. గతేడాది మొత్తమ్మీద ఆ దేశాన్ని 80 లక్షల మంది సందర్శించగా 2020తో పోల్చితే ఈ సంఖ్య 117 శాతం కన్నా ఎక్కువ కావటం విశేషం. వరల్డ్‌ టూరిజం డే సందర్భంగా సెంట్రల్‌ ఏజెన్సీ ఫర్‌ పబ్లిక్‌ మొబిలైజేషన్‌ అండ్‌ స్టాటిస్టిక్స్‌ సంస్థ ఈ వివరాలను వెల్లడించింది.

read also: SAIL Entered Trillion Club: లక్ష కోట్లకు పైగా టర్నోవర్‌ కలిగిన కంపెనీల క్లబ్‌లోకి తొలిసారిగా ‘సెయిల్‌’

ఒన్‌ అండ్‌ ఓన్లీ.. ఆకాశ్‌ అంబానీ..

రిలయెన్స్‌ జియో చైర్మన్‌ ఆకాశ్‌ అంబానీ అరుదైన ఘనత సాధించారు. అమెరికా వార్తా సంస్థ టైమ్స్‌ రూపొందించిన 100 మంది ఎమర్జింగ్‌ లీడర్ల జాబితాలో చోటు సంపాదించారు. తద్వారా ఈ ఫీట్‌ను సొంతం చేసుకున్న ఒకే ఒక్క భారతీయుడిగా నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని రంగాలకు చెందినవారితో ‘టైమ్స్‌ హండ్రెడ్‌ నెక్‌స్ట్‌’ పేరిట ఈ లిస్టును తయారుచేశారు. భారత సంతతికి చెందిన అమెరికన్ ఓన్లీ ఫ్యాన్స్ సంస్థ అధినేత ఆమ్రపాలి గన్‌ కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఆకాశ్ అంబానీ.. ముఖేశ్ అంబానీ పెద్ద కుమారుడు అనే సంగతి తెలిసిందే.

Exit mobile version