Paytm: టెన్షన్ వద్దు.. మీ డబ్బులు సేఫ్! పేటియం బ్యాంక్ లైసెన్స్ రద్దైనా డబ్బు ఎలా వస్తుందంటే..
Paytm: ఫిన్‌టెక్ దిగ్గజం పేటియంకు భారీ షాక్ తగిలింది. పేటియం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (PPBL) లైసెన్స్‌ను రద్దు చేస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని ఆర్‌బీఐ విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేసింది. అంతేకాకుండా ఈ వ్యవహారంపై తదుపరి చర్యల కోసం ఆర్‌బీఐ హైకోర్టును కూడా ఆశ్రయించనుంది.
కస్టమర్ల డబ్బులు సేఫ్‌గా ఎలా తిరిగిస్తారంటే..
లైసెన్స్ రద్దయిన నేపథ్యంలో ఖాతాదారుల్లో ఆందోళన మొదలైంది. అయితే పేటియం పేమెంట్స్ బ్యాంక్ తన అఫీషియల్ పోర్టల్‌లో ఒక ప్రకటన విడుదల చేసింది. డిపాజిటర్ల సొమ్ము పూర్తిగా సురక్షితంగా ఉందని సంస్థ తెలిపింది. కస్టమర్లందరికీ డిపాజిట్లను తిరిగి ఇచ్చేందుకు తమ వద్ద సరిపడా నిధులు ఉన్నాయని పేర్కొంది. డబ్బును ఎలా తిరిగి ఇస్తారనే దానిపై పూర్తి వివరాలను, ప్రక్రియను కంపెనీ త్వరలోనే వెల్లడించనుంది. చాలా కాలంగా పేటియం పేమెంట్స్ బ్యాంక్ పనితీరుపై ఆర్‌బీఐ అసంతృప్తిగా ఉంది. బ్యాంకింగ్ నిబంధనలను సరిగ్గా పాటించకపోవడం, బ్యాంక్ యాజమాన్యంపై నమ్మకం కోల్పోవడం, ఖాతాదారుల ప్రయోజనాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని భావించడంతో తాజాగా ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం. గతంలోనే (2022లో) కొత్త కస్టమర్లను చేర్చుకోకుండా ఆర్‌బీఐ ఆంక్షలు విధించింది. ఆ తర్వాత 2024లో ఖాతాల్లో డబ్బులు జమ చేయడంపై కూడా నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీని ప్రభావం పేటియం ఫాస్టాగ్ సేవలపై కూడా పడింది.
Also Read
- Reliance Q4 FY26 Results: రిలయన్స్ ఇన్వెస్టర్లకు షాక్.. ఆదాయం పెరిగినా లాభం ఎందుకు తగ్గింది? అంబానీ రిపోర్ట్ కార్డ్ ఇదే!
- Anant Ambani: ప్రపంచం దృష్టిని ఆకర్షించిన అనంత్ అంబానీ వాచ్.. రూ.12 కోట్ల ఆ వాచ్ ప్రత్యేకతలు ఇవే!
- Gold Rates Down: మగువలకు మురిసిపోయే శుభవార్త.. బంగారం కొనేందుకు ఇదే మంచి తరుణం..
- Chegg Downfall: ఒకప్పుడు ఎడ్‌టెక్ రారాజు.. నేడు దివాళా దిశగా! ఏఐ దెబ్బకు 15 బిలియన్ డాలర్ల సామ్రాజ్యం క్లోజ్

ఇకపై ఏం చేయలేరా..
లైసెన్స్ రద్దయిన తర్వాత పేటియం పేమెంట్స్ బ్యాంక్ ఇకపై ‘బ్యాంక్’గా వ్యవహరించలేదు. కొత్త ట్రాన్సాక్షన్స్ జరపడం, బ్యాంకింగ్ సేవలు అందించడం వంటివి పూర్తిగా నిలిచిపోతాయి. ఇక్కడ వినియోగదారులు ఒక విషయాన్ని గమనించాలి. ఆర్‌బీఐ రద్దు చేసింది ‘పేటియం పేమెంట్స్ బ్యాంక్’ లైసెన్స్‌ను మాత్రమే. ‘పేటియం యాప్’ యథావిధిగా పనిచేస్తుంది. పేటియం పేరెంట్ సంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. తాము పేటియం పేమెంట్స్ బ్యాంక్ నుంచి వేరుగా ఉన్నామని, యాప్ సేవలకు ఎలాంటి అంతరాయం ఉండదని కంపెనీ స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
Punjab: ‘‘పంజాబ్ ద్రోహులు’’ వెలసిన ఆప్ తిరుగుబాటు ఎంపీల పోస్టర్లు
-
Paytm: టెన్షన్ వద్దు.. మీ డబ్బులు సేఫ్! పేటియం బ్యాంక్ లైసెన్స్ రద్దైనా డబ్బు ఎలా వస్తుందంటే..
-
Swati Maliwal: ఆప్‌కు స్వాతి మాలివాల్ గుడ్‌బై.. రాజీనామా చేసినట్లు ప్రకటన
-
RCB: మ్యాచ్ గెలిచినా ఆర్బీబీ ఖాతాలో చెత్త రికార్డు.. ఐపీఎల్‌లోనే తొలి టీమ్‌గా..
-
Iran-US Talks: ఇస్లామాబాద్‌లో అసిమ్ మునీర్‌తో ఇరాన్ బృందం భేటీ
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!