ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత కాస్త గ్యాస్ తీసుకుని వరుసగా పరులు పెడుతూ పోయిన పెట్రో ధరలకు మళ్లీ బ్రేక్‌లు పడ్డాయి.. దేశంలో పెట్రో ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ 119 రూపాయల 49 పైసలుగా ఉంటే డీజిల్ 105 రూపాయల 49 పైసలుగా ఉంది. విశాఖలో 120 రూపాయలు, విజయవాడలో 121 రూపాయలు, కర్నూలులో 121 రూపాయల 79 పైసలుగా ఉంది. విశాఖలో లీటర్ డీజిల్ ధర 105 రూపాయల 65 పైసలుగా ఉంటే, బెజవాడలో 106 రూపాయల 68 పైసలు, కర్నూలులో 107 రూపాయల 33 పైసలుగా ఉంది.
Read Also: Rayalaseema Gang: హైదరాబాద్‌లో రాయల సీమ గ్యాంగ్ హల్‌చల్.. ఖరీదైన స్థలం కబ్జా..!?
దేశ వ్యాప్తంగా ఏప్రిల్ ఆరు తర్వాత డీజిల్, పెట్రోల్ ధరల్లో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. అంతకు ముందు… మార్చి 22 నుంచి ఏప్రిల్ 6 వరకు… 16 రోజుల్లో 14 సార్లు ధరలు పెంచాయి ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీలు. ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ఒకానొక దశలో బ్యారెల్ ముడి చమురు ధర 117 డాలర్లకు చేరుకుంది. అయితే, తర్వాత ధరలు దిగి వచ్చాయి. ప్రస్తుతం బ్యారెల్ ముడి చమురు ధర 102 రూపాయలుగా ఉంది. రష్యా నుంచి మనకు చమురు అందడం ప్రారంభమైతే… ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది. కానీ… వినియోగదారులకు ఏ మేరకు ఉపశమనం లభిస్తుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.