SSY vs Fixed Deposit: పిల్లల భవిష్యత్తుకు ఏది బెస్ట్? ఈ తేడాలు తెలుసుకోండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SSY vs Fixed Deposit: ఒకే సారి వచ్చిపడే ఖర్చులను ఎదుర్కోవడానికి.. పిల్లల చదువులు.. వారి పెళ్లిళ్ల కోసం పేరెంట్స్ ముందు నుంచే ప్లాన్ చేస్తారు.. దానికి అనుగుణంగా పెట్టుబడులు పెడతారు.. అయితే, పిల్లల భవిష్యత్తు కోసం పొదుపు చేయాలనుకునే తల్లిదండ్రులకు సుకన్య సమృద్ధి యోజన (SSY), ఫిక్స్డ్ డిపాజిట్ (FD) రెండూ ప్రముఖ పెట్టుబడి మార్గాలు. అయితే ఏది ఎంచుకోవాలనే విషయంలో ఆర్థిక లక్ష్యాలు, అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలి.
* సుకన్య సమృద్ధి యోజన కేవలం బాలికల కోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పొదుపు పథకం. దీనిపై ప్రస్తుతం 8.2 శాతం చక్రవడ్డీ లభిస్తుండగా, సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు, వడ్డీపై పన్ను లేకపోవడం, మెచ్యూరిటీ మొత్తంపై కూడా పన్ను మినహాయింపు వంటి ప్రయోజనాలు ఉన్నాయి. 15 సంవత్సరాలు పెట్టుబడి కొనసాగించి, 21 సంవత్సరాలకు ఖాతా మెచ్యూర్ అవుతుంది.
Also Read
- SBI New Withdrawal Rules: మీకు SBIలో ఈ ఖాతా ఉందా..? విత్‌డ్రాయల్‌పై కొత్త ఛార్జీలు.. నయా రూల్స్ ఇవే
- LIC Smart Pension Plan: ఒక్కసారి పెట్టుబడి.. జీవితాంతం రూ.25 వేలకు పైగా పెన్షన్!
- PM SVANidhi Scheme: కేంద్రం గుడ్‌న్యూస్.. ఆధార్ ఉంటే చాలు రూ.90 వేల వరకు హామీలేని రుణాలు..
- Best FD Interest Rates August 2026: FDపై 8.50 శాతం వరకు వడ్డీ.. ఆగస్టు 2026లో టాప్ రేట్లు అందిస్తున్న బ్యాంకుల పూర్తి జాబితా
* మరోవైపు ఫిక్స్డ్ డిపాజిట్ (FD) అబ్బాయిలు, అమ్మాయిలు ఇద్దరికీ అందుబాటులో ఉంటుంది. బ్యాంకును బట్టి 8 శాతం వరకు వడ్డీ లభించే అవకాశం ఉన్నా, వడ్డీ ఆదాయంపై పన్ను వర్తించవచ్చు. అయితే అవసరమైతే ముందస్తుగా నగదు ఉపసంహరించుకునే సౌలభ్యం FDలో ఉంటుంది.
* దీర్ఘకాలికంగా కుమార్తె చదువు, పెళ్లి వంటి లక్ష్యాల కోసం పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ప్రభుత్వ హామీ, అధిక వడ్డీ, పన్ను ప్రయోజనాల కారణంగా SSY మెరుగైన ఎంపికగా పరిగణించవచ్చు. అయితే పెట్టుబడిలో సౌలభ్యం, లిక్విడిటీ కోరుకునే వారికి FD అనుకూలంగా ఉండవచ్చు అంటున్నారు ఆర్థిక నిపుణులు..
తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!