EPFO: PF ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. డిసెంబర్ నుంచి కొత్త సదుపాయం..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
EPFO: ప్రైవేట్ రంగ ఉద్యోగులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF)కు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. త్వరలోనే పీఎఫ్ డబ్బులను UPI ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి విత్‌డ్రా చేసుకునే సదుపాయం అందుబాటులోకి రానుంది. ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే పీఎఫ్ డబ్బుల కోసం రోజుల తరబడి ఎదురుచూడాల్సిన అవసరం ఉండదు. క్లెయిమ్ ఆమోదం పొందిన తర్వాత వేగంగా నగదు పొందే అవకాశం కలుగుతుంది. 2026 డిసెంబర్ చివరి నాటికి ఈ సదుపాయాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు పలు నివేదికలు వెల్లడించాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
UPI ద్వారా PF విత్‌డ్రాయల్ ఎప్పటి నుంచి?
UPI ద్వారా పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేసుకునే సదుపాయం 2026 డిసెంబర్ చివరి నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. ఈ విధానం అమల్లోకి వస్తే పీఎఫ్ సభ్యులు తమ ఉపసంహరణ క్లెయిమ్ ఆమోదం పొందిన వెంటనే వేగంగా డబ్బులు పొందగలుగుతారు. అయితే ప్రారంభ తేదీ, పూర్తి విధివిధానాలపై EPFO నుంచి అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. అయితే, ఈ కొత్త సదుపాయం ద్వారా చేసే పీఎఫ్ ఉపసంహరణలకు కొన్ని పరిమితులు విధించే అవకాశం ఉంది. ప్రారంభంలో కనీస లావాదేవీ పరిమితిగా రూ.1,000ను పరిశీలిస్తున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. చిన్న చిన్న క్లెయిమ్‌లు పదేపదే చేయకుండా ఉండటం, ప్రాసెసింగ్ భారాన్ని తగ్గించడం ఈ పరిమితుల ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది. అయితే గరిష్ఠ విత్‌డ్రాయల్ పరిమితి సహా ఇతర నిబంధనలపై పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.
Also Read
- EPFO New SWP Scheme: EPFO కొత్త ప్రతిపాదనతో ఉద్యోగులకు ప్రయోజనమా? SWP, ట్యాక్స్ రూల్స్ ఇవే!
- Indian Employees Emergency Savings: జీతం వస్తేనే జీవనం.. భారత ఉద్యోగుల ఆర్థిక పరిస్థితిపై సంచలన సర్వే..!
- Credit Card Rule Changes: ఆ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు షాక్.. రూల్స్ మారుతున్నాయ్.. కొత్త ఛార్జీలు వస్తున్నాయి..!
- RBI Repo Rate Hike: సామాన్యులకు మరో షాక్.. EMI భారం పెరగనుందా..?
ఈ విధానానికి ఎప్పుడు శ్రీకారం చుట్టారు?
పీఎఫ్ సేవలను పూర్తిగా డిజిటలైజ్ చేసి, ఉద్యోగులకు వేగవంతమైన సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ మార్పులకు శ్రీకారం చుట్టారు. 2025 మార్చిలో జరిగిన కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో ఈ డిజిటల్ పరివర్తనకు సంబంధించిన ప్రతిపాదనలు చర్చకు వచ్చినట్లు సమాచారం. అనంతరం 2025 అక్టోబర్‌లో జరిగిన బోర్డు సమావేశంలో వేగవంతమైన ఆటోమేటెడ్ క్లెయిమ్‌లు, తక్షణ ఉపసంహరణలు, మెరుగైన డిజిటల్ సేవలకు సంబంధించిన కొత్త ఫ్రేమ్‌వర్క్‌కు ఆమోదం లభించినట్లు నివేదికలు వెల్లడించాయి.
UPI ద్వారా PF విత్డ్రాయల్లో ఆలస్యం ఎందుకు?
వాస్తవానికి ఈ సదుపాయం గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికే అందుబాటులోకి వస్తుందని తొలుత అంచనా వేశారు. అయితే సాంకేతిక అనుసంధానం, పరీక్షల ప్రక్రియ కారణంగా ఆలస్యమైనట్లు తెలుస్తోంది. UPI వ్యవస్థకు అవసరమైన API అభివృద్ధి, బ్యాంకింగ్ మరియు చెల్లింపు వ్యవస్థలతో అనుసంధానానికి సంబంధించిన పనులు చేపట్టినట్లు సమాచారం. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే వినియోగదారులకు ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. కొత్త విధానం అమల్లోకి వచ్చిన తర్వాత EPFO సభ్యులు BHIM యాప్ ద్వారా UPI ఉపయోగించి తమ ఆమోదం పొందిన పీఎఫ్ ఉపసంహరణ మొత్తాన్ని నేరుగా బ్యాంకు ఖాతాలోకి పొందవచ్చు. ప్రస్తుతం పీఎఫ్ క్లెయిమ్‌ల పరిష్కారం, నగదు జమ కావడానికి పట్టే సమయంతో పోలిస్తే ఈ విధానం మరింత వేగంగా పనిచేసే అవకాశం ఉంది. మొత్తంగా ఈ కొత్త సదుపాయం అమల్లోకి వస్తే ప్రైవేట్ ఉద్యోగులకు పీఎఫ్ డబ్బుల ఉపసంహరణ మరింత సులభతరం కానుంది.
తాజావార్తలు
-
Arjun: రాముడి కథతో ‘యాక్షన్ కింగ్’ అర్జున్ భారీ స్కెచ్
-
EPFO: PF ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. డిసెంబర్ నుంచి కొత్త సదుపాయం..?
-
SP Manifesto: 5 రూపాయలకే భోజనం, మహిళలకు ఏటా రూ.40 వేలు.. ఎస్పీ మేనిఫెస్టోలో భారీ హామీలు..
-
ENE Repeat : ఫస్ట్ వీక్‌లోనే ‘ఈ నగరానికి ఏమైంది 2’ బ్రేక్ ఈవెన్
-
CJP: సీజేపీకి బిగ్ షాక్.. దీప్కే, దాస్, రాంకాలకు లుకౌట్ నోటీసులు!
ట్రెండింగ్
-
కేవలం రూ.9,999కే HMD Rise.. 6.51 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, 13MP డ్యూయల్ కెమెరా..
-
కశ్మీర్ టు కన్యాకుమారి.. 4,023 కి.మీ దూసుకెళ్లిన Bajaj Wego ఎలక్ట్రిక్ ఆటో..! సరికొత్త రికార్డ్స్ సొంతం..
-
Maruti Suzuki Car Price Hike: మరోసారి కార్ల ధరల పెంపు.. ఏ మోడల్‌పై ఎంత పెరిగిందంటే?
-
Sheetal Devi: పతకాల వేటలో అదరగొట్టిన ఆర్చర్‌కు బంపర్ గిఫ్ట్.. Bayon SUV అందించిన హ్యుందాయ్..!
-
Apple Kukatpally: హైదరాబాద్‌లో తొలి అధికారిక Apple స్టోర్.. డిసెంబర్ 10న ప్రారంభం..!