Passport New Rules 2026: పాస్‌పోర్ట్ నిబంధనలు, ఫీజుల్లో మార్పులు.. కొత్త ఛార్జీలు ఇవే
- పాస్‌పోర్ట్ కొత్త నిబంధనలు
- పిల్లల Validity, ఫీజుల్లో కీలక మార్పులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Passport Fees Hiked in India: విదేశాలకు వెళ్లేందుకు అవసరమైన పాస్‌పోర్ట్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) పాస్‌పోర్ట్ నిబంధనల్లో మార్పులను ప్రకటించింది. 2026లో వెలువడిన కొత్త నిబంధనల ప్రకారం కొన్ని కేటగిరీల పాస్‌పోర్ట్ దరఖాస్తులకు ఫీజులు సవరించారు. అధికారిక e-Gazetteలో కూడా Passports (Amendment) Rules, 2026 నోటిఫికేషన్ నమోదైంది. ఇక పిల్లల పాస్‌పోర్ట్ చెల్లుబాటు, సాధారణ (Normal), తత్కాల్ (Tatkaal) పాస్‌పోర్ట్ ఫీజులు వంటి అంశాల్లో మార్పులు దరఖాస్తుదారులు తెలుసుకోవాల్సి ఉంటుంది.
15 ఏళ్లలోపు పిల్లల పాస్‌పోర్ట్‌కు కొత్త నిబంధన
15 సంవత్సరాల లోపు పిల్లలకు జారీ చేసే 36 పేజీల సాధారణ పాస్‌పోర్ట్‌కు ప్రత్యేక చెల్లుబాటు నిబంధన ఉంటుంది. పాస్‌పోర్ట్ జారీ చేసిన తేదీ నుంచి 5 సంవత్సరాలు లేదా పిల్లలకు 18 సంవత్సరాలు పూర్తయ్యే వరకు చెల్లుబాటులో ఉంటుంది. ఈ రెండింటిలో ఏది ముందుగా వస్తే అదే వర్తిస్తుంది.
Also Read
- RBI: ఆర్బీఐ షాక్ ఇవ్వబోతుందా? రేపు వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా? నిపుణుల అంచనా ఇదే!
- Cash Withdrawal Surges: ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణలో కొత్త రికార్డు.. ఏకంగా రూ.2.24 లక్షల కోట్లు డ్రా!
- IndiGo Flight Fare Hike: ఇండిగో విమాన ప్రయాణికులకు షాక్.. నేటి నుంచి రూ.350 వరకు అదనపు భారం, కొత్త ఛార్జీలు ఇవే!
- Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
పాస్‌పోర్ట్ ఫీజులు ఎంత?
పాస్‌పోర్ట్ కేటగిరీ పాత ఫీజు కొత్త ఫీజు
36 పేజీలు – Normal రూ.1,500 రూ.2,500
60 పేజీలు – Normal రూ.2,000 రూ.3,500
36 పేజీలు – Tatkaal రూ.3,500 రూ.5,000
60 పేజీలు – Tatkaal రూ.4,000 రూ.6,000
60 పేజీల పాస్‌పోర్ట్ Tatkaal Replacement రూ.5,500 రూ.8,500
Minor 36 పేజీలు – Normal Fresh/Reissue రూ.1,000 రూ.1,750
Minor 36 పేజీలు – Tatkaal – రూ.3,000
చిన్న పిల్లలు, సీనియర్ సిటిజన్లకు 10% రాయితీ
8 ఏళ్లలోపు పిల్లలు, 60 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లు కొత్తగా (Fresh) పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు ప్రాథమిక పాస్‌పోర్ట్ ఫీజుపై 10 శాతం రాయితీ వర్తిస్తుంది. అయితే ఈ రాయితీ Reissue/Renewal దరఖాస్తులకు వర్తించదని Passport Seva మార్గదర్శకాల్లో పేర్కొంది.
Tatkaal పాస్‌పోర్ట్‌కు అదనపు చార్జీలు
Tatkaal పాస్‌పోర్ట్ కోసం సాధారణ పాస్‌పోర్ట్ ఫీజుతో పాటు Tatkaal ఛార్జీ కూడా వర్తిస్తుంది. Tatkaal కోసం దరఖాస్తు చేసే ముందు సంబంధిత అర్హత నిబంధనలు, అవసరమైన అదనపు పత్రాలను పరిశీలించాలని Passport Seva సూచిస్తోంది.
అధికారిక వెబ్సైట్లోనే దరఖాస్తు చేయండి
పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసేటప్పుడు నకిలీ వెబ్సైట్లు, అనధికారిక ఏజెంట్లను నమ్మవద్దని Passport Seva హెచ్చరిస్తోంది. పాస్‌పోర్ట్ సేవలకు అధికారిక పోర్టల్‌ను మాత్రమే ఉపయోగించాలని సూచించింది.
తాజావార్తలు
-
Team India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత జట్టులోకి స్టార్ ప్లేయర్..
-
Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
-
Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
-
WI Vs Ind: ముగిసిన వెస్టిండీస్ బ్యాటింగ్.. భారత్ టార్గెట్ 172 పరుగులు..
-
Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!