Ola Electric Share: ఒక్కప్పుడు రారాజు.. ఇప్పుడు బికారి! ఓలా ఎలక్ట్రిక్ రూ.157 నుంచి రూ.20 కి?
- ఓలా ఎలక్ట్రిక్ ఇన్వెస్టర్లకు షాక్
- మార్కెట్ నిపుణుల సంచలన హెచ్చరిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ola Electric Share: ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) షేర్లలో కొనసాగుతున్న భారీ ఒడిదుడుకులు అటు ఇన్వెస్టర్లను, ఇటు మార్కెట్ వర్గాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా కంపెనీ ప్రమోటర్లు తమ వాటాలను విక్రయించినప్పటి నుంచి ఈ స్టాక్ పతనం స్టార్ట్ అయ్యింది. తాజాగా బ్రోకరేజ్ సంస్థలు ఈ షేర్ విషయంలో ఇన్వెస్టర్లను హెచ్చరిస్తూ కీలక వ్యాఖ్యలు చేశాయి.
రూ.20కి పడిపోయే అవకాశం..
ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ కోటక్ సెక్యూరిటీస్.. ఓలా ఎలక్ట్రిక్ షేర్ ధర రూ.20 స్థాయికి పడిపోవచ్చని అంచనా వేస్తూ, దీనిని సేల్ చేయాలని సూచించింది. కంపెనీ అమ్మకాలు తగ్గడం, పెరుగుతున్న పోటీయే ఇందుకు ప్రధాన కారణమని పేర్కొంది. మరో సంస్థ ఎమ్కే గ్లోబల్ కూడా ఈ స్టాక్‌ను ‘అండర్ పెర్ఫార్మ్’ కేటగిరీలో చేర్చింది. ఏప్రిల్ 2026 ఆరంభంలో ఈ షేర్ అనూహ్యంగా పుంజుకుంది. కేవలం కొద్ది రోజుల్లోనే 70 శాతం లాభపడి రూ.22.8 నుంచి రూ. 40.88 స్థాయికి చేరుకుంది. సోమవారం నాడు ఈ షేర్ 4% పెరిగి రూ. 37.22 వద్ద ట్రేడ్ అవుతున్నప్పటికీ, నిపుణులు మాత్రం ఇది ‘ఖరీదైనది’ (Overvalued) అని భావిస్తున్నారు. ఈ స్వల్పకాలిక పెరుగుదల చూసి రిటైల్ ఇన్వెస్టర్లు మళ్లీ ఎంట్రీ ఇస్తున్నారని, కానీ రిస్క్ అధికంగా ఉందని హెచ్చరిస్తున్నారు.
Also Read
- Digital Arrest Scam: డిజిటల్ మోసాల్లో డబ్బు పోతే బ్యాంకులే పరిహారం చెల్లించాలి.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!
- DA Hike 2026: జీతం, పెన్షన్, బకాయిలు.. 3% డిఏ/డిఆర్ పెంపు వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి?
- Diwali Bonus: దీపావళి ధమాకా.. ఆ ఉద్యోగులకు భారీగా బోనస్!
- Silver Price: కొనుగోలుదారులకు ఊరట.. వెండి ధరల్లో ఊహించని మార్పులు..
రికార్డు గరిష్టం నుంచి భారీ పతనం
ఆగస్టు 2024లో స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించిన కొద్ది రోజులకే ఓలా ఎలక్ట్రిక్ షేర్ రూ.157 ఆల్-టైమ్ గరిష్ట స్థాయిని తాకింది. అయితే కంపెనీ ఆర్థిక ఫలితాలు ఆశాజనకంగా లేకపోవడం, మార్కెట్ వాటా పడిపోవడంతో ఈ షేర్ విలువ భారీగా క్షీణించింది. గరిష్ట స్థాయి నుంచి ఈ షేర్ దాదాపు 70 శాతానికి పైగా పతనమైంది. ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ ప్రస్తుతం అనేక క్లిష్ట పరిస్థితులను ఎదుర్కుంటోందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఒకప్పుడు ఈ సెగ్మెంట్లో 70 శాతానికి పైగా ఆధిపత్యం చలాయించిన ఓలా వాటా, ఇప్పుడు కేవలం 6 శాతానికి పడిపోయింది. టీవీఎస్, బజాజ్ వంటి దిగ్గజ టూ-వీలర్ కంపెనీలు ఈ రంగంలోకి రావడంతో ఓలా గట్టి పోటీని ఎదుర్కొంటోంది. గత కొన్ని ఏళ్లుగా సర్వీస్, నాణ్యత విషయంలో ఎదురైన సమస్యల వల్ల కంపెనీపై కస్టమర్ల నమ్మకం సన్నగిల్లింది. మొత్తానికి తగ్గుతున్న అమ్మకాలు, పెరుగుతున్న నష్టాల నేపథ్యంలో ఓలా ఎలక్ట్రిక్ భవిష్యత్తుపై మార్కెట్ నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
-
Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!