Ola Electric Share: ఒక్కప్పుడు రారాజు.. ఇప్పుడు బికారి! ఓలా ఎలక్ట్రిక్ రూ.157 నుంచి రూ.20 కి?
- ఓలా ఎలక్ట్రిక్ ఇన్వెస్టర్లకు షాక్
- మార్కెట్ నిపుణుల సంచలన హెచ్చరిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ola Electric Share: ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) షేర్లలో కొనసాగుతున్న భారీ ఒడిదుడుకులు అటు ఇన్వెస్టర్లను, ఇటు మార్కెట్ వర్గాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా కంపెనీ ప్రమోటర్లు తమ వాటాలను విక్రయించినప్పటి నుంచి ఈ స్టాక్ పతనం స్టార్ట్ అయ్యింది. తాజాగా బ్రోకరేజ్ సంస్థలు ఈ షేర్ విషయంలో ఇన్వెస్టర్లను హెచ్చరిస్తూ కీలక వ్యాఖ్యలు చేశాయి.
రూ.20కి పడిపోయే అవకాశం..
ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ కోటక్ సెక్యూరిటీస్.. ఓలా ఎలక్ట్రిక్ షేర్ ధర రూ.20 స్థాయికి పడిపోవచ్చని అంచనా వేస్తూ, దీనిని సేల్ చేయాలని సూచించింది. కంపెనీ అమ్మకాలు తగ్గడం, పెరుగుతున్న పోటీయే ఇందుకు ప్రధాన కారణమని పేర్కొంది. మరో సంస్థ ఎమ్కే గ్లోబల్ కూడా ఈ స్టాక్‌ను ‘అండర్ పెర్ఫార్మ్’ కేటగిరీలో చేర్చింది. ఏప్రిల్ 2026 ఆరంభంలో ఈ షేర్ అనూహ్యంగా పుంజుకుంది. కేవలం కొద్ది రోజుల్లోనే 70 శాతం లాభపడి రూ.22.8 నుంచి రూ. 40.88 స్థాయికి చేరుకుంది. సోమవారం నాడు ఈ షేర్ 4% పెరిగి రూ. 37.22 వద్ద ట్రేడ్ అవుతున్నప్పటికీ, నిపుణులు మాత్రం ఇది ‘ఖరీదైనది’ (Overvalued) అని భావిస్తున్నారు. ఈ స్వల్పకాలిక పెరుగుదల చూసి రిటైల్ ఇన్వెస్టర్లు మళ్లీ ఎంట్రీ ఇస్తున్నారని, కానీ రిస్క్ అధికంగా ఉందని హెచ్చరిస్తున్నారు.
Also Read
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- BSNL Freedom 2.0: జియో, ఎయిర్‌టెల్‌లకు షాకిచ్చిన బీఎస్ఎన్ఎల్.. రూపాయికే సిమ్‌తో పాటు బంపర్ ఆఫర్లు!
- DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
రికార్డు గరిష్టం నుంచి భారీ పతనం
ఆగస్టు 2024లో స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించిన కొద్ది రోజులకే ఓలా ఎలక్ట్రిక్ షేర్ రూ.157 ఆల్-టైమ్ గరిష్ట స్థాయిని తాకింది. అయితే కంపెనీ ఆర్థిక ఫలితాలు ఆశాజనకంగా లేకపోవడం, మార్కెట్ వాటా పడిపోవడంతో ఈ షేర్ విలువ భారీగా క్షీణించింది. గరిష్ట స్థాయి నుంచి ఈ షేర్ దాదాపు 70 శాతానికి పైగా పతనమైంది. ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ ప్రస్తుతం అనేక క్లిష్ట పరిస్థితులను ఎదుర్కుంటోందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఒకప్పుడు ఈ సెగ్మెంట్‌లో 70 శాతానికి పైగా ఆధిపత్యం చలాయించిన ఓలా వాటా, ఇప్పుడు కేవలం 6 శాతానికి పడిపోయింది. టీవీఎస్, బజాజ్ వంటి దిగ్గజ టూ-వీలర్ కంపెనీలు ఈ రంగంలోకి రావడంతో ఓలా గట్టి పోటీని ఎదుర్కొంటోంది. గత కొన్ని ఏళ్లుగా సర్వీస్, నాణ్యత విషయంలో ఎదురైన సమస్యల వల్ల కంపెనీపై కస్టమర్ల నమ్మకం సన్నగిల్లింది. మొత్తానికి తగ్గుతున్న అమ్మకాలు, పెరుగుతున్న నష్టాల నేపథ్యంలో ఓలా ఎలక్ట్రిక్ భవిష్యత్తుపై మార్కెట్ నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
World’s Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
-
Jailer 2 : ‘జైలర్ 2’లో ఫ్యామిలీ ఎమోషన్స్ కు చోటు లేదా?.. నెల్సన్ దాచిన సర్ప్రైజ్ ఏంటి?
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి