NTV Telugu Site icon

Stock market: సరికొత్త రికార్డ్‌లు సృష్టించిన స్టాక్ మార్కెట్

Stokcmarket

Stokcmarket

దేశీయ మార్కెట్‌లో ఐదు రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. ఆసియా మార్కెట్‌లోని సానుకూల సంకేతాలు మన మార్కెట్‌ సూచీలకు దన్నుగా నిలిచాయి. దీంతో శుక్రవారం ఉదయం లాభాలతో ట్రేడ్ అయిన సూచీలు.. రికార్డు దిశగా దూసుకుపోయాయి. ఇక తాజాగా నిఫ్టీ రికార్డు గరిష్టాన్ని నమోదు చేసింది. సెన్సెక్స్ కూడా భారీగా దూసుకుపోయింది. సెన్సెక్స్ 1292 పాయింట్లు లాభపడి 81, 332 దగ్గర ముగియగా… నిఫ్టీ 428 పాయింట్లు లాభపడి 24, 834 దగ్గర ముగిసింది. నిఫ్టీ శుక్రవారం 24,854.80 మార్కు చేరింది. 25 వేల మార్కుకు అతి చేరువలో ఉంది.

నిఫ్టీలో శ్రీరామ్ ఫైనాన్స్, దివీస్ ల్యాబ్స్, అపోలో హాస్పిటల్స్, భారతీ ఎయిర్‌టెల్, విప్రోలు లాభపడగా.. ఓఎన్‌జీసీ, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, యాక్సిస్ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ నష్టపోయాయి. ఐటీ, మెటల్, ఫార్మా, రియల్టీ, ఆటో, క్యాపిటల్ గూడ్స్, టెలికాం, మీడియా రంగాల సూచీలు 1.3 శాతం వృద్ధితో అన్ని రంగాలు గ్రీన్‌లో ట్రేడయ్యాయి.