మారిన Income Tax ఫారమ్స్..! పాన్ కార్డ్ వాడేవారు ఈ తప్పు అస్సలు చేయకండి.!
- ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి కొత్త ఆదాయపు పన్ను నిబంధనలు
- మెట్రో నగరాల జాబితాలో హైదరాబాద్ సహా నాలుగు నగరాలు
- HRA క్లెయిమ్‌లో పారదర్శకత తప్పనిసరి
- రూ. 5 లక్షల పైబడిన లావాదేవీలకు PAN తప్పనిసరి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆదాయపు పన్ను చట్టంలో సుమారు ఆరు దశాబ్దాల తర్వాత వస్తున్న అతిపెద్ద మార్పులు ఏప్రిల్ 1, 2026 నుండి అమల్లోకి రానున్నాయి. పన్ను చెల్లింపు ప్రక్రియను మరింత పారదర్శకంగా, సరళంగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కొత్త నిబంధనలను తీసుకువచ్చింది. ఈ కొత్త చట్టం ప్రకారం పన్ను మినహాయింపులు, నిబంధనలు , ఫారమ్‌ల సంఖ్యలో భారీ మార్పులు జరిగాయి.
ముఖ్యంగా, చాలా కాలంగా ఎదురుచూస్తున్న ‘మెట్రో నగరాల’ జాబితాలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు కేవలం నాలుగు నగరాలకే పరిమితమైన ఈ జాబితాలో ఇప్పుడు హైదరాబాద్, బెంగళూరు, పూణే , అహ్మదాబాద్ నగరాలను కూడా చేర్చారు. దీనివల్ల ఈ నగరాల్లో నివసించే వేతన జీవులకు హౌస్ రెంట్ అలవెన్స్ (HRA) విషయంలో మరింత పన్ను మినహాయింపు లభించే అవకాశం ఉంది. అయితే, ఈ పన్ను ఆదా ప్రక్రియలో ఇకపై పారదర్శకత తప్పనిసరి. HRA క్లెయిమ్ చేసేటప్పుడు యజమానితో మీకు ఉన్న సంబంధాన్ని స్పష్టంగా వెల్లడించాల్సి ఉంటుంది, తద్వారా దగ్గరి బంధువులకు అద్దె చెల్లిస్తున్నట్లు చూపించి పన్ను ఆదా చేసే విధానాలపై ప్రభుత్వం నిఘా పెంచనుంది.
Also Read
- Digital Train Ticket: వాట్సాప్ టిక్కెట్లకు చెల్లుచీటి.. రైల్వే శాఖ తెచ్చిన సరికొత్త రూల్స్..
- NPPA: సామాన్యుడికి భారీ ఉపశమనం.. రక్తపోటు నుంచి మధుమేహం వరకు.. 39 మందుల ధరలను నిర్ణయించిన ప్రభుత్వం
- RailOne Ticket Rules: రైలు ప్రయాణికులకు అలర్ట్.. ఆ టిక్కెట్స్ చెల్లవు.. కొత్త నిబంధనలు వెల్లడించిన భారతీయ రైల్వే
- Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
Iran-US-Israel War: ఇరాన్ యుద్ధం షాక్.. ఈ వస్తువుల ధరలు ఆకాశానికి!
ఇక పాన్ కార్డ్ (PAN) వాడకం విషయంలోనూ కఠినతరమైన, స్పష్టమైన నిబంధనలను ప్రభుత్వం తీసుకువచ్చింది. రూ. 5 లక్షలకు పైబడిన వాహనాల కొనుగోలుకు, రూ. 20 లక్షలు దాటిన స్థిరాస్తి లావాదేవీలకు, ఏడాదిలో రూ. 10 లక్షల కంటే ఎక్కువ నగదు డిపాజిట్ లేదా విత్‌డ్రా చేసినా పాన్ ఇవ్వడం తప్పనిసరి. అలాగే హోటల్ బిల్లులు రూ. లక్ష దాటినా పాన్ వివరాలు సమర్పించాలి. వీటన్నింటితో పాటు, ద్రవ్యోల్బణానికి అనుగుణంగా పిల్లల విద్యా , హాస్టల్ అలవెన్సులను గణనీయంగా పెంచారు. విద్యా అలవెన్స్ నెలకు రూ. 3,000కి, హాస్టల్ అలవెన్స్ రూ. 9,000కి పెరగడం మధ్యతరగతి ఉద్యోగులకు ఉపశమనం కలిగించే అంశం. యజమాని నుండి లభించే గిఫ్ట్స్, మీల్ వోచర్లు , మెడికల్ లోన్లపై కూడా పన్ను మినహాయింపు పరిమితులను సవరించారు.
పరిపాలనా పరంగా చూస్తే, గందరగోళానికి గురిచేసే 511 నిబంధనలను 333కి , 399 ఫారమ్‌లను 190కి తగ్గించడం వల్ల సామాన్య పన్ను చెల్లింపుదారులకు ఇబ్బందులు తగ్గుతాయి. ఇకపై మనం చూసే ఫారమ్ నంబర్లలో కూడా మార్పులు ఉంటాయి. ఉదాహరణకు, గతంలో వాడే ఫారమ్ 16 ఇకపై ఫారమ్ 130గా, పాన్ అప్లికేషన్ ఫారమ్ 49A ఇకపై ఫారమ్ 94గా మారనుంది. పన్ను చెల్లింపుదారుల సౌలభ్యం, పారదర్శకత , డిజిటల్ విధానమే లక్ష్యంగా ఈ కొత్త నిబంధనలు రూపొందించబడ్డాయి.
Best Selling Cars: SUVల జోరు.. ఫిబ్రవరిలో అత్యధికంగా అమ్ముడైన కార్లు ఇవే..!
తాజావార్తలు
-
Donald Trump: నన్ను చంపడానికి ట్రై చేస్తే 1,000 క్షిపణులు సిద్ధంగా ఉన్నాయ్.. ట్రంప్ షాకింగ్ ప్రకటన..
-
Ashwini Vaishnaw: వికసిత్ భారత్-2047 లక్ష్యంతో టెక్నాలజీ విప్లవం.. హైదరాబాద్‌కు 3 బుల్లెట్ ట్రైన్ కారిడార్లు.!
-
VIDA VX2 Plus: 187KM రేంజ్‌తో హీరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫాస్ట్ ఛార్జింగ్, రిమూవబుల్ బ్యాటరీ
-
Vinayakan: చిన్నారి ఫోటో పోస్ట్ వివాదం.. ‘జైలర్’ విలన్ వినాయకన్‌పై మరో కేసు
-
BCCI: టీమ్ ఇండియా కోచింగ్ టీమ్‌లో మార్పులు..! గంభీర్ సహాయకుల్లో ఇద్దరిని తొలగిస్తారా..?
ట్రెండింగ్
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్‌తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
-
IND vs ENG: భారత్‌తో సిరీస్‌లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!