Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Business News New Credit Card Rules In April 2024 Changes

Credit cards alert: క్రిడెట్ కార్డు వాడుతున్నారా? బిగ్ అలర్ట్!

Published Date :March 21, 2024 , 5:07 pm
By Suresh Maddala
Credit cards alert: క్రిడెట్ కార్డు వాడుతున్నారా? బిగ్ అలర్ట్!
  • Follow Us :
  • google news
  • dailyhunt

మీరు క్రిడెట్ కార్డులు వాడుతున్నారా? అయితే మీరు అలర్ట్ కావాల్సిందే. ఎందుకంటే కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి కొన్ని మార్పులు రాబోతున్నాయి. అవేంటో తెలియాలంటే ఈ వార్త చదవండి.

క్రెడిట్‌ కార్డుల విషయంలో ఆయా బ్యాంకులు మార్పులు, చేర్పులు చేశాయి. కొత్త రూల్స్ ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. రివార్డులు, ఎయిర్‌పోర్ట్‌ లాంజ్‌ యాక్సెస్‌ విషయంలో బ్యాంకులు మార్పులు చేపట్టాయి. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎస్‌ బ్యాంక్‌.. వంటి ప్రధాన బ్యాంకులు లాంజ్‌ యాక్సెస్‌, రివార్డ్‌ పాయింట్ల విషయంలో కీలక మార్పులు తీసుకొస్తున్నాయి. మరో వారంలోనే ఈ రూల్స్ అమల్లోకి రానున్నాయి. ఆవేంటో ముందే తెలుసుకుని అలర్ట్ అవ్వండి.

ఎస్‌బీఐ
ప్రముఖ ప్రభుత్వ రంగానికి చెందిన ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డ్‌ రివార్డ్‌ పాయింట్ల విధానాల్లో మార్పు చేసింది. ఇప్పటివరకు అద్దె చెల్లింపులపై రివార్డ్‌ పాయింట్లను అందిస్తున్న బ్యాంక్‌.. ఇకపై ఆ తరహా రివార్డులను నిలిపివేయనుంది. ఏప్రిల్‌ 1 నుంచి ఈ నిబంధనలు వర్తిస్తాయని పేర్కొంది. ఎస్‌బీఐ అందిస్తున్న AURUM, SBI కార్డ్ ఎలైట్, సింప్లీ క్లిక్‌ ఎస్‌బీఐ కార్డులు వినియోగిస్తున్న వారిపై ఈ ప్రభావం ఉండనుంది.

ఐసీఐసీఐ..
ఇక ఐసీఐసీఐ కూడా పలు మార్పులు చేసింది. కాంప్లిమెంటరీ ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ విషయంలో నిబంధనల్ని ఐసీఐసీఐ బ్యాంక్ సవరించింది. రానున్న ఆర్థిక సంవత్సరంలో ఈ సదుపాయం పొందాలంటే మునుపటి త్రైమాసికంలో కార్డ్‌ ద్వారా కనీసం రూ.35,000 ఖర్చు చేయాల్సి ఉంటుంది. కోరల్‌ క్రెడిట్‌ కార్డ్‌, మేక్‌ మై ట్రిప్‌ ఐసీఐసీఐ బ్యాంక్‌ ప్లాటినం క్రెడిట్‌ కార్డ్‌ సహా వివిధ రకాల కార్డులకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. ఈ మార్పులు కూడా కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి రానున్నాయి.

యస్‌ బ్యాంక్‌
ఐసీఐసీఐ బ్యాంక్‌ తరహానే యస్‌ బ్యాంక్‌ కూడా లాంజ్‌ యాక్సెస్‌లో నిబంధనల్ని సవరించింది. ఏప్రిల్ 1 నుంచి ఏ త్రైమాసికంలో లాంజ్‌ సదుపాయం పొందాలన్నా అంతకు మునుపటి త్రైమాసికంలో కార్డ్‌ ద్వారా కనీసం రూ.10,000 వెచ్చించాల్సి ఉంటుందని పేర్కొంది.

యాక్సిస్‌ బ్యాంక్‌
ఇక మరో ప్రైవేటు రంగ యాక్సిస్‌ బ్యాంక్‌ అందిస్తున్న మాగ్నస్‌ క్రెడిట్‌ కార్డ్‌పై రివార్డ్‌ పాయింట్లు, లాంజ్‌ యాక్సెస్‌తో పాటు వార్షిక రుసుముల్లో కీలక మార్పుల్ని తీసుకొచ్చింది. బీమా, గోల్డ్‌/ఆభరణాలు, ఇంధనం కోసం క్రెడిట్‌ కార్డ్‌ ద్వారా జరిపే చెల్లింపులపై ఇక నుంచి ఎలాంటి రివార్డ్‌ పాయింట్లూ ఇవ్వబోమని స్పష్టం చేసింది. ఇక ఎయిర్‌పోర్ట్‌ లాంజ్‌ యాక్సెస్‌ పొందాలంటే మూడు నెలల్లో కనీసం రూ.50,000 ఖర్చు చేయాల్సి ఉంటుంది. అలాగే దేశీయ, అంతర్జాతీయ లాంజ్‌ల్లోకి కాంప్లిమెంటరీ గెస్ట్‌ సందర్శనల సంఖ్యను కూడా ఏడాదికి 8 నుంచి 4కు తగ్గించనుంది. ఏప్రిల్‌ 20 నుంచి ఈ కొత్త మార్పులు అమల్లోకి వస్తాయని బ్యాంక్‌ తెలిపింది.

ఇది కూడా చదవండి: Supreme Court: తమిళనాడు గవర్నర్ కోర్టును ధిక్కరిస్తున్నాడు.. కేంద్రం ఏం చేస్తుందని సుప్రీం ఫైర్..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • april 2024 changes
  • axis bank
  • credit card rules
  • Credit cards alerts
  • icici bank

తాజావార్తలు

  • Samantha : ఈ రోజు నేను ఇంత ధైర్యంగా ఉన్నానంటే కారణం ఆయనే

  • Free House and Job: స్కూలుకు వెళ్లే పిల్లలు ఉంటే చాలు.. ఫ్రీ ఇల్లు, వెంటనే ఉద్యోగం.. ఈ ‘బంపర్ ఆఫర్’ ఎక్కడో తెలుసా?

  • Stock Market: భారీ నష్టాల్లో కొనసాగుతోన్న స్టాక్ మార్కెట్.. కారణమిదేనా?

  • BV Raghavulu: చంద్రబాబు, జగన్‌పై బీవీ రాఘవులు ఘాటు వ్యాఖ్యలు..

  • Artemis II: అంతరిక్షంలో రూ.192 కోట్ల విలువైన టాయిలెట్ జామ్.. గ్రౌండ్ టీమ్ ట్రబుల్‌షూటింగ్

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions