విమాన టికెట్ల ధరలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సీరియస్ అయ్యారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు ఆయన లేఖ రాశారు. విమాన ప్రయాణికులను విమాన సంస్థలు దోచుకుంటున్నాయని.. మౌలిక సదుపాయాలు ప్రభుత్వం కలిపిస్తే ప్రైవేట్ విమానయాన సంస్థలు అడ్డగోలుగా టికెట్ రేట్లు పెంచుతున్నాయని మండిపడ్డారు.