ప్రత్యర్థులకు గుండె గుబేల్.. 110 బిలియన్ డాలర్ల పెట్టుబడితో Reliance Industries భారీ స్కెచ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Reliance Industries: భారత వాణిజ్య రంగంలో అతిపెద్ద సంస్థల్లో ఒకటైన రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) భారీ ప్లాన్ కు శ్రీకారం చుట్టింది. వచ్చే ఏడు సంవత్సరాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డేటా సెంటర్లు, డిజిటల్ ఎకోసిస్టమ్, ఎనర్జీ రంగాల్లో ఏకంగా 110 బిలియన్ డాలర్లు (రూ.10 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టేందుకు సంస్థ ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ మేరకు విషయాన్నీ రిలయన్స్ సంస్థ చైర్మన్ ముకేష్ అంబానీ ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ లో ప్రకటించారు.
55dB ANC, 54 గంటల బ్యాటరీ, సూపర్ ఫీచర్లతో Oppo Enco Air 5 Pro లాంచ్..!
Also Read
- Gold and Silver Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. భారీగా దిగివచ్చిన వెండి.. నేటి రేట్లు ఇవే
- Sugar Price Hike: కొండెక్కుతున్న చక్కెర ధరలు.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం..
- LPG e-KYC చివరి తేదీ దాటింది.. ఇక సిలిండర్ రాదా? అసలు నిజం ఇదే!
- Bank Strike Alert: బ్యాంక్ ఉద్యోగుల సంచలన నిర్ణయం.. ఆరోజున దేశవ్యాప్త సమ్మె.. కీలక వివరాలు ఇవే
గతంలో టెలికాం, ఇంటర్నెట్ రంగాల్లో భారీ పెట్టుబడులు పెట్టి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన రిలయన్స్.. ఇప్పుడు AI రంగంలో కూడా అదే స్థాయిలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ పెట్టుబడి 2014 నుంచి 2021 మధ్య టెలికాం, డిజిటల్ రంగాల్లో చేసిన పెట్టుబడులకు సమానంగా ఉంటుంది. ఈ పెట్టుబడుల ద్వారా AI సేవలను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకుంది రిలయన్స్.
Vastu Mistakes at Home: వాస్తు చిట్కాలు.. ఈ చిన్న తప్పులే.. మీ ఇంట్లో పెద్ద సమస్యగా మారవచ్చు..!
ఈ భారీ పెట్టుబడిలో భాగంగా మల్టీ-గిగావాట్ డేటా సెంటర్లు, 10 గిగావాట్ రిన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టులు, ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్, AI చిప్ అభివృద్ధి వంటి ప్రాజెక్టులు అమలు చేయనున్నారు. ఇప్పటికే 1 గిగావాట్ సామర్థ్యంతో AI హుక్ అప్ నిర్మాణం ప్రారంభమైందని సమాచారం. FY26 రెండో భాగంలో 120 మెగావాట్ సామర్థ్యంతో మొదటి దశ ప్రాజెక్టులు ప్రారంభం కావచ్చు. AI రంగంలో విస్తరణ కోసం రిలయన్స్ భాగస్వామ్య విధానాన్ని అనుసరించనుంది. ప్రపంచ టెక్ దిగ్గజాలైన ‘మెటా’, ‘గూగుల్’ వంటి సంస్థలతో భాగస్వామ్యం ద్వారా పెట్టుబడి భారం తగ్గించుకోవడంతో పాటు సాంకేతిక సామర్థ్యాన్ని పెంచుకోవాలని భావిస్తోంది.
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్‌గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!