IRDAI New Motor Insurance Rules: కారు, బైక్ ఉన్నవారికి అలర్ట్.. డిసెంబర్ 15 నుంచి మోటార్ ఇన్సూరెన్స్‌లో కొత్త రూల్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IRDAI New Motor Insurance Rules: కారు లేదా బైక్ కొనుగోలు చేసినప్పుడు మోటార్ ఇన్సూరెన్స్ తీసుకోవడం తప్పనిసరి. అయితే ఇకపై మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే విధానంలో కీలక మార్పులు రాబోతున్నాయి. 2026 డిసెంబర్ 15 నుంచి కొత్త 4-లేయర్ మోటార్ ఇన్సూరెన్స్ విధానం అమల్లోకి రానున్నట్లు సమాచారం. ఈ విధానంలో వాహనదారులు తమ అవసరాలకు అనుగుణంగా వివిధ రకాల ఇన్సూరెన్స్ కకవరేజీ ఎంచుకోవచ్చు. భారత బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (IRDAI) ఈ మార్పులకు సంబంధించి సర్క్యులర్ జారీ చేసినట్లు సమాచారం. కొత్త విధానం అమల్లోకి వస్తే ప్రతి కవరేజీ ఒకేసారి తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఏ కవరేజీ తప్పనిసరి? ఏది ఐచ్ఛికం? పూర్తి వివరాలు తెలుసుకుందాం.
మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ నాలుగు విభాగాలుగా విభజన
1. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ – తప్పనిసరి
థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ గతంలో మాదిరిగానే తప్పనిసరిగా కొనసాగుతుంది. మీ వాహనం వల్ల మరొక వ్యక్తికి లేదా వారి ఆస్తికి నష్టం జరిగితే, అందుకు సంబంధించిన చట్టపరమైన బాధ్యతలకు ఈ ఇన్సూరెన్స్ రక్షణ కల్పిస్తుంది. వాహనదారులు ఈ కవరేజీ తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది.
Also Read
- Anil Ambani Group: అనిల్ అంబానీ గ్రూప్‌పై ఈడీ భారీ చర్యలు.. రూ.510 కోట్ల ఆస్తులు అటాచ్, చార్టర్డ్ విమానాలు స్వాధీనం
- Forbes Billionaires List: ఆసియాలో ధనవంతుల జాబితా విడుదల.. ప్రపంచ కుబేరుల్లో భారీ మార్పులు..!
- Atal Pension Yojana: చిన్న మొత్తంతో పెద్ద భరోసా.. రూ.21 వేల పెట్టుబడితో రూ.1.70 లక్షల కార్పస్ ఫండ్.. నెలనెలా పెన్షన్ పొందండిలా.!
- Binance Crypto Hack: ₹6,00,00,00,00,000 క్రిప్టో చోరీ.. స్పందించిన ఉత్తర కొరియా..!
2. ప్రయాణికుల చట్టపరమైన బాధ్యత కవరేజీ – ఐచ్ఛికం
కారులో ప్రయాణించే వ్యక్తులు, బైక్‌పై వెనుక కూర్చునే పిలియన్ రైడర్, అలాగే వాహన యజమాని వద్ద పనిచేసే ఉద్యోగుల కోసం ప్రత్యేక కవరేజీ అందుబాటులో ఉంటుంది. కొత్త విధానంలో ఈ కవరేజీ తప్పనిసరిగా తీసుకోవాల్సిన అవసరం లేదు. అదనపు ప్రీమియం చెల్లించి తమకు అవసరమైన వారు ఈ కవర్‌ను ఎంచుకోవచ్చు.
3. పర్సనల్ యాక్సిడెంట్ కవరేజీ
ఈ విభాగంలో వాహన యజమాని (Owner-Insured) కోసం పర్సనల్ యాక్సిడెంట్ కవరేజీ తప్పనిసరిగా ఉంటుంది. అయితే ప్రయాణికులు, బైక్‌పై వెనుక కూర్చునే వ్యక్తి, వాహన యజమాని కాకుండా ఇతరులు డ్రైవింగ్ చేసే సందర్భాల్లో వారికి ఈ కవరేజీ తీసుకోవడం ఐచ్ఛికంగా ఉంటుంది.
4. ఓన్ డ్యామేజ్ కవరేజీ – ఐచ్ఛికం
ఈ కవర్ ద్వారా సొంత వాహనానికి జరిగే నష్టాల నుంచి రక్షణ పొందవచ్చు. ప్రమాదాలు, అగ్నిప్రమాదాలు లేదా పాలసీలో పేర్కొన్న ఇతర ప్రమాదాల వల్ల కారు లేదా బైక్ దెబ్బతింటే ఈ కవరేజీ ఉపయోగపడుతుంది. కొత్త విధానంలో వాహనదారులు తమ అవసరాన్ని బట్టి ఓన్ డ్యామేజ్ కవర్‌ను ఎంచుకోవచ్చు.
ప్రతి కవర్‌కు ప్రత్యేకంగా ప్రీమియం వివరాలు
కొత్త మోటార్ ఇన్సూరెన్స్ విధానంలో మరో ముఖ్యమైన మార్పు కూడా ఉండనుంది. ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రతి కవర్‌కు సంబంధించిన ప్రీమియం వివరాలను విడివిడిగా వెల్లడించాల్సి ఉంటుంది. అంటే పాలసీలో ఏ కవరేజీ ఎంత ప్రీమియం చెల్లించాలి? దాని ద్వారా ఎలాంటి రక్షణ లభిస్తుంది? అనే వివరాలు స్పష్టంగా కనిపిస్తాయి. దీనివల్ల వినియోగదారులు తమకు అవసరమైన కవర్లను ఎంచుకోవడం, వాటి ఖర్చును పోల్చుకోవడం సులభమవుతుంది.
కస్టమర్ ఆప్షన్ ఫారమ్ తప్పనిసరి
కొత్త నిబంధనల ప్రకారం ఇన్సూరెన్స్ కంపెనీలు పాలసీ కొనుగోలు చేసే సమయంలో వినియోగదారులకు Customer Option Form అందించాల్సి ఉంటుంది. ఈ ఫారమ్‌లో కస్టమర్లు తమకు కావాల్సిన అదనపు కవరేజీ టిక్ చేసి ఎంచుకోవచ్చు. ఈ ప్రక్రియను ఆన్లైన్లో లేదా నేరుగా ఇన్సూరెన్స్ సంస్థల ద్వారా ఆఫ్‌లైన్‌లో కూడా పూర్తి చేయవచ్చు. దీంతో వినియోగదారులు తమ అవసరానికి మించిన కవర్ల కోసం అదనపు ప్రీమియం చెల్లించాల్సిన పరిస్థితి తగ్గవచ్చు.
ప్రయాణికులు, కుటుంబ సభ్యుల విషయంలో ఏం మారుతుంది?
కొత్త విధానంలో ప్రయాణికులు, బైక్‌పై వెనుక కూర్చునే వ్యక్తుల భద్రతకు ప్రత్యేక కవరేజీ ఎంచుకునే అవకాశం ఉంటుంది. వాహన యజమాని, వారి సమీప కుటుంబ సభ్యులు ఈ ప్రయాణికుల కవరేజీ పరిధిలోకి రారు. తల్లిదండ్రులు, భార్య లేదా భర్త, పిల్లలు వంటి కుటుంబ సభ్యులను ఈ విభాగం నుంచి మినహాయించినట్లు సమాచారం.
వాహనదారులకు కొత్త విధానం వల్ల ప్రయోజనమేంటి?
కొత్త 4-లేయర్ విధానం అమల్లోకి వస్తే వాహనదారులకు తమ అవసరాలకు అనుగుణంగా ఇన్సూరెన్స్ కవరేజీ ఎంచుకునే అవకాశం లభిస్తుంది. ప్రతి కవరేజీకి ప్రత్యేక ప్రీమియం వివరాలు ఉండటంతో పాలసీ ఖర్చులపై మరింత స్పష్టత వస్తుంది. అయితే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్, యజమాని పర్సనల్ యాక్సిడెంట్ కవరేజీ వంటి తప్పనిసరి అంశాలను వాహనదారులు నిర్లక్ష్యం చేయకూడదు. పాలసీ తీసుకునే ముందు అందులోని నిబంధనలు, మినహాయింపులు, కవరేజీ వివరాలను పూర్తిగా పరిశీలించడం మంచిది.
తాజావార్తలు
-
IRDAI New Motor Insurance Rules: కారు, బైక్ ఉన్నవారికి అలర్ట్.. డిసెంబర్ 15 నుంచి మోటార్ ఇన్సూరెన్స్‌లో కొత్త రూల్స్!
-
AP Elections 2026: రేపు యథావిధిగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు.. విధుల్లో 2.52 లక్షల మంది సిబ్బంది!
-
Sankranti 2027 Box Office: టాలీవుడ్ టు కోలీవుడ్.. సంక్రాంతి 2027 బరిలో రూ.1000 కోట్ల దండయాత్ర.!
-
Sandeep Reddy Vanga : ‘పనిపాట లేని ఫ్లాప్ ఆర్టిస్టులు.. ఆ పరాన్నజీవుల ఏడుపంతా సినిమాలపైనే!
-
KTR: మా ప్రభుత్వం రాగానే ఆ భూములు వెనక్కి తీసుకుంటాం..
ట్రెండింగ్
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 188 కి.మీ ప్రయాణం.. స్పోర్టీ లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ Hero VIDA VXZ..
-
హోండా తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ వచ్చేస్తోంది.. డిసెంబర్ 2న Honda ALPHA గ్లోబల్ లాంచ్..!
-
Sachin Tendulkar: నచ్చిన ఆటగాళ్లను ఎంచుకోలేకపోయా.. టీమిండియాపై సచిన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
IPL 2027-CSK: ఐపీఎల్లో సీఎస్కే భారీ ప్లాన్.. రూ.13 కోట్ల సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్‌పై కన్ను!
-
Rohit Sharma: వయసు జస్ట్ నంబర్ మాత్రమే.. రోహిత్ శర్మ డైవ్ చూస్తే ‘వావ్’ అనాల్సిందే.!