NTV Telugu Site icon

Morgan Stanley Layoff: మోర్గాన్ స్టాన్లీలో మరో రౌండ్ లేఆఫ్స్.. ఉద్యోగుల ఉద్వాసనకు ప్లాన్

Morgan Stanley

Morgan Stanley

Morgan Stanley Layoff: ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమన, ఆర్థికమాంద్యం భయాలు టెక్ కంపెనీలతో పాటు అన్ని మల్టీనేషనల్ కంపెనీలను కలవరపరుస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం లేఆఫ్స్ జాబితాలో మరో కంపెనీ చేరేందుకు సిద్ధం అవుతోంది. ప్రముఖ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ మోర్గాన్ స్టాన్లీ కూడా తన ఉద్యోగులను తొలగించే ప్లాన్ లో ఉంది.

ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా లేకపోవడం, ఒప్పందాల కొరత మధ్య ఆరు నెలల్లో రెండో రౌండ్ ఉద్యోగాల కోతకు రంగం సిద్ధం అయినట్లు తెలుస్తోంది. మోర్గాన్ స్టాన్లీ ఈ ఫైనాన్షియల్ ఇయర్ రెండో త్రైమాసికంలో దాదాపుగా 3,000 మంది ఉద్యోగులను తొలగించాలని యోచిస్తోందని వార్తా సంస్థ రాయిటర్స్ నివేదించింది. కఠినమైన ఆర్థిక పరిస్థితులే ఉద్యోగుల తొలగింపుకు కారణం అవుతున్నాయని కంపెనీ చెబుతోంది. గడిచిన త్రైమాసికంలో మోర్గాన్ స్టాన్లీ మొత్తం రాబడిలో దాదాపుగా 2 శాతం అంటే 14.5 బిలియన్ డాలర్లు తగ్గాయి.

Read Also: Rahul Gandhi defamation case: రాహుల్ గాంధీ కేసుపై గుజరాత్ హైకోర్టు కీలక ఆదేశాలు..

మార్కెట్ అనిశ్చిత, పెరిగిన ద్రవ్యోల్భణం కారణంగా ఖర్చులను అదుపు చేసేందుకు ప్రాధాన్యమిస్తున్నట్లు మోర్గాన్ స్టాన్లీ చీఫ్ షారోన్ యోషయా గత నెలలో చెప్పారు. మార్కెట్ అనిశ్చిత, వడ్డీరేట్లు వేగంగా పెరుగుతుండటంతో పెట్టుబడిదారులు మరింతగా జాగ్రత్తపడుతున్నారు. దీంతో ఒప్పందాల్లో ఒడిదొడుకులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అమెరికాలో అనేక బ్యాంకులు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో మోర్గాన్ స్టాన్లీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే దిగ్గజ ఐటీ కంపెనీలు అయిన గూగుల్, మెటా, మైక్రోెసాఫ్ట్, ట్విట్టర్, అమెజాన్ వంటివి వెేలల్లో ఉద్యోగులను తొలగించాయి. తాజాగా మోర్గాన్ స్టాన్లీ కూడా ఈ జాబితాలో చేరింది. ఈ కంపెనీ సీఈఓ జేమ్స్ గోర్మాన్ డిసెంబర్ 2022లో ఉద్యోగుల తొలగింపు ఉంటుందని చెప్పకనే చెప్పారు. గ్లోబల్ ఇన్వెస్టర్ బ్యాంక్ అయిన మోర్గాన్ స్టాన్లీలో మార్చి నాటికి 82,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ లేఆఫ్స్ వల్ల 4 శాతం ఉద్యోగులపై ప్రభావం పడనుంది.

Show comments