India Budget 2026: మధ్యతరగతి ఆశలపై నీళ్లు.. సామాన్యుడి కన్నీళ్లు తుడవని నిర్మలమ్మ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Budget 2026: ఈ రోజు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశ ఆర్థిక బడ్జెట్ 2026 ను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ సామాన్యులు, మహిళలు, రైతులు, యువతపై దృష్టి సారించిందని చెబుతున్నారు. నేడు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన మొత్తం బడ్జెట్ పరిమాణం రూ.53 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఉంది. ఈ బడ్జెట్లో సామాన్యుల కోసం అనేక ప్రధాన ప్రకటనలు చేశారు. ఏడు కొత్త రైల్వే కారిడార్లను కూడా ప్రకటించారు. తీవ్రమైన వ్యాధులకు అవసరం అయిన మందులు కూడా చౌకగా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఈ బడ్జెట్ సామాన్యులకు అవసరం అయ్యే ఇంకా అనేక ప్రధాన ప్రకటనలు చేయలేదు. నిజానికి ఆ ప్రకటనలు సామాన్యులకు గణనీయమైన ఉపశమనం కలిగిస్తాయని ఆశించారు. సామాన్యుల కోసం చేయని కొన్ని ప్రధాన ప్రకటనలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Mamata Banerjee: అంతా చెత్త.. దిశానిర్దేశం లేదు.. నిరలమ్మ బడ్జెట్‌పై మమత విమర్శలు
Also Read
- August New Rules 2026: రేపటి నుంచి కొత్త రూల్స్ అమలు.. ప్రతి ఇంటి బడ్జెట్‌పై ప్రభావం చూపే 10 మార్పులు..
- IPOకి ముందు Zeptoకి సరికొత్త షాక్.. స్విగ్గీ, జొమాటో సైలెంట్ విక్టరీ!
- Gold Loan Demand: గోల్డ్ లోన్ల జోరు.. మేలో కొత్త రికార్డు.. ఆర్బీఐ వార్నింగ్..
- ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
ఆదాయపు పన్నులో మినహాయింపు లేదు
గత బడ్జెట్లో కొత్త ఆదాయపు పన్ను విధానంలో సాధారణ పన్ను చెల్లింపుదారులకు వార్షిక ఆదాయం రూ.12 లక్షల వరకు ‘0’ పన్నును ప్రకటించారు. ఈసారి ఈ పరిమితిని రూ. 14 లక్షలకు పెంచాలని భావించారు. కానీ ప్రభుత్వం దానిలో ఎటువంటి మార్పులు చేయలేదు.
కొత్త పన్ను విధానంలో మినహాయింపులు లేవు..
PPF, NPS, ELSS వంటి పథకాలలో పెట్టుబడులకు కొత్త పన్ను విధానంలో పన్ను మినహాయింపు ఉంటుందని అందరూ భావించారు. అయితే ప్రభుత్వం దీనికి ఎటువంటి మార్పులు చేయలేదు. ఈ పథకాలు పాత పన్ను విధానంలో మాత్రమే మినహాయింపుకు అర్హులు. పాత పన్ను విధానంలో ఈ పథకాలలో పెట్టుబడులు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపుకు అర్హులు. ప్రధానమంత్రి కిసాన్ యోజన బడ్జెట్‌ను రూ.6 వేల నుంచి రూ.12 వేలకు పెంచుతారని రైతులు ఆశించారు. కానీ ఈ బడ్జెట్లో రైతుల ఆశలను నిజం చేయలేదు. పంటలకు కనీస మద్దతు ధర (MSP) గురించి కూడా ఎటువంటి ప్రధాన ప్రకటన చేయలేదు .
సీనియర్ సిటిజన్లకు దక్కని ఊరట..
ఈ బడ్జెట్ ద్వారా కొన్ని బీమా పథకాలకు మద్దతు లభిస్తుందని, సీనియర్ సిటిజన్లకు రైల్వే టిక్కెట్లపై రాయితీలు అందిస్తారని భావించారు. కానీ తాజా బడ్జెట్లో ఆర్థిక మంత్రి కొత్త రైలు కారిడార్లను మాత్రమే ప్రకటించి, సీనియర్ సిటిజన్లకు TDS తగ్గింపులో ప్రకటించలేదు. దీంతో వారి టిక్కెట్ల ధరలలో ఎటువంటి మార్పు లేదు.
స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులకు దక్కని మినహాయింపు..
ఈ బడ్జెట్లో స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులకు గణనీయమైన దెబ్బ తగిలింది. ఎఫ్ అండ్ ఓ వ్యాపారులకు లావాదేవీ ఛార్జీలు తగ్గిస్తారని అంచనాలు ఉన్నప్పటికీ వాటిని పెంచారు. అయితే దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను (LTCG), స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను (STCG) లలో ఎటువంటి మార్పులు చేయలేదు. నిజానికి తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులకు ఉపశమనం కల్పిస్తుందని అంచనా వేశారు. కానీ ఎలాంటి చేయలేదు.
తాజావార్తలు
-
Off The Record: సొంత పార్టీ నేతలకు కేతిరెడ్డి బ్యాడ్ మార్నింగ్?
-
West Indies: వ్యక్తిగత కారణాలతోనే దూరం.. క్రికెట్ వెస్టిండీస్ ప్రకటనను గుర్తుచేసిన పేసర్..
-
August New Rules 2026: రేపటి నుంచి కొత్త రూల్స్ అమలు.. ప్రతి ఇంటి బడ్జెట్‌పై ప్రభావం చూపే 10 మార్పులు..
-
Tablet Launched: 10,100mAh బ్యాటరీ, కాగితం లాంటి డిస్ప్లే.. అదిరిపోయిన ఫీచర్స్..
-
Cauvery Dispute: కావేరీ వివాదం మళ్లీ వేడెక్కింది.. సీఎం విజయ్‌తో డీకే శివకుమార్ భేటీ వాయిదా
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!