Microsoft: భారీగా ఉద్యోగుల తొలగింపుకు సిద్ధమైన మైక్రోసాఫ్ట్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Microsoft: టెక్ సంస్థల్లో ఉద్యోగుల లేఆఫ్స్ జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాతి చెందిన టెక్ సంస్థలు వేలల్లో ఉద్యోగుల్ని తొలగించాయి. ఇదిలా ఉంటే టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ భారీ ఎత్తున మరోసారి ఉద్యోగుల్ని తొలగించేందుకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది జనవరిలో 10,000 మందికి పైగా ఉద్యోగుల్ని తొలగించింది మైక్రోసాఫ్ట్. వీటికి అదనంగా మరికొంత మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి వారం నుంచే ఈ తొలగింపులు ప్రారంభించింది.
Read Also: Abdul Razak: పాకిస్థాన్ తో టీమిండియా ఆడితే ఓడిపోతుంది.. అందుకే సిరీస్ లు ఆడడం లేదు..
Also Read
- Mark Zuckerberg: జుకర్‌బర్గ్ సీక్రెట్ ప్లాన్.. AIతో ఉద్యోగాల ఊచకోత.. అసలేం జరిగింది?
- LPG e-KYCపై కీలక అప్డేట్.. లాస్ట్ డెడ్‌లైన్ ఇదే..! గ్యాస్ కనెక్షన్‌కే ఎసరు..?
- Sugar Price Fall: చక్కెర ధరలపై కేంద్రం మాస్టర్ ప్లాన్.. సామాన్యులకు గుడ్ న్యూస్..
- Egg Prices Rise: గుడ్ల ధరలకు ఇథనాల్ ఎఫెక్ట్.. అసలు కారణం ఇదే!
తాజా తొలగింపుల్లో భాగంగా యూఎస్ వాషింగ్టన్ లోని ఆఫీసులో ఉద్యోగులపై ప్రభావం పడింది. ఉద్యోగుల్లో 276 మందిని తొలగించింది. అందులో 66 మంది వర్చువల్ గా పనిచేస్తున్న వారు ఉన్నారు. వీరిలో సేల్స్, కస్టమర్ సక్సెస్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. తామంతా ఉద్యోగులు కోల్పోయామని లింక్డ్ఇన్, ఇతర సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాంల ద్వారా వెల్లడిస్తున్నారు. మాజీ మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు ఉద్యోగాల కోసం లింక్డ్ఇన్ వెబ్సైట్ ద్వారా వెతుకుతున్నారు. తమ క్లౌడ్ కంప్యూటింగ్ బిల్లులో ఖర్చులను తగ్గించుకునేందుకు లేఆఫ్స్ తీసుకువచ్చినట్లు మైక్రోసాఫ్ట్ వెల్లడించించింది. రానున్న రోజుల్లో మరింత మందిని తొలగిస్తామని సంస్థ ప్రకటించింది. అయితే ఈ సంఖ్యను మాత్రం వెల్లడించలేదు.
‘‘మా వ్యాపార నిర్వహణలో సంస్థాగత మరియు శ్రామిక శక్తి సర్దుబాట్లు తప్పనిసరి మరియు క్రమమైన భాగం. మేము మా భవిష్యత్తు కోసం మరియు మా కస్టమర్లు మరియు భాగస్వాములకు మద్దతుగా వ్యూహాత్మక వృద్ధి రంగాలకు ప్రాధాన్యత ఇవ్వడం మరియు పెట్టుబడి పెట్టడం కొనసాగిస్తాము’’ అని ఆ సంస్థ ప్రతినిధి వెల్లడించారు. ఆర్థిక పరిస్థితులు, మారుతున్న కస్టమర్ల ప్రాధాన్యతల దృష్ట్యా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు గతంలో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ప్రకటించారు. మైక్రోసాఫ్ట్ గత కొన్ని నెలలుగా Xbox, HoloLens, LinkedIn మరికొన్ని విభాగాల్లో ఉద్యోగులను తొలగించుకుంటూ వస్తోంది. AI టెక్నాలజీ ముఖ్యంగా బింగ్ చాట్ లో ఎక్కువ పెట్టుబడులు పెడుతోంది. ఒక్క మైక్రోసాఫ్ట్ మాత్రమే కాదు మెటా, గూగుల్, ట్విట్టర్, అమెజాన్ వంటి సంస్థలు వేలల్లో ఉద్యోగులను తొలగించాయి. లేఆఫ్ ట్రాకర్ Layoff.fyi ప్రకారం, 839 టెక్ కంపెనీలు 2023లో మొత్తం 2,16,328 మంది ఉద్యోగులను తొలగించాయి.
తాజావార్తలు
-
Yash Toxic: యష్‌కు బిగ్ షాక్.. ‘టాక్సిక్’ తగ్గితేనే బెటర్!
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!
-
Producer Deepti: హీరోయిన్‌పై నిర్మాత సంచలన ఆరోపణలు.. ‘పేమెంట్ ఇవ్వను.. ఆ డబ్బు హార్ట్ ఆపరేషన్లకు విరాళంగా ఇస్తా’
-
King 100 : సంక్రాంతి కంటే ముందే విడుదలకి రెడీ అవుతున్న ‘కింగ్ 100’
ట్రెండింగ్
-
10.1 అంగుళాల టచ్‌స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్‌తో Suzuki e-Sky లాంచ్..!
-
8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
165Hz డిస్ప్లే, 24GB RAM, 7,470mAh బ్యాటరీతో Lenovo Legion Tab Y700 AI టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే?
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?