Lenskart Investorsకు గుడ్ న్యూస్.. షేర్లో 40% అప్‌సైడ్ ఉందంటున్న నోమురా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lenskart Investors: స్టాక్ మార్కెట్లో లెన్స్‌కార్ట్ షేర్లు ప్రస్తుతం ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఒకప్పుడు మార్కెట్లో కొత్త సంస్థగా అడుగుపెట్టిన లెన్స్‌కార్ట్.. ఇప్పుడు ఐవేర్ రిటైల్ రంగంలో కీలక ప్లేయర్‌గా ఎదిగింది. ఈ నేపథ్యంలో గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ నోమురా లెన్స్‌కార్ట్ షేరుపై బుల్లిష్‌గా ఉంది. కంపెనీపై కవరేజ్ ప్రారంభించిన నోమురా.. ‘బై’ రేటింగ్ ఇచ్చింది. అలాగే ఒక్కో షేరుకు రూ.888 టార్గెట్ ప్రైస్‌ను నిర్ణయించింది. ఈ లక్ష్యాన్ని చేరితే.. గత ముగింపు ధరతో పోలిస్తే ఇన్వెస్టర్లకు దాదాపు 40 శాతం వరకు లాభం వచ్చే అవకాశం ఉందని పేర్కొంది.
2010లో తన కార్యకలాపాలు ప్రారంభించిన లెన్స్‌కార్ట్.. ప్రస్తుతం వేగంగా విస్తరిస్తోంది. నోమురా అంచనాల ప్రకారం 2026 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి కంపెనీ స్టోర్ల సంఖ్య సుమారు 2,700కు చేరనుంది. అయితే లాంగ్ రన్లో మరింత భారీ విస్తరణకు సంస్థ ప్రణాళికలు సిద్ధం చేసుకుందని సమాచారం. వచ్చే 15 ఏళ్లలో దేశవ్యాప్తంగా సుమారు 10,000 స్టోర్లను ఏర్పాటు చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. భారత్‌లో ఐవేర్ మార్కెట్లో లెన్స్‌కార్ట్ విస్తరణకు భారీ అవకాశాలు ఉన్నాయని నోమురా పేర్కొంది. ప్రస్తుతం కంపెనీ దేశీయ ఐవేర్ మార్కెట్లో సుమారు 5 శాతం వాటాతో ముందంజలో ఉందని.. రెండో స్థానంలో ఉన్న కంపెనీ కంటే ఇది దాదాపు రెట్టింపు వాటా అని తెలిపింది. ఇదే సమయంలో లెన్స్‌కార్ట్ బిజినెస్ మోడల్‌ను కూడా నోమురా ప్రశంసించింది. సెంట్రలైజ్డ్ మాన్యుఫ్యాక్చరింగ్ నుంచి కస్టమర్లకు ఉత్పత్తులను చేరవేసే వరకు కంపెనీ తన కార్యకలాపాలను సమగ్రంగా నిర్వహిస్తోందని కొనియాడింది. టెక్నాలజీ, డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను విస్తృతంగా ఉపయోగిస్తోందని ప్రశంసించింది.
Also Read
- Explainer: TVS ఫ్యామిలీ గొడవేంటి?
- World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
- Essential Commodity Prices: వంటింట్లో మంటలు.. 42 వస్తువుల్లో 41 ధరలు పెరుగుదల..! నిత్యావసరాల తాజా లెక్కలివే
- UPI MDR Charges: వ్యాపారులకు బిగ్ రిలీఫ్.. రూ.2,000 దాటితే పడే ఛార్జీలపై బ్రేక్..
ఈ ఎండ్-టు-ఎండ్ వర్టికల్ ఇంటిగ్రేషన్ కారణంగా పరిశ్రమ సగటుతో పోలిస్తే లెన్స్‌కార్ట్ నిర్వహణ ఖర్చులు 35-40 శాతం వరకు తక్కువగా ఉండే అవకాశం ఉందని నోమురా అంచనా వేసింది. దీంతో కంపెనీ స్కేల్ పెరిగే కొద్దీ లాభదాయకత మరింత మెరుగుపడే అవకాశం ఉందని పేర్కొంది. లెన్స్‌కార్ట్‌కు సంబంధించి మరో కీలక పరిణామం కూడా ఇన్వెస్టర్లలో ఆసక్తిని పెంచుతోంది. నువామా ఆల్టర్నేటివ్ అండ్ క్వాంటిటేటివ్ రీసెర్చ్ నివేదిక ప్రకారం.. లెన్స్‌కార్ట్ షేర్లకు త్వరలో MSCI ఇండెక్స్‌లో చోటు లభించే అవకాశం ఉంది. అదే జరిగితే కంపెనీలోకి సుమారు 352 మిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇటీవల లెన్స్‌కార్ట్‌లో జరిగిన బ్లాక్ డీల్ కూడా మార్కెట్లో చర్చనీయాంశమైంది. ఆల్ఫా వేవ్ వెంచర్స్ పలు లావాదేవీల ద్వారా ఒక్కో షేరును రూ.630 ధరకు విక్రయించినట్లు సమాచారం. ఈ డీల్‌లో గోల్డ్‌మన్ సాక్స్, మోర్గాన్ స్టాన్లీ, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్, కోటక్ మహీంద్రా, బజాజ్ లైఫ్ ఇన్సూరెన్స్, ఎన్పీఎస్ ట్రస్ట్ వంటి ప్రముఖ సంస్థలు కొనుగోలుదారులుగా ఉన్నట్లు తెలుస్తోంది.
లెన్స్‌కార్ట్ సొల్యూషన్స్ 2025 నవంబర్‌లో స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయింది. ఐపీఓ ద్వారా ఫ్రెష్ ఇష్యూ, ఆఫర్ ఫర్ సేల్ కలిపి కంపెనీ రూ.7,278 కోట్లు సమీకరించింది. ఎన్ఎస్ఈలో రూ.402 ఇష్యూ ధరకు బదులుగా రూ.395 వద్ద లిస్టయిన షేర్.. బీఎస్ఈలో రూ.390 వద్ద ప్రారంభమైంది. అయితే డిస్కౌంట్‌తో లిస్టింగ్ అయినప్పటికీ ఆ తర్వాత షేర్ మంచి పనితీరు కనబరిచింది. గత నెలలోనే సుమారు 16 శాతం పెరిగినట్లు సమాచారం. 2026లో ఇప్పటివరకు దాదాపు 46 శాతం రాబడిని అందించినట్లు మార్కెట్ గణాంకాలు సూచిస్తున్నాయి. అయితే బ్రోకరేజ్ టార్గెట్ ప్రైస్ హామీ కాదని, షేర్ మార్కెట్లో పెట్టుబడులకు మార్కెట్ పరిస్థితులు, కంపెనీ పనితీరు, రిస్క్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Dr. B.R. Ambedkar: మరణానికి 53 రోజుల ముందు హిందుత్వాన్ని విడిచిన అంబేడ్కర్.. అసలు బౌద్ధమతాన్నే ఎందుకు స్వీకరించారు?
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Hyderabad: ఉప్పల్‌లో మ్యాచ్‌కు ముందు సంచలనం.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు అరెస్ట్..!
-
21st Century Best Bowler: 21వ శతాబ్దపు టాప్-10 బౌలర్లు.. టాప్ లేపిన ఆసీస్ దిగ్గజం.. బుమ్రా స్థానం ఎక్కడో తెలుసా?
ట్రెండింగ్
-
Sound Glow ఫీచర్‌తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!