MS Dhoni: ఇన్వెస్టర్లకు అదిరే న్యూస్.. ధోని మద్దతిస్తున్న కంపెనీ ఐపీఓకు రెడీ.. రూ.1500 కోట్లే లక్ష్యంగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు ఒక అదిరిపోయే వార్త. ప్రముఖ ఆడియో అండ్ వీడియో కంటెంట్ ప్లాట్‌ఫామ్ ‘కుకు ఎఫ్ఎమ్’, ‘కుకు టీవీ’ల మాతృసంస్థ అయిన బెంగళూరుకు చెందిన స్టార్టప్ ‘కుకు టెక్నాలజీస్’ పబ్లిక్ ఇష్యూ (IPO)కు వచ్చేందుకు సిద్ధమైంది. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పెట్టుబడులు పెట్టిన ఈ డిజిటల్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ, తాజాగా మార్కెట్ నియంత్రణ సంస్థ ‘సెబీ’ దగ్గర రహస్యంగా ఐపీఓ పత్రాలను దాఖలు చేసింది.
భారీగా నిధుల సమీకరణే లక్ష్యం..
ఈ ఐపీఓ ద్వారా కుకు టెక్నాలజీస్ సుమారు రూ. 2,500 కోట్ల నుంచి రూ. 3,500 కోట్ల వరకు నిధులను సమీకరించాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో కొత్త షేర్ల జారీతో పాటు ప్రస్తుత ఇన్వెస్టర్ల షేర్ల విక్రయం (OFS) కూడా ఉండనుంది. ఈ ఐపీఓ ద్వారా కంపెనీ తన మార్కెట్ విలువను ఏకంగా రూ. 15,000 కోట్లుగా లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పబ్లిక్ ఇష్యూ కోసం కోటక్, జెఫరీస్, జేఎం ఫైనాన్షియల్, యాక్సిస్ క్యాపిటల్ వంటి ప్రముఖ సంస్థలను బ్యాంకర్లుగా ఎంపిక చేసుకుంది.
Also Read
- Forbes Billionaires List: 4 గదుల ఫ్లాట్ నుంచి 92.8 బిలియన్ డాలర్ల సామ్రాజ్యం వరకు..! అంబానీని దాటేసిన టిక్‌టాక్ సృష్టికర్త..
- E85 Fuel: E85 ఇంధనంపై కేంద్రం కీలక ప్రకటన.. భారీగా తగ్గనున్న పెట్రో ధరలు..!?
- LPG Users Alert: ఎల్పీజీ వినియోగదారులకు షాక్.. మారిన గ్యాస్ నిబంధనలు..
- Foreign Investors: విదేశీ పెట్టుబడిదారులకు శుభవార్త.. పన్ను నిబంధనల సడలింపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!
లాభాల బాటలో దూసుకుపోతున్న కంపెనీ..
ప్రస్తుతం మొబైల్ వినియోగదారులలో ఒకటి లేదా రెండు నిమిషాల నిడివి గల ‘మైక్రో డ్రామాలు’ విపరీతమైన ప్రజాదరణ పొందుతున్నాయి. దీనిని కుకు సంస్థ చక్కగా ఉపయోగించుకుంది. ఆర్థిక సంవత్సరం 2025లోరూ. 240 కోట్ల ఆదాయం ఆర్జించిన ఈ కంపెనీ, ఆర్థిక సంవత్సరం 2026 నాటికి దాదాపు ఏడు రెట్లు వృద్ధి చెంది రూ. 1,400 కోట్ల ఆదాయాన్ని సాధించి సంచలనం సృష్టించింది. గతంలో ప్రకటనల ఖర్చుల వల్ల నష్టాల్లో ఉన్నప్పటికీ, ప్రస్తుతం కంపెనీ బ్రేక్-ఈవెన్ స్థాయికి చేరువైంది.
ధోనితో పాటు ప్రముఖుల మద్దతు..
లాల్ చంద్ బిసు, వికాస్ గోయల్, వినోద్ మీనన్‌లు 2018లో స్థాపించిన ఈ స్టార్టప్‌లో గ్రాండ్ ఆసియా, ఫండమెంటం, ఇండియా కోషంట్ వంటి దిగ్గజ ఇన్వెస్టర్లతో పాటు ఎంఎస్ ధోని కూడా పెట్టుబడులు పెట్టారు. ప్రస్తుతం కుకు యాప్స్‌కు 40 కోట్లకు పైగా డౌన్లోడ్లు, 1 కోటికి పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతతో కంటెంట్ ఖర్చులను తగ్గిస్తూ, అమెరికా వంటి అంతర్జాతీయ మార్కెట్లలోకి కూడా అడుగుపెట్టేందుకు సంస్థ సిద్ధమవుతోంది. కొత్త తరం టెక్నాలజీ కంపెనీల ఐపీఓల వైపు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్న తరుణంలో వస్తున్న ఈ ఐపీఓ మార్కెట్లో హాట్ టాపిక్‌గా మారింది.
తాజావార్తలు
-
MS Dhoni: ఇన్వెస్టర్లకు అదిరే న్యూస్.. ధోని మద్దతిస్తున్న కంపెనీ ఐపీఓకు రెడీ.. రూ.1500 కోట్లే లక్ష్యంగా..
-
Delimitation Bill: మళ్లీ తెరపైకి డీలిమిటేషన్ బిల్లు.. 2029 ఎన్నికలే లక్ష్యంగా కేంద్రం కసరత్తు?
-
AP NDA: కూటమి భారీ ప్లాన్.. రెండేళ్ల పాలన ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ
-
Vaibhav Brand Value: ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీ బ్రాండ్ వాల్యూ షురూ.. ఏడాదికి 2 కోట్లు..
-
Mamata Banerjee: నా సీటు నుంచి పోటీ చేయండి.. మమతా బెనర్జీకి బంపర్ ఆఫర్..
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!