NTV Telugu Site icon

IRCTC Fund raising: ప్రయాణికుల డేటాతో వెయ్యి కోట్లు.. ఐఆర్‌సీటీసీ ఫండ్‌ రైజింగ్‌ ప్లాన్‌.

Irctc Fund Raising

Irctc Fund Raising

IRCTC Fund raising: ఇండియన్‌ రైల్వేస్‌కి టికెట్‌ బుకింగ్‌ సర్వీస్‌ అందిస్తున్న ఐఆర్‌సీటీసీ.. ప్రయాణికుల సమాచారంతో వెయ్యి కోట్లు ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు కన్సల్టెంట్‌ని ఎంపిక చేసేందుకు టెండర్లు ఆహ్వానించింది. ప్రభుత్వ మరియు ప్రైవేట్‌ కంపెనీలతో నిర్వహించే బిజినెస్‌ కార్యకలాపాల్లో భాగంగా ఈ ప్యాసింజర్‌ డేటాని ఇచ్చిపుచ్చుకోనుంది. అయితే ఈ ప్రక్రియలో కన్జ్యూమర్ల వ్యక్తిగత సమాచార గోప్యతకు ఎలాంటి భంగం వాటిల్లకూడదంటూ షరతు పెట్టింది.

‘విండ్‌ఫాల్‌’లో కోత

కేంద్ర ప్రభుత్వం విండ్‌ఫాల్‌ ప్రాఫిట్‌ ట్యాక్స్‌లో కోత పెట్టింది. దేశీయంగా ఉత్పత్తి చేసే క్రూడాయిల్‌పై ఇప్పటివరకు విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ను టన్నుకు 17 వేల 750 రూపాయలు వసూలు చేస్తుండగా దాన్ని 13 వేల రూపాయలకు తగ్గించింది. ఇది ఈ రోజు నుంచే అమల్లోకి వస్తుందని వెల్లడించింది. ఈ నిర్ణయం ఓఎన్‌జీసీ మరియు వేదాంత లిమిటెడ్‌లకు ఊరట కలిగిస్తుందని భావిస్తున్నారు.

Indian Employees: బాస్‌లు అలెర్ట్.. ఉద్యోగులు ఎప్పుడైనా షాక్‌ ఇవ్వొచ్చు…! తాజా సర్వే

నెట్‌ సెల్లర్‌గా ఆర్బీఐ

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా జూన్‌ నెలలో యూఎస్‌ కరెన్సీ నెట్‌ సెల్లర్‌గా నిలిచింది. స్పాట్‌ మార్కెట్‌లో 18 పాయింట్‌ తొమ్మిదీ ఆరు బిలియన్‌ యూఎస్‌ డాలర్లను కొనుగోలు చేసిన ఆర్బీఐ.. అంతకన్నా ఎక్కువగా మూడూ పాయింట్‌ ఏడూ ఒకటీ తొమ్మిది బిలియన్‌ డాలర్లను విక్రయించింది. ఈ మేరకు కేంద్ర బ్యాంకు ఆగస్టు బులెటిన్‌ని విడుదల చేసింది. గతేడాది జూన్‌లో ఆర్బీఐ.. యూఎస్‌ కరెన్సీ నెట్‌ బయ్యర్‌గా వ్యవహరించగా ఈసారి నెట్‌ సెల్లర్‌గా నిలిచింది.

3 వారాల కనిష్టానికి

అమెరికాలో మళ్లీ వడ్డీ రేట్లు పెరిగే అవకాశంతోపాటు డాలర్‌ బలపడుతుండటంతో బంగారం ధరలు ఇవాళ మూడు వారాల కనిష్టానికి పడిపోయాయి. ఔన్స్‌ బరువు కలిగిన స్పాట్‌ గోల్డ్‌ రేటు సున్నా పాయింట్‌ 2 శాతం తగ్గింది. దీంతో ఒక ఔన్స్‌ పసిడి ధర 17 వందల 54 రూపాయలకు పైగా పలుకుతోంది. జులై 29వ తేదీ తర్వాత ఇదే అతి తక్కువ రేటని మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. ఈ వారం మొత్తమ్మీద బంగారం ధర రెండూ పాయింట్‌ 6 శాతం తగ్గింది.

ఐసీటీ బడ్జెట్‌ పెంపు

మన దేశంలో 50 శాతానికి పైగా ఎంటర్‌ప్రైజ్‌లు ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ టెక్నాలజీ బడ్జెట్లను గణనీయంగా పెంచాయి. సైబర్‌ సెక్యూరిటీ అనేది కంపెనీలకు కీలకాంశంగా మారిందని, దీనికోసం గతేడాది కన్నా ఈసారి ఎక్కువ ఖర్చుపెడుతున్నట్లు డేటా అండ్‌ అనలిటిక్స్‌ కంపెనీ తన రిపోర్ట్‌లో వెల్లడించింది. కొవిడ్‌ అనంతరం దేశవ్యాప్తంగా డిజిటల్‌ టెక్నాలజీల వినియోగం పెరగటమే దీనికి కారణమని పేర్కొంది.

బీఎస్‌ఈ రికార్డ్‌

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్లు సరికొత్త రికార్డును నెలకొల్పాయి. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో నమోదైన కంపెనీల మొత్తం పెట్టుబడులు 280 లక్షల కోట్లకు పైగా చేరాయి. నిన్న ట్రేడింగ్‌ పూర్తయ్యే సమయానికి నమోదైన ఈ ఇన్వెస్ట్‌మెంట్లు ఆల్‌టైమ్‌ రికార్డు కావటం విశేషం. కొన్ని రోజులుగా బుల్‌ ర్యాలీ కొనసాగుతుండటం ఈ ఫీట్‌ సాధించటానికి దోహపడింది.

Show comments