NTV Telugu Site icon

Ministry of Consumer Affairs: రూపాయికే ఐఫోన్! .. ప్రభుత్వం సీరియస్

Iphone

Iphone

భారత్‌లో త్వరలో పండుగల సీజన్‌ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఈ-కామర్స్ కంపెనీలు తమ సన్నాహాలు ప్రారంభించాయి. ఇందులో తమ సేల్‌ను ప్రకటించిన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి పేర్లు కూడా ఉన్నాయి. అనేక ఆకర్షణీయమైన ఆఫర్ల ప్రకటనలు కూడా ఈ విక్రయాల్లో కనిపిస్తున్నాయి. ఎక్కడో ఒక చోట ఒక్క రూపాయికే ఐఫోన్ ఇస్తానని, మరి కొన్ని చోట్ల తక్కువ ధరకే ఇతర ఖరీదైన వస్తువులపై ఆఫర్‌ను అందిస్తున్నారు.

READ MORE: Vivo V40e Price: ఏఐ ఫీచర్లతో వివో వి40ఈ.. 50 ఎంపీ సెల్ఫీ కెమెరా, 5500 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ!

ఇలాంటి ప్రకటనలను చూసి, వినియోగదారులు పెద్ద సంఖ్యలో ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లకు లాగిన్ చేస్తారు. అదే సమయంలో.. చాలా మంది వినియోగదారులు ఇలాంటి ప్రకటనలను తప్పుదారి పట్టించేలా పేర్కొంటూ సోషల్ మీడియాలో ఫిర్యాదులు కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఈ-కామర్స్‌పై వస్తున్న ప్రకటనలపై ప్రభుత్వం కూడా ఓ కన్నేసి ఉంచింది.

READ MORE:Assistance to Flood Victims: వరద బాధితులకు ప్రభుత్వ సాయం.. వివరాలు ఇవే..

ఈ విషయంపై ఓ జాతీయ మీడియా సంస్థ అడిగిన ప్రశ్నకు కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి నిధి ఖరే స్పందిస్తూ.. “మాకు అలాంటి ఫిర్యాదులు అందాయి. ఇ-కామర్స్ కంపెనీలు నమ్మశక్యం కాని వాదనలు చేస్తున్నాయి. కస్టమర్‌లు ఆర్డర్ చేసినప్పుడు.. డెలివరీ ఛార్జీలు కూడా తప్పుగా జోస్తున్నారు. డిస్కౌంట్ అకస్మాత్తుగా ముగిసిందని వినియోగదారులకు చెబుతున్నారు. ఈ ఫిర్యాదులపై నిఘా ఉంచి చర్యలు తీసుకుంటాం. కస్టమర్లు ఇలా ఫిర్యాదు చేయవచ్చు.” అని పేర్కొన్నారు. ఈ-కామర్స్ సైట్‌లలో కస్టమర్‌లు ఇలాంటి తప్పుదోవ పట్టించే ప్రకటనలను చూసినట్లయితే.. వారు తమ ఫిర్యాదును కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ యొక్క ఫిర్యాదు పోర్టల్‌లో నమోదు చేయవచ్చని మంత్రిత్వ శాఖ కార్యదర్శి నిధి తెలిపారు. ప్రస్తుతం చాలా మంది ఫిర్యాదులు చేస్తున్నారు.

READ MORE: Dana Kishore: మూసీ పరిధిలోని నిర్వాసితులు అనవసరమైన అపోహలకు లోను కావొద్దు..

రూ.1కే ఐఫోన్‌
ఇ-కామర్స్ వెబ్‌సైట్ ఐఫోన్‌ను రూ. 1కి విక్రయిస్తానని ఎలా హామీ ఇస్తోందని సోషల్ మీడియాలో కొందరు ఫిర్యాదు చేశారు. అయితే వారు బుక్ చేసుకునే సమయానికి, ఉత్పత్తి అమ్ముడైందని ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు.