Dana Kishore: మూసీ నది సుందరీకరణలో భాగంగా మూసీ రివర్ బెడ్లోని ప్రవేటు వ్యక్తులకు సంబంధించిన దాదాపు 1600 నిర్మాణాలు సర్వే ద్వారా గుర్తించామని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ దానకిశోర్ తెలిపారు. ఈ నిర్మాణాలను తొలగించడానికి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఒక కార్యాచరణను రూపకల్పన చేసినట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క నిర్వాసితులకు డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేసి పునరావసం కల్పిస్తామన్నారు. దాదాపు 15 వేల డబుల్ బెడ్ రూం ఇళ్లను మూసీ రివర్ బెడ్, బఫర్ జోన్ లో నివసిస్తున్న కుటుంబాల పునరావాసానికై రాష్ట్ర ప్రభుత్వం కేటాయింపులు చేసిందని తెలిపారు. అలాగే, రివర్ బెడ్లో ఉన్న నిర్మాణాలకు సంబంధించి పునరావాస కార్యాచరణకై సంబంధిత జిల్లా కలెక్టర్లకు మార్గదర్శకాలు రూపొందించుకోవాలని మూసీ రివర్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ దాన కిషోర్ ఆదేశాలు జారీ చేశారు.
Read Also: Allu Arjun : ఆర్మీ రెడీగా ఉండండి.. కాకినాడకు బన్నీ వస్తున్నాడు..
అలాగే, డబుల్ బెడ్రూం ఇళ్లను కేటాయించి పునరావసం కల్పించిన తర్వాతనే ఈ నిర్మాణాల తొలగింపు కార్యక్రమం ప్రారంభమవుతోంది అని దాన కిషోర్ ప్రకటించారు. బఫర్ జోన్కు సంబంధించి భూ సేకరణ, పునరావాస చట్టం ప్రకారం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం.. ప్రభుత్వ అనుమతి తర్వాత చట్ట ప్రకారం నష్ట పరిహారం ఇచ్చిన తర్వాత మాత్రమే భూసేకరణ కార్యక్రమం ప్రారంభిస్తామన్నారు. మూసీ నది పరిధిలోని నిర్వాసితులు అనవసరమైన అపోహలకు లోను కావొద్దని.. అర్హులందరికీ పునరావాసం కల్పించడం జరుగుతుంది అని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ దానకిశోర్ వెల్లడించారు.