Stock Markets: స్టాక్ మార్కెట్లు గురువారం భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ 555.95 పాయింట్లు తగ్గి 81,159.68 వద్ద ముగిసింది. నిఫ్టీ 166 పాయింట్లు తగ్గి 24,890.85 వద్ద ముగిసింది. నిఫ్టీ బ్యాంక్ 145 పాయింట్లు పడిపోయింది. బీఎస్ఇ స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 400 పాయింట్లు, బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 330 పాయింట్లు పడిపోయాయి. బీఎస్‌ఈలోని టాప్ 30 స్టాక్‌లలో టాటా ట్రెంట్, పవర్‌గ్రిడ్, టాటా మోటార్స్ అతిపెద్ద క్షీణతలను చవిచూశాయి. లోహాలలో స్వల్ప లాభం మినహా, మిగతా అన్ని రంగాలు భారీగా నష్టాన్ని చవిచూశాయి. ఐటీ, రియల్ ఎస్టేట్, ఫైనాన్షియల్ బ్యాంకింగ్ రంగాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి. ఈ మూడు రంగాలు 1 శాతం కంటే ఎక్కువ నష్టపోయాయి. అలాగే ఫార్మాస్యూటికల్, ఆటో రంగాలు సైతం గణనీయమైన నష్టాలను చవిచూశాయి. సెప్టెంబర్ 24న ₹461.34 లక్షల కోట్లుగా ఉన్న బీఎస్‌ఈ మార్కెట్ క్యాప్ నేడు ₹457.35 లక్షల కోట్లకు పడిపోయింది. అంటే పెట్టుబడిదారులు ఒకే రోజులో దాదాపు ₹4 లక్షల కోట్లు కోల్పోయారు. ఏ కారణాల వల్ల స్టాక్ మార్కెట్లు ఇంతలా పతనమయ్యాయో నిపుణులు అభిప్రాయం ప్రకారం తెలుసుకుందాం..
READ MORE: BJP Leader: రైలు కింద పడి బిజెపి మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు ఆత్మహత్య.. కారణం ఏంటంటే?
మార్కెట్ అకస్మాత్తుగా పడిపోవడానికి 5 కారణాలు..?
గమనిక: స్టాక్ మార్కెట్లో ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు.. ఖచ్చితంగా ఆర్థిక సలహాదారుడి సహాయం తీసుకోండి.