Site icon NTV Telugu

Stock Market: ఒక్కరోజులోనే ఆశలు ఆవిరి.. భారీ నష్టాల్లో సూచీలు

Stockmarket

Stockmarket

దేశీయ స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో కొనసాగుతోంది. ఒక్కరోజు లాభాలు కొన్ని గంటల్లోనే ఆవిరైపోయింది. త్వరలోనే పశ్చిమాసియా యుద్ధం ముగుస్తుందని ట్రంప్ ప్రకటన మంగళవారం మార్కెట్‌కు బాగా కలిసొచ్చింది. దీంతో భారీ లాభాలు అర్జించింది. ఈరోజు కూడా అదే జోష్ కొనసాగుతుందని నిపుణులు భావించారు. కానీ చమురు ధరలు మళ్లీ పెరగొచ్చన్న సంకేతాలతో బుధవారం మళ్లీ నష్టాల్లోకి జారుకుంది. ప్రస్తుతం సెన్సెక్స్ 390 పాయింట్లు నష్టపోయి 77, 815 దగ్గర కొనసాగుతుండగా.. నిఫ్టీ 107 పాయింట్లు నష్టపోయి 24, 153 దగ్గర కొనసాగుతోంది.

నిఫ్టీలో టెక్ మహీంద్రా, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, జియో ఫైనాన్షియల్, కోల్ ఇండియా ప్రధాన లాభాలను ఆర్జించగా… కోటక్ మహీంద్రా బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, అపోలో హాస్పిటల్స్, ఐసీఐసీఐ బ్యాంక్ నష్టపోయాయి.

మధ్యప్రాచ్యంలో యుద్ధం రోజురోజుకు తీవ్ర రూపం దాల్చుతోంది. తాజాగా ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు చేసింది. ఇంకోవైపు లెబనాన్‌పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. ప్రతీకారంగా ఇరాన్ కూడా దాడులు చేస్తోంది. దీంతో పశ్చిమాసియాలో అవే ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. దీంతో చమురు, గ్యాస్ కొరతతో ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి.

ఇది కూడా చదవండి: Jaishankar: ఇరాన్ మంత్రి అబ్బాస్ అరఘ్చికి జైశంకర్ ఫోన్.. ఏం సంభాషించారంటే..!

Exit mobile version