Stock Market Crash: దలాల్ స్ట్రీట్‌లో రక్తపాతం.. ఒక్క దెబ్బతో రూ.6 లక్షల కోట్లు ఆవిరి.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stock Market Crash: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం ఇన్వెస్టర్లకు కోలుకోలేని షాక్ ఇచ్చాయి. ఉదయం సాదాసీదాగా మొదలైన ట్రేడింగ్, సమయం గడిచేకొద్దీ అమ్మకాల సునామీలో చిక్కుకుంది. మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి సూచీలు భారీగా కుప్పకూలడంతో మదుపర్ల సంపద కరిగిపోయింది. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే ఇన్వెస్టర్లు ఏకంగా రూ.6 లక్షల కోట్ల భారీ నష్టాన్ని చవిచూశారు. మంగళవారం ముగింపుతో పోలిస్తే బుధవారం ఉదయం మార్కెట్లు కొంత బలహీనంగానే ఆరంభమయ్యాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) సెన్సెక్స్ తన మునుపటి ముగింపు స్థాయి 82,532 పాయింట్ల నుంచి తగ్గి 82,376 వద్ద ట్రేడింగ్ మొదలుపెట్టింది. ఆరంభంలో కనిపించిన ఈ నెమ్మదితనం, ఆ తర్వాత ఊహించని రీతిలో తీవ్ర పతనంగా మారింది. మధ్యాహ్నం సమయానికి సెన్సెక్స్ 600 పాయింట్లకు పైగా నష్టపోయి 81,780 స్థాయికి దిగజారింది.
మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) నిఫ్టీ కూడా అదే బాటలో పయనించింది. మంగళవారం 25,387 వద్ద ముగిసిన నిఫ్టీ, బుధవారం 25,323 వద్ద స్వల్ప నష్టంతో ప్రారంభమైంది. ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడి పెరగడంతో ఒక్కసారిగా 200 పాయింట్లకు పైగా పతనమై 25,141 మార్క్ వద్దకు చేరుకుంది. మార్కెట్లో నెలకొన్న ఈ ఆకస్మిక కుదుపు సామాన్య, సంస్థాగత మదుపర్లకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. గత ట్రేడింగ్ సెషన్ ముగిసే సమయానికి బీఎస్ఈలో నమోదైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5,11,71,121.57 కోట్లుగా ఉండగా, బుధవారం మధ్యాహ్నానికి అది రూ.5,05,71,089.33 కోట్లకు పడిపోయింది. అంటే ఒక్కరోజులోనే ఇన్వెస్టర్ల ఖాతాల్లోంచి దాదాపు రూ.6,00,032 కోట్లు ఆవిరయ్యాయి.
Also Read
- India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
- Gold and Silver Price Crash: మళ్లీ కుప్పకూలిన బంగారం, వెండి ధరలు.. వెండి రూ.6 వేలు, బంగారం రూ.3 వేలు పతనం..!
- Jimmy Tata: టాటా గ్రూప్‌లో భారీ కుదుపు..! అసలేం జరుగుతోంది?
- Gold Theft Protection: దొంగలు పడినా నో టెన్షన్.. మీ బంగారు నగలకు పూర్తి రక్షణ ఇచ్చే సూపర్ పాలసీ ఇదే!
మార్కెట్ పతనంలో దిగ్గజ కంపెనీల షేర్లు సైతం కుదేలయ్యాయి. లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్ విభాగాల్లో పలు కీలక స్టాక్స్ నష్టాల్లో కూరుకుపోయాయి. లార్జ్‌క్యాప్‌లో టైటాన్ అత్యధికంగా 4.10% మేర నష్టపోగా, బజాజ్ ఫైనాన్స్ (2.30%), ఎటర్నల్ (2.25%), ఐటీ దిగ్గజం టీసీఎస్ (2.20%) షేర్లు డీలా పడ్డాయి. మిడ్‌క్యాప్‌లో నేషనల్ అల్యూమినియం 4.60% పతనమైంది. వీటితో పాటు డిక్సన్ టెక్నాలజీస్ (3.40%), కేఈఐ ఇండస్ట్రీస్ (3.10%), ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (2.50%), ఎంఫాసిస్ (2.40%) షేర్లు సైతం అమ్మకాల ఒత్తిడికి గురై నష్టాల్లో ట్రేడవుతున్నాయి. మొత్తానికి బుధవారం ట్రేడింగ్ సెషన్లో బేరిష్ పూర్తి ఆధిపత్యం చెలాయించడంతో దలాల్ స్ట్రీట్‌లో ఆందోళనకర వాతావరణం నెలకొంది.
తాజావార్తలు
-
Stock Market Crash: దలాల్ స్ట్రీట్‌లో రక్తపాతం.. ఒక్క దెబ్బతో రూ.6 లక్షల కోట్లు ఆవిరి.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ!
-
Suriya : విలన్ నటనకు ఫిదా.. రూ. 9 లక్షల వాచ్ గిఫ్ట్ ఇచ్చిన సూర్య
-
Delhi Police: రీల్స్ చేసే వారు జర్నలిస్టులు కాదు.. సుప్రీంకు ఢిల్లీ పోలీసుల నివేదిక!
-
Cyclone Akvan: నెమ్మదిగా కదులుతున్న “అక్వాన్ తుఫాన్”.. మరింత డేంజర్ అంటున్న సైంటిస్టులు.!
-
Vikalp Tiwari: టీ20ల్లో మరో యువ సంచలనం.. రెండో భారత బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..