NTV Telugu Site icon

ICICI: వినియోగదారులకు న్యూస్ చెప్పిన ఐసీఐసీఐ బ్యాంక్.. ఇక నుంచి భారీగా వడ్డీ రేట్లు

Icici Bank

Icici Bank

ఈ మధ్య బ్యాంకులు కొత్త నిబంధనలను తీసుకొస్తున్నాయి. ఇప్పటికే ఎస్బీఐ బ్యాంక్ ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులపై రివార్డ్ పాయింట్స్ ని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ క్రెడిట్ కార్డుల ద్వారా ప్రభుత్వ లావాదేవీలు జరిపితే రివార్డ్ పాయింట్స్ వర్తించవని యూజర్స్ కి షాకింగ్ న్యూస్ చెప్పింది. ఈ కొత్త నిబంధన జూలై 15 నుంచి అమలులోకి రానుంది. ఇక ఐసీఐసీఐ బ్యాంక్ కూడా క్రెడిట్ కార్డుల విషయంలో కొత్త మార్పులు తీసుకొచ్చింది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు రీప్లేస్ మెంట్ రుసుమును పెంచింది. జూలై 1 నుంచి ఆ మార్పులు చోటు చేసుకోనున్నాయి.

READ MORE: AP Speaker Ayyanna Patrudu: స్పీకర్‌ అయ్యన్న ఆసక్తికర వ్యాఖ్యలు.. నా నోటికి ప్లాస్టర్ వేశారు..!

తాజాగా ప్రముఖ ప్రైవేటు బ్యాంక్‌ ఐసీఐసీఐ కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై(FD) వడ్డీ రేట్లను సవరించింది. ఈ బ్యాంక్ రూ.3కోట్ల లోపు డిపాజిట్లపై సాధారణ ప్రజలకు (60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు) అత్యధికంగా 7.2 శాతం వడ్డీ ఆఫర్‌ చేస్తోంది. సీనియర్ సిటిజన్‌ (60 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు)లకు 7.75 శాతం వడ్డీ రేటు అందిస్తోంది. 2024 జూన్ 29 నుంచి కొత్త రేట్లు వర్తిస్తాయి. ఇటీవల RBI, ఫిక్స్‌డ్ డిపాజిట్ల నిబంధనల్లో కొన్ని మార్పులు చేసింది. ఇంతకు ముందు రూ.2 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ ఉన్న ఏదైనా ఎఫ్‌డీని బల్క్ డిపాజిట్‌గా పరిగణించేవారు. కొత్త రూల్ ప్రకారం, రూ.3 కోట్ల వరకు ఉన్న ఏదైనా ఎఫ్‌డీని రిటైల్ ఎఫ్‌డీగా పరిగణిస్తారు. రూ.3 కోట్ల కంటే ఎక్కువ ఉన్న ఎఫ్‌డీలను మాత్రమే బల్క్ డిపాజిట్లుగా గుర్తిస్తారు. ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఐసీఐసీఐ ఎఫ్‌డీ రేట్లు సవరించింది. ఐసీఐసీఐ లేటెస్ట్‌ ఎఫ్‌డీ రేట్లు(రూ.3 కోట్ల లోపు) : సాధారణ ప్రజలకు వడ్డీ రేట్లు : 7 నుంచి 29 రోజులు టెన్యూర్‌ ఎఫ్‌డీలకు 3% వడ్డీ లభిస్తుంది. 30 నుంచి 45 రోజుల్లోపు ఎఫ్‌డీకి 3.5% రిటర్న్స్‌ అందుతాయి. 15 నుంచి 18 నెలలకు చేసిన ఎఫ్‌డీకి అత్యధికంగా 7.2% రేటు చెల్లిస్తుంది. 7 సంవత్సరాల 1 రోజు నుంచి 10 సంవత్సరాల టెన్యూర్‌కి 6.9% వడ్డీ అందుతుంది.

READ MORE: INDIAN ARMY: ఆర్మీ, నేవీ చీఫ్‌లిద్దరూ స్నేహితులే.. ఒకే పాఠశాలలో విద్యాభ్యాసం

7 నుంచి 29 రోజుల టెన్యూర్‌కి 3.5% వడ్డీ లభిస్తుంది. 30 నుంచి 45 రోజుల్లోపు డిపాజిట్లపై 4% ఆదాయం ఉంటుంది. 15 నెలల నుంచి 18 నెలల టెన్యూర్‌కి అత్యధికంగా 7.75% వడ్డీ రేటు చెల్లిస్తుంది. 7 సంవత్సరాల 1 రోజు నుంచి 10 సంవత్సరాల కాలానికి చేసిన ఎఫ్‌డీకి 7.4% వడ్డీ దక్కుతుంది. 1 సంవత్సరం నుంచి 15 నెలల కంటే తక్కువ సమయానికి చేసిన డిపాజిట్లకు 7.2% చెల్లిస్తుంది. 18 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు చేసిన ఎఫ్‌డీలకు 7.7% రేటు అందుతుంది. ఐసీఐసీఐ బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం, సవరించిన వడ్డీ రేట్లు కొత్త, రెన్యూవ్డ్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లకు వర్తిస్తాయి. ప్రీమెచ్యూర్‌ విత్‌డ్రా చేసుకుంటే, ఎఫ్‌డీని 7 రోజుల్లోపు విత్‌డ్రా చేస్తే పెనాల్టీ ఉండదు. అదే 1 సంవత్సరం లోపు విత్‌డ్రా చేస్తే 0.5 శాతం, 1 సంవత్సరం నుంచి 5 సంవత్సరాల మధ్య చేస్తే 1 శాతం పెనాల్టీ వర్తిస్తుంది. రూ.5 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లకు 1 శాతం పెనాల్టీ భరించాలి. అదే రూ.5 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ అమౌంట్‌కి 1.5 శాతం పెనాల్టీ వర్తిస్తుంది.